Jump to content

వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2023

వికీపీడియా నుండి
2023 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు
01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26 • 27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

01 వ వారం

  • ... ఎం. పతంజలి శాస్త్రి భారతదేశపు రెండవ ప్రధాన న్యాయమూర్తి అనీ!
  • ... హేలోజెన్ లను క్రిమిసంహారకాలుగా ఉపయోగిస్తారనీ!
  • ... గృహస్థాశ్రమం పై హిందూ ఆశ్రమ వ్యవస్థలో విస్తృతమైన చర్చ ఉందనీ!
  • ... స్వీడన్ లోని యిటర్బీ అనే గ్రామం పేరు మీద నాలుగు రసాయనిక మూలకాలకు పేర్లు పెట్టారనీ!
  • ... హిందూస్తాన్ టైమ్స్ పత్రిక భారత స్వాతంత్ర్యోద్యమ కాలంలో జాతీయవాద దినపత్రికగా ప్రముఖ భూమిక పోషించిందనీ!

02 వ వారం

  • ... భారతీయ నటుడు కబీర్ బేడీ పలు అంతర్జాతీయ చిత్రాల్లో నటించాడనీ!
  • ... మోలిబ్డినం మూలకాన్ని ఎక్కువగా ఉక్కు మిశ్రమాల్లో ఉపయోగిస్తారనీ!
  • ... కీళ్ళకు సంబంధించిన గౌటు వ్యాధి సాధారణంగా కాలి బొటనవేలు వాపుతో ప్రారంభం అవుతుందనీ!
  • ... విద్యుత్ చేపలు సుమారు 650 వోల్టుల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేయగలవనీ!
  • ... మహారాష్ట్రలో రైస్ మిల్లులు పుష్కలంగా ఉన్న గోందియా పట్టణాన్ని రైస్ సిటీ అని పిలుస్తారనీ!

03 వ వారం

  • ... భారతదేశపు చరిత్రలో అత్యధిక కాలం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసింది వై.వి. చంద్రచూడ్ అనీ!
  • ... వీడియోటేపు లో సమాచారాన్ని లీనియర్ పద్ధతిలో భద్రపరచడం వలన, డేటాను చదవడం ఆలస్యం అవుతుందనీ!
  • ... శ్రీకృష్ణుడు తన చివరి ప్రస్థానంలో ఉద్ధవుడికి ఉపదేశించిన బోధ ఉద్ధవ గీతగా పేరు గాంచిందనీ!
  • ... ఇండోనేషియా లోని జావా దీవి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దీవి అనీ!
  • ... భారత ప్రభుత్వ సంస్థ ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ప్రపంచంలో అతిపెద్ద సామాజిక భద్రత సంస్థల్లో ఒకటి అనీ!

04 వ వారం

  • ... ఆవర్తన పట్టికలోని మూలకాల్లో రీనియం చిట్టచివరి స్థిరమైన మూలకం అనీ!
  • ... భారత జాతీయ బొగ్గు గనుల సంస్థ కోల్ ఇండియా ప్రధాన కార్యాలయం కోల్‌కత లో ఉందనీ!
  • ... భారత రైల్వే ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలదనీ!
  • ... హిమాలయ పర్వత సానువుల్లో పర్వతారోహణకు జోషిమఠ్ను ప్రవేశ ద్వారంగా పరిగణిస్తారనీ!
  • ... శ్రీకృష్ణుడు తన మేనమామ కంసుడికి సంహరించిన తర్వాత అతని తండ్రి ఉగ్రసేనుడు మళ్ళీ రాజ్యపరిపాలన చేశాడనీ!

