Jump to content

వక్కలంక పద్మ

వికీపీడియా నుండి
వక్కలంక పద్మ
జననం
న్యూఢిల్లీ
జాతీయతఇండియన్
ఇతర పేర్లుపద్మ రావు
వృత్తిసినిమా నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్‌
తల్లిదండ్రులు
బంధువులువక్కలంక స్వప్నసుందరి (సోదరి)

వక్కలంక పద్మ (జననం 1959 జూన్ 17) భారతీయ సినిమా నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్‌.[1] ఆమె తెలుగు సినిమా ప్రముఖ గాయని వక్కలంక సరళ కూతురు.

కెరీర్

[మార్చు]

న్యూఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించిన వక్కలంక పద్మ 19 ఏళ్ల వయసులో ఒకే ఒక సినిమా గోరింటాకు (1979) లో నటించినా తెలుగు సినిమా ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయింది.[2] దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన వక్కలంక పద్మ నటించగా సుజాత, సావిత్రి మఖ్యపాత్రలు పోషించారు.

ఆ తరువాత ఆమె ప్రముఖ జర్మన్ మీడియాకు అంతర్జాతీయ జర్నలిస్ట్‌గా వ్యవహరిస్తోంది.

వ్యక్తిగతం

[మార్చు]

తెలుగు సినిమా గాయని వక్కలంక సరళకు ఇద్దరు కూతుర్లు వక్కలంక స్వప్నసుందరి, వక్కలంక పద్మ కాగా ఒక కొడుకు ఉన్నాడు. 1979లో విడుదలైన గోరింటాకు సినిమాలో వక్కలంక పద్మ నటించింది.[3] ఇక స్వప్నసుందరి ప్రతి సంవత్సరం తల్లి జ్ఞాపకార్ధం, ఆగష్టు 8న స్వరలహరి