Jump to content

ఎర్నెస్ట్ హెమింగ్‌వే

వికీపీడియా నుండి

ఎర్నెస్ట్ హెమింగ్‌వే (1899-1961) ఒక అమెరికన్ నవలా రచయిత కథా రచయిత. 1954లో సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత. అతను తన పోరాట జీవితంలోని విభిన్న అనుభవాలను అత్యంత సృజనాత్మకంగా రాయడంలో విజయం సాధించాడు. అనేక కళాత్మక రచనలను అందించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఎర్నెస్ట్ హెమింగ్‌వే జూలై 21, 1899న అమెరికాలో లోని ఇల్లినాయిస్‌లోని ఓక్ పార్క్‌లో జన్మించాడు. అతని పూర్తి పేరు ఎర్నెస్ట్ మిల్లర్ హెమింగ్‌వే. అతని తండ్రి వైద్యుడు. [1]

చిన్నతనంలో, హెమింగ్‌వేకి చదవడం రాయడం పట్ల పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అతను పాఠశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపేవాడు కాదు. అతనికి 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతోంది. అప్పుడు అతను సైన్యంలో చేరాలనుకున్నాడు. కానీ సైనిక సిబ్బంది అతడిని సైన్యంలోకి రావడానికి అతనికి అవగాహనలేదని చెప్పాడు. దీంతో అతను నిరాశ చెందాడు. కాన్సాస్ సిటీలో వార్తాపత్రిక రిపోర్టర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. 1918 లో, అతను రెడ్‌క్రాస్‌లో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. 1920లో మళ్లీ జర్నలిజం రంగంలోకి వచ్చి 1926 వరకు జర్నలిస్టుగా పనిచేశారు. తర్వాత కూడా జర్నలిజంపై అతని ప్రేమ కొనసాగింది.

హెమింగ్‌వే జీవితం చాలా కష్టంగా సాగింది. అతను చాలా పేదరికాన్ని అనుభవించాడు. ప్రారంభంలో, హెమింగ్‌వే పారిస్‌లో చాలా సంవత్సరాలు పేదరికంలో గడిపాడు.

రచనలు

[మార్చు]

ప్రారంభ కాలంలో, హెమింగ్‌వే రచనలు 'త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయెమ్స్' 1923లో 'ఇన్ అవర్ టైమ్' 1925లో పత్రికలలో ప్రచురించబడ్డాయి. కానీ ఇది అతనికి కీర్తి ఆర్థిక లాభం తీసుకురాలేదు. 1926లో 'సన్ ఆల్సో రైజెస్ పుస్తకం' ప్రచురితమైనప్పుడు ఆర్థికంగా పుంజుకున్నాడు.[2] 1927లో 'మ్యాన్ వితౌట్ ఉమెన్' ప్రచురణ తర్వాత, అతని రచనలకు అమెరికా ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. కథలు పత్రికలలో విస్తారంగా కనిపించడం ప్రారంభించాయి. 1929లో, కేవలం 30 సంవత్సరాల వయస్సులో, అతని ప్రసిద్ధ నవల ఎ ఫేర్‌వెల్ టు ఆర్మ్స్ ప్రచురించబడింది. ఇది సంచలనం సృష్టించి హెమింగ్‌వే విస్తృతమైన కీర్తిని సాధించిపెట్టింది.

మూలాలు

[మార్చు]
  1. नोबेल पुरस्कार विजेता साहित्यकार, राजबहादुर सिंह, राजपाल एंड सन्ज़, नयी दिल्ली, संस्करण-2007, पृ०-183.
  2. नोबेल पुरस्कार विजेता साहित्यकार, राजबहादुर सिंह, राजपाल एंड सन्ज़, नयी दिल्ली, संस्करण-2007, पृ०-183.