05 వ వారం

  • ... భారతదేశంలో రబ్బర్ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన రబ్బర్ బోర్డ్ ప్రధాన కార్యాలయం కేరళ లోని కొట్టాయంలో ఉందనీ!
  • ... సర్ క్రీక్ భారతదేశం పాకిస్థాన్ ల మధ్యన ఒక వివాదాస్పద సరిహద్దు అనీ!
  • ... స్టోన్‌హెంజ్ను యునైటెడ్ కింగ్‌డం లో అత్యంత ప్రసిద్ధమైన మైలురాళ్ళలో ఒకటిగా పరిగణిస్తారనీ!
  • ... ఉత్తర లండన్ లో ఏర్పాటు చేయబడిన ఇండియా హౌస్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందనీ!
  • ... గోల్డెన్ గ్లోబ్ పురస్కారం అంతర్జాతీయంగా సినిమాలు, టెలివిజన్ రంగంలో ఇచ్చే పురస్కారాలనీ!

06 వ వారం

07 వ వారం

08 వ వారం

09 వ వారం

10 వ వారం

  • ... షాన్ గా పేరుపొందిన భారతీయ గాయకుడి అసలు పేరు శంతను ముఖర్జీ అనీ!
  • ... కొల్లూరు మూకాంబిక దేవాలయం లో మహా లక్ష్మి, మహా సరస్వతి, మహా కాళి కలిసి ఉన్న రూపం ఉంటుందనీ!
  • ... బెల్‌గ్రేడ్ ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి మానవావాసంగా ఉన్న నగరాల్లో ఒకటనీ!
  • ... భారతదేశంలో మొట్టమొదటి యాంటీ బయోటిక్ తయారీ సంస్థ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ అనీ!
  • ... బైబిల్ కథానాయకుడు డేవిడ్ విగ్రహాన్ని మైఖేలాంజిలో 1500 వ దశకంలో సృష్టించాడనీ!

11 వ వారం

  • ... శాస్ర్తవేత్త క్లాడ్ షానన్ ను సమాచార సిద్ధాంత పితామహుడిగా భావిస్తారనీ!
  • ... సంస్కృత కవి కాళిదాసు పేరు మీదుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్ పురస్కారం అందజేస్తుందనీ!
  • ... కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో ప్రధానంగా మాట్లాడే కొడవ భాష అంతరించిపోతున్న ద్రవిడభాష అనీ!
  • ... తిరువళ్ళూరులోని వీరరాఘవస్వామి దేవాలయం వైష్ణవులు కీర్తించే 108 దివ్యదేశాల్లో ఒకటనీ!
  • ... ప్రపంచంలో అందరికీ విద్యకు సంబంధించిన వనరులు రూపొందించడం కోసం ఉచిత విద్యా వనరులు ఉన్నాయనీ!

12 వ వారం

  • ... జుబేదా మొట్టమొదటి భారతీయ టాకీ చిత్రం ఆలం ఆరా చిత్రంలో నటించిన నటీమణి అనీ!
  • ... కాకతీయుల కాలం నాటి ఆది మహావిష్ణువు ఆలయం తెలంగాణాలోని యాదాద్రి భువనగిరి జిల్లా సమీపంలో 2015లో బయట పడిందనీ!
  • ... ఆధునిక గ్రీకు వర్ణమాల లో 24 అక్షరాలు ఉంటాయనీ!
  • ... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన మేఘా-ట్రోపిక్స్ జల చక్రాన్ని అధ్యయనం చేస్తుందనీ!
  • ... పంట వలయాలు పంట చేలల్లో కొంత భాగాన్ని చదును చేసి ఏర్పాటు చేసే రకరకాల ఆకృతులనీ!

13 వ వారం

  • ... రాణి కమలాపతి 18 వ శతాబ్దానికి చెందిన గోండు జాతి రాణి అనీ!
  • ... పశ్చిమ క్షాత్రపులు మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పలు బౌద్ధ గుహలను నిర్మించారనీ!
  • ... 1959 లో విడుదలైన ఆంగ్ల చిత్రం బెన్ హర్ మొత్తం 11 విభాగాల్లో ఆస్కార్ పురస్కారం సాధించిందనీ!
  • ... డిమార్ట్ ను వాల్‌మార్ట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారనీ!
  • ... ప్రపంచమంతటా మంచి ప్రజాదరణ పొందిన రూబిక్స్ క్యూబ్ పజిల్ సృష్టికర్త ఎర్నో రూబిక్ అనీ!

14 వ వారం

  • ... శాస్త్రీయ సంగీత విద్వాంసుడు డి వి మోహన కృష్ణ నాటక రంగ ప్రముఖుడు డి. వి. సుబ్బారావు మనవడనీ!
  • ... జోర్డాన్ లోని పెట్రా చారిత్రక కట్టడాలకు పేరు గాంచిందనీ!
  • ... కర్ణాటకలో పుట్టిన భద్ర నది, తుంగ నదితో కలిసి తుంగభద్ర నదిగా మారి, ఆంద్రప్రదేశ్ లో కృష్ణానదిలో కలుస్తుందనీ!
  • ... నృత్య, నాటక రంగాల్లో ప్రతిభ కనబరిచిన 40 ఏళ్ళ లోపు అత్యుత్తమ కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందజేస్తారనీ!
  • ... తమిళనాడులోని వెల్లూరు తోలు ఉత్పత్తుల ఎగుమతిలో ప్రసిద్ధి పొందిందనీ!

15 వ వారం

  • ... జయంత భట్టుడు న్యాయదర్శనంపై గ్రంథాలు రాసిన సంస్కృత పండితుడు అనీ!
  • ... రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాలు సమైక్యం అయ్యేందుకు ఏర్పడ్డ సంస్థ ఐరోపా సమాఖ్య అనీ!
  • ... నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్, ఆమె భర్త కలిసి కళల్లో సాంప్రదాయ విలువల పరిరక్షణ కోసం కళాక్షేత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేశారనీ!
  • ... భూమిపై అన్నింటికన్నా పైన ఉండే పొర భూపటలం మొత్తం భూమి పరిమాణంలో ఒక్క శాతమే ఉంటుందనీ!
  • ... రాణి తేనెటీగ రోజుకు 2000 దాకా గుడ్లు పెట్టగలదనీ!

16 వ వారం

17 వ వారం

18 వ వారం

  • ... రాజేష్ టచ్‌రివర్ సామాజిక సమస్యలపై తీసే చిత్రాలతో గుర్తింపు పొందాడనీ!
  • ... అమెరికాలోని షికాగో లో ప్రత్యేకించి మహిళలు, పిల్లల కోసం ఉమెన్ & చిల్డ్రన్ ఫస్ట్ అనే దుకాణం ఉందనీ!
  • ... కాంచీపురంలోని ఉలగలంద పెరుమాళ్ ఆలయం వైష్ణవులకు పవిత్రమైన 108 దివ్యదేశాల్లో ఒకటనీ!
  • ... మానవ దృష్టికి ప్రధామైన దృష్టి నాడి మెదడుకు దృశ్యాలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుందనీ!
  • ... గణిత శాస్త్రంలో ముఖ్యమైన విభాగమైన బీజ గణితం లో పురాతన భారతీయ శాస్త్రవేత్తలు కృషి చేశారనీ!

19 వ వారం

  • ... రాణి శంకరమ్మ ఆంథోల్‌ సంస్థానాన్ని పాలించిన మహారాణి అనీ!
  • ... తమిళనాడు శ్రీరంగం ఆలయంలో శ్రీరంగనాథుని సతి రంగనాయకి అమ్మవారు అనీ!
  • ... ఆంగ్ల చిత్రాలలో ప్రముఖ స్థానం సాధించిన లారెన్స్ ఆఫ్ అరేబియా థామస్ ఎడ్వర్డ్ లారెన్స్ అనే బ్రిటీషు సైనికుడి జీవితం ఆధారంగా రూపొందినదనీ!
  • ... సంగీత పరికరంగా ఉపయోగిస్తున్న ట్రంపెట్ ఒకప్పుడు యుద్ధాలలో, వేటలో సిగ్నల్స్ కోసం వాడేవారనీ!
  • ... సంపీడన వాయువు ను పరిశ్రమల్లో వివిధ అవసరాల కోసం విస్తృతంగా ఉపయోగిస్తారనీ!

20 వ వారం

  • ... రోబోటిక్స్ అనే పద సృష్టికర్త వైజ్ఞానిక కల్పనా రచయిత ఐజాక్ అసిమోవ్ అనీ!
  • ... హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ నిజాం రాజు 1846 లో నిర్మించాడనీ!
  • ... వంపులు తిరిగిన రోడ్లపైన వాహనాలు జారిపోకుండా అభికేంద్ర బలం పని చేస్తుందనీ!
  • ... హిమాలయాల్లోని గంగోత్రి ఆలయం గంగాదేవికి అంకితం చేయబడిన అత్యంత ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన ఆలయమనీ!
  • ... కర్ణాటక సంగీతంలో హేమవతి రాగం నాదస్వర విద్వాంసులకు ప్రీతికరమైనదనీ!

21 వ వారం

  • ... ప్రముఖ నర్తకి చంద్రలేఖ సర్దార్ వల్లభాయ్ పటేల్ మేనకోడలు అనీ!
  • ... హార్మోన్ అనే రసాయనాలు శరీరంలో చాలా రకాలైన జీవక్రియలను నియంత్రిస్తాయనీ!
  • ... కేరళ లోని తిరువనంతపురం లో సా.శ.పూ 1000 నుంచి దేశ విదేశాలతో వర్తకం జరుగుతున్నదనీ!
  • ... సిరిసిల్ల వ్యవసాయ కళాశాల తెలంగాణా రాష్ట్రంలో రెండవ వ్యవసాయ కళాశాల అనీ!
  • ... పిల్లల కోసం బొమ్మ ఇటుకలు తయారు చేసే లెగో గ్రూప్ ప్రధాన కార్యాలయం డెన్మార్క్ లో ఉందనీ!

22 వ వారం

  • ... డినా బొలౌర్టే పెరూ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలనీ!
  • ... నాడీకణం శరీరంలో వివిధ క్రియలను నియంత్రించే నాడీ వ్యవస్థలో ప్రధాన భాగమనీ!
  • ... శ్రీవైష్ణవుల ఆలోచనా సరళిని అనుసరించి రాయబడిన మొట్టమొదటి గద్యం శ్రీరంగ గద్యం అనీ!
  • ... గ్రామీణ ప్రాంతంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం భారత కేంద్రప్రభుత్వం గురుకుల విద్యావిధానంలో నిర్వహిస్తున్న పాఠశాల వ్యవస్థ జవహర్ నవోదయ విద్యాలయం అనీ!
  • ... కాటన్ జిన్ యంత్రం పత్తిని వాటి విత్తనాలను వేరు చేసి మానవ శ్రమ తగ్గిస్తుందనీ!

23 వ వారం

24 వ వారం

25 వ వారం

26 వ వారం

  • ... రామానుజాచార్యుడు తన శిష్యుడైన పరాశర భట్టర్ ను తన తదనంతరం శ్రీవైష్ణవానికి ఉత్తరాధికారిగా నియమించాడనీ!
  • ... బ్రెజిల్ లో జరిగే రియో కార్నివాల్ ప్రపంచంలో అతి పెద్ద ఉత్సవంగా పరిగణించబడుతుందనీ!
  • ... గ్రావిటీ డ్యామ్ నీటిని నిలుపుకోవడానికి గురుత్వాకర్షణ శక్తిపై ఆధారపడుతుందనీ!
  • ... హంపిలోని లోటస్ మహల్ విజయనగర సామ్రాజ్య కాలంలో అంతఃపుర స్త్రీల వినోదం కోసం నిర్మించబడినదనీ!
  • ... 2023 సుడాన్ అల్లర్ల నుంచి భారతీయులను తరలించడానికి ప్రభుత్వం ఆపరేషన్ కావేరి చేపట్టిందనీ!

27 వ వారం

  • ... ఆంధ్రప్రదేశ్ కు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి దేశవ్యాప్తంగా అనేక వార్తాపత్రికల్లో పనిచేసిన ప్రముఖ జర్నలిస్టు అనీ!
  • ... కర్ణాటకలోని మంగుళూరులో ఉన్న పనంబూరు బీచ్ అత్యంత సురక్షితమైన సముద్ర తీర ప్రాంతాల్లో ఒకటనీ!
  • ... ఎల్లప్పుడూ పారే నీటి మధ్యలో వంతెనను నిర్మించడానికి కాఫర్‌డ్యామ్ వాడతారనీ!
  • ... నేపాల్, టిబెట్ లో లభించే చుర్పి అనే జున్నును మజ్జిగ నుంచి తయారు చేస్తారనీ!
  • ... భారతదేశంలో ఉత్పత్తి అయ్యే పారిశ్రామిక వస్తువులకు బిఐఎస్ ప్రామాణిక గుర్తింపు ఇస్తుందనీ!

28 వ వారం

  • ... 2021 లో సామాజిక శాస్త్రాలలో కృషికి గాను ప్రతీక్ష బక్షి ఇన్ఫోసిస్ ప్రైజు గెలుచుకుందనీ!
  • ... కర్ణాటక లోని కోటిలింగేశ్వర దేవాలయం లోని శివలింగం ప్రపంచంలోని అతి పెద్ద శివలింగాల్లో ఒకటనీ!
  • ... కాంప్‌బెల్ బే జాతీయ ఉద్యానవనం అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న ప్రసిద్ధ వన్యప్రాణి అభయారణ్యం అనీ!
  • ... పీతల్లో అతిపెద్దది, తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే కొబ్బరి పీత జాతికి చెందినదనీ!
  • ... ఎవరెస్టు పర్వతం తర్వాత రెండవ అత్యంత ఎత్తయిన పర్వతం కే2 అనీ!

29 వ వారం

  • ... బీహార్ కు చెందిన సుభద్రా దేవి మధుబని చిత్రకళలో పేరు గాంచిందనీ!
  • ... కేరళను పాలించిన ట్రావెన్ కూర్ రాజులు 1859 వరకు రొమ్ము పన్ను విధించే వారనీ!
  • ... మహారాష్ట్రలోని ఎల్లోరా గుహాలయాల్లో భాగమైన కైలాస దేవాలయం ఒకేరాతితో చెక్కబడిన అతిపెద్ద దేవాలయాల్లో ఒకటనీ!
  • ... తెలుగు క్లాసిక్‌ గోరింటాకు (1979) చిత్రంలోని కథానాయకి వక్కలంక పద్మ ఇప్పుడొక అంతర్జాతీయ జర్నలిస్ట్‌ అనీ!
  • ... నేపాల్ కు చెందిన షెర్పా ప్రజలు పర్వతారోహణకు ప్రసిద్ధి చెందిన వారనీ!

30 వ వారం

  • ... క్రికెట్ క్రీడాకారిణి శుభాంగి కులకర్ణి 1985లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గెలుచుకుందనీ!
  • ... జమ్ము కాశ్మీర్ లోని గుల్మార్గ్ అందమైన పూలతోటలకు ప్రసిద్ధి గాంచిందనీ!
  • ... మరాఠ్వాడా నిజాం పాలనలో మరాఠీ మాట్లాడే వారితో ఏర్పడ్డ ప్రాంతమనీ!
  • ... చెన్నైలోని అడయార్ ప్రాంతంలో 450 సంవత్సరాల వయసు కలిగిన పురాతన అడయార్ మర్రి చెట్టు ఉందనీ!
  • ... జపాన్ లో ఉన్న ఎషిమా ఒహాషి వంతెన ప్రపంచంలో మూడవ అతిపెద్ద వంతెన అనీ! (చిత్రంలో)

31 వ వారం

  • ... చదరంగంలో ఇంటర్నేషనల్ మాస్టర్ సాధించిన మహిళా గ్రాండ్ మాస్టర్ సుబ్బరామన్ విజయలక్ష్మి అనీ!
  • ... భారతదేశంలో పండించే స్ట్రాబెర్రీలలో 85 శాతం మహాబలేశ్వర్ ప్రాంతంలో పండుతాయనీ!
  • ... మార్షల్ ఆర్ట్స్ చిత్రం ఎంటర్ ది డ్రాగన్ నిర్మాణానికి అయిన ఖర్చుకు 400 రెట్లు వసూళ్ళు సాధించిందనీ!
  • ... ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందనీ!
  • ... కేరళలోని కిలిమనూరు ప్యాలెస్ ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ పూర్వీకుల జన్మస్థలం అనీ!

32 వ వారం

  • ... యునైటెడ్ కింగ్‌డం కి మొదటి మహిళా ప్రధాన మంత్రిగానే కాక ఆ పదవిలో దీర్ఘకాలం ఉన్నది మార్గరెట్ థాచర్ అనీ!
  • ... మహారాష్ట్రకు చెందిన విదర్భ ప్రాంతం ఒకప్పుడు శాతవాహనుల పరిపాలనలో ఉండేదనీ!
  • ... విశాఖ వ్యాలీ స్కూల్ విశాఖపట్నంలోని పురాతన పాఠశాలల్లో ఒకటనీ!
  • ... కన్యాకుమారిలో ఉన్న ప్రాచీన తమిళ కవి తిరువళ్ళువర్ విగ్రహం ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమనీ!
  • ... సాహస క్రీడ బంగీ జంపింగ్ న్యూజీలాండ్ కి చెందిన ఎ. జె. హ్యాకెట్ ప్రయత్నాల వల్ల ప్రాచుర్యంలోకి వచ్చిందనీ!

33 వ వారం

34 వ వారం

  • ... భట్టోజి ధీక్షితులు సంస్కృత వ్యాకరణ గ్రంథమైన సిద్ధాంత కౌముది రచయిత అనీ!
  • ... ఇజ్రాయెల్ జాతీయ పతాకంలోని నక్షత్రం జుడాయిజంతో అనుబంధం కలిగిఉన్నదనీ!
  • ... కేరళలోని కొట్టాయం ను ద సిటీ ఆఫ్ లెటర్స్ అని పిలుస్తారనీ!
  • ... ఒక నిర్దిష్టమైన సంఘటనలు, ముఖ్యమైన వ్యక్తులు లేదా సంఘటనలు గౌరవించుకోవడానికి స్మారక నాణెం విడుదల చేస్తారనీ!
  • ... భారతదేశానికి రిజర్వు బ్యాంకు లాగే అమెరికాకు ఫెడరల్ రిజర్వ్ పనిచేస్తుందనీ!

35 వ వారం

  • ... రాజా పృథు 13వ శతాబ్దానికి చెందిన ఈశాన్య భారతదేశపు పరిపాలకుడనీ!
  • ... భారత్, సోవియట్ యూనియన్ మైత్రికి చిహ్నంగా మైత్రి బాగ్ స్థాపించబడిందనీ!
  • ... అన్నామలై యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వ అనుమతితో దూరవిద్యను అందించే మొట్టమొదటి భారతీయ విశ్వవిద్యాలయం అనీ!
  • ... మామూలు కోళ్ళతో పోలిస్తే కడక్‌నాథ్ కోడి లో 25 శాతం ఎక్కువ పోషకాలు ఉంటాయనీ!
  • ... సుదూర ప్రాంతాలకు ధ్వని, ఇంకా ఇతర మాధ్యమాలను ప్రసారం చేసే సాంకేతికతను టెలిఫోనీ అంటారనీ!

36 వ వారం

  • ... మరాఠీ గాయకురాలు అంజలి మరాఠీ 16 సంవత్సరాల వయసులోనే జాతీయ పురస్కారం అందుకుందనీ!
  • ... చక్కట్ల దండ కవి దాసు శ్రీరాములు రాసిన అచ్చ తెలుగు శతకం అనీ!
  • ... పండగలు, ప్రముఖ వ్యక్తులు, సంఘటనలు స్మరించుకోవడానికి గూగుల్ మొదటి పేజీలో గూగుల్ డూడుల్ ప్రదర్శిస్తారనీ!
  • ... ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న యోగా సాంప్రదాయానికి పతంజలి యోగసూత్రాలు మూల గ్రంథమనీ!
  • ... ఉడుములు ప్రపంచంలో అతిపెద్దదైన బల్లి జాతి అనీ!

37 వ వారం

  • ... పోప్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చి పదవికి ఎన్నికైన అమెరికా ఖండం నుంచి ఎన్నికైన మొట్టమొదటి వ్యక్తి అనీ!
  • ... ఎలక్ట్రికల్ ఉపకరణాలు తయారు చేసే హావెల్స్ సంస్థ 50 కి పైగా దేశాలలో కార్యాలయాలు కలిగిఉందనీ!
  • ... కావడి ఆట్టం తమిళనాడులో సుబ్రహ్మణ్యారాధనలో భాగంగా చేసే జానపద నృత్యం అనీ!
  • ... చెక్ రిపబ్లిక్ రాజధానియైన ప్రేగ్ లో 1410 లో స్థాపించిన ఖగోళ గడియారం ఇప్పటికి కూడా పనిచేస్తున్నదనీ!
  • ... సోనామార్గ్ జమ్మూ కాశ్మీర్ లో ప్రసిద్ధ పర్యాటక క్షేత్రం అనీ!

38 వ వారం

39 వ వారం

40 వ వారం

  • ... విష్ణుభక్తులలో ఒకడైన నమ్మాళ్వార్ మహావిష్ణువు సైన్యానికి ప్రధాన సేనాధిపతి అయిన విష్వక్సేనుడి అవతారంగా భావిస్తారనీ!
  • ... తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగ భాగం నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ నుంచే జరుగుతోందనీ!
  • ... ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో భాగమైన బరోడా రాష్ట్రం మరాఠా గైక్వాడ్ వంశస్థుల పాలించిన రాజ్యం అనీ!
  • ... 1857 లో భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కంటే ముందే భారత సిపాయిలు ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా వెల్లూరు తిరుగుబాటు చేశారనీ!
  • ... కావ్యప్రకాశము అనే గ్రంథాన్నిమొదటిసారిగా పరిచయం చేసింది మమటాచార్య అనే పండితుడనీ!

41 వ వారం

42 వ వారం

43 వ వారం

  • ... మైత్రేయి ప్రాచీన భారతదేశంలో వేద కాలానికి చెందిన మహిళా తత్వవేత్త అనీ!
  • ... ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ద్వారా బ్రిటిష్ ఇండియా పాలనలో భారతీయుల ప్రమేయాన్ని పెంపొందించిందనీ!
  • ... ఢిల్లీలోని ప్రముఖులు నివసించే రేస్ కోర్సు రోడ్డును ఇటీవల లోక్ కళ్యాణ్ మార్గ్ అని పేరు మార్చారనీ!
  • ... 2019 లో ఫ్రీఫైర్ వీడియోగేమ్ ను అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్నారనీ!
  • ... చంద్రా లోకం అనేది జయదేవుడు రాసిన అలంకార గ్రంథం అనీ!

44 వ వారం

  • ... చంద్రగోమిన్ నలంద విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఒక పురాతన కవి అనీ!
  • ... పిల్లల టీవీ ధారావాహిక ఛోటా భీమ్ హైదరాబాదు కేంద్రంగా ఉన్న గ్రీన్ గోల్డ్ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థ రూపొందిస్తుందనీ!
  • ... లేజర్ నెట్ శక్తివంతమైన కాంతికిరణాల ద్వారా ఇంటర్నెట్ ను అందించే సాంకేతికత అనీ!
  • ... కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) భారతదేశంలో అన్ని ప్రభుత్వాలను ఆడిట్ చేసే సంస్థ అనీ!
  • ... హిమాచల్ ప్రదేశ్ లోని కుల్లూ లోయ విశాలమైన ఆపిల్ తోటలకు ప్రసిద్ధి గాంచిందనీ!

45 వ వారం

46 వ వారం

  • ... రైల్వే రక్షక దళానికి చెందిన రేఖా మిశ్రా వందలాది మంది తప్పిపోయిన పిల్లలను కనుగొన్నందుకు గాను నారీశక్తి పురస్కారం అందుకున్నదనీ!
  • ... భారతదేశంలో అత్యంత పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి అలోపిబాగ్ లో ఉందనీ!
  • ... భారతదేశపు తొట్టతొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాత చంద్ర నాయుడు అనీ, ఆమె సి.కె.నాయుడు కుమార్తె అనీ!
  • ... బెంగాల్ ప్రెసిడెన్సీ బ్రిటిష్ ఇండియా పరిపాలనలో అతి పెద్ద పరిపాలనా విభాగమనీ!
  • ... కామన్‌వెల్త్ క్రీడలను అన్నింటికన్నా ఎక్కువ సార్లు నిర్వహించిన దేశం ఆస్ట్రేలియా అనీ!

47 వ వారం

48 వ వారం

  • ... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన తొలితరం నటీమణుల్లో ఆస్టా నీల్సన్ ఒకరనీ!
  • ... ఒకప్పుడు క్రికెట్లో అండర్‌ఆర్మ్ బౌలింగే సరైనదనీ, ప్రస్తుత బౌలింగు యాక్షను అప్పటి క్రికెట్ చట్టాల ప్రకారం చట్టవిరుద్ధమనీ!
  • ... భారతీయ సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం సింగపూరు దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడనీ!
  • ... మామూలు బియ్యానికి మరిన్ని పోషకాలు జోడించి బలవర్ధక బియ్యం తయారు చేస్తారనీ!
  • ... వసుచరిత్రము కవిత్రయ భారతంలోని కథను విస్తరిస్తూ రామరాజ భూషణుడు రాసిన కావ్యమనీ!

49 వ వారం

50 వ వారం

51 వ వారం

  • ... బాబ్ బీమన్ 1968 లో లాంగ్ జంప్ లో నెలకొల్పిన ప్రపంచ రికార్డు 23 ఏళ్ళ పాటు అలాగే ఉందనీ!
  • ... క్రికెట్‌లో ఒక రకమైన రనౌట్‌ను అనధికారికంగా మన్కడింగ్ అంటారనీ, అది ప్రఖ్యాత భారత క్రికెటరు వినూ మన్కడ్ నుండి వచ్చిందనీ!
  • ... నాగేంద్ర ప్రసాద్ నృత్య దర్శకుడు సుందరం మాస్టర్ మూడవ కుమారుడు అనీ!
  • ... ప్రాచీన సంస్కృత గద్యమైన వాసవదత్త గ్రంథ రచయిత సుబంధుడు అనీ!
  • ... భారతదేశపు పట్టణాలు, నగరాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన కోసం స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రారంభించారనీ!

52 వ వారం

  • ... అమెరికాకు చెందిన కార్ల్ లూయిస్ అత్యధిక ఒలంపిక్ పతకాలు గెలుచుకున్న వారిలో ఒకడనీ!
  • ... ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు, 1882లో క్రికెట్ సిరీస్‌ను ఓడిపోయినపుడు ది స్పోర్టింగ్ టైమ్స్ పత్రిక, ఇంగ్లీష్ క్రికెట్‌ మరణించిందనీ, శవాన్ని దహనం చేసి ఆ చితాభస్మాన్ని ఆస్ట్రేలియా తీసుకువెళ్తారనీ రాసినపుడు, యాషెస్ సీరీస్ పుట్టిందనీ!
  • ... గ్రాంట్ ఫ్లవర్ జింబాబ్వే దేశపు అత్యుత్తమ క్రికెట్ ఆటగాళ్ళలో ఒకడనీ!
  • ... సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రజాప్రయోజనాల కోసం ఆహార పరిశోధన లాంటి కార్యక్రమాలు చేపడుతుందనీ!
  • ... కార్ల్ జంగ్ మానసిక విశ్లేషణలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వాడనీ!