Jump to content

అనకాపల్లి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
అనకాపల్లి రైల్వే స్టేషను నామఫలకం

అనకాపల్లి రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వేజోను లోని విజయవాడ డివిజను లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది దేశంలో 217వ రద్దీగా ఉండే స్టేషను.[1]

విశిష్టత

[మార్చు]

అనకాపల్లి రైల్వేస్టేషను దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ డివిజను లోని చివరలో ఎ-గ్రేడ్‌లో ఉన్న స్టేషను. అనగా నెలకు రూ.కోటి పైగా ప్రయాణికుల నుంచి ఆదాయం లభిస్తున్నది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు సాధించిన అనకాపల్లి రైల్వేస్టేషను సుమారు 15 మండలాల ప్రయాణికులకు సేవలు అందిస్తున్నది.

అనకాపల్లి వాణిజ్య పరంగా దేశంలోనే ఎంతో గుర్తింపు ఉంది. బెల్లం అమ్మకాల్లో దేశంలోనే పథమ స్థానంలో ఉత్తరప్రదేశ్‌ లోని ఆపూర్‌ మార్కెట్‌ ఉండగా, రెండో స్థానం అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు ఉంది. అనకాపల్లి నుంచి బెల్లం సరుకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, రాష్టాలకు ఎగుమతి అవుతున్నది. ఇది దేశంలో 217 వ రద్దీగా ఉండే స్టేషను.[1]


వర్గీకరణ

[మార్చు]

అనకాపల్లి రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను.[2]

ఆధునిక స్టేషన్లు

[మార్చు]

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[3][4][5]

ప్రయాణీకులు ప్రయాణాలు

[మార్చు]
  • అనకాపల్లి నుంచి విజయవాడ వైపు ప్రయాణం చేయాలంటే పాసింజర్లు ఉన్నాయి.
  • విశాఖ-తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంది.
  • అనకాపల్లి నుంచి రాజమండ్రి వైపు పాసింజరు ఉంది.
  • అనకాపల్లి నుంచి కాకినాడు వైపు పాసింజరు ఉంది.
  • అనకాపల్లి నుంచి నర్సాపురం వైపు పాసింజరు ఉంది.
  • చెన్నై-హౌరా మెయిల్‌, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, లింకు ఎక్స్‌ప్రెస్‌, తిరుమల ఎక్స్‌ప్రెస్‌, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి.

మౌలిక సదుపాయాల కేటాయిపులు

[మార్చు]
  • తుని-విశాఖపట్నం మద్య షటిల్‌ రైలు
  • లిఫ్ట్‌ ఎస్కలేటర్‌ సౌకర్యం మంజూరు అయ్యాయి.
  • రెండు, మూడు ప్లాట్‌ఫారాల షెడ్ల మరమ్మతులు
  • స్టేషను అభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలు
  • ప్లాట్‌ఫారాల పైకప్పులకు మరమ్మతులు
  • ఒకటో ప్లాట్‌ఫారంపై మరమత్తు పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ పనులు పూర్తయిన వెంటనే రెండు, మూడు ప్లాట్‌ఫారాల షెడ్ల మరమ్మతులు చేపడతారు.

చర్చలు

[మార్చు]

రైల్వే అధికారులుతో స్థానిక నాయకులు స్టేషను‌ అభివృద్ధి, సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల హాల్ట్‌ విషయాలు గురించి చర్చలు జరిగాయి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  2. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 2016-01-28. Retrieved 18 September 2016.
  3. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  4. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  5. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.

చిత్రమాలిక

[మార్చు]

మూసలు , వర్గాలు

[మార్చు]