Jump to content

దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి

వికీపీడియా నుండి

దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి భారతీయ సీనియర్ జర్నలిస్ట్. ఆమన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి మాజీ చైర్మన్‌. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రిక మొదలైన మీడియా సంస్థల్లో ఆయన ఉన్నత హోదాలో పని చేసాడు.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామంలో ఆయన జన్మించాడు. ఆయన చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో పదవ తరగతి వరకు చదివాడు. అనంతరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ పట్టాపుచ్చుకున్నాడు.

కెరీర్

[మార్చు]

ఆంధ్రప్రభ ద్వారా 1978లో పాత్రికేయ రంగంలో అడుగు పెట్టిన ఆయన దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగాడు. దేశంలో ఉన్న ప్రముఖ మీడియా సంస్థల్లో ఉన్నత హోదాలో పని చేసాడు. రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై సెవెన్ రోడ్స్ జంక్షన్ పేరుతో రాసిన కాలమ్స్ తో ఆయన ప్రసిద్ధిచెందాడు. ఆయన బీబీసీ రేడియోలోనూ పనిచేసాడు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేసాడు.

ఆయన 2019 నుండి సుమారు మూడు సంవత్సరాల పాటు ఏపిపిఏ చైర్మన్‌గా పనిచేసాడు.

మరణం

[మార్చు]

2023 మార్చి 22న ఆయన కన్నుమూసాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "AP Press Academy Ex President Devireddy Srinath Reddy Passed Away - Sakshi". web.archive.org. 2023-03-23. Archived from the original on 2023-03-23. Retrieved 2023-03-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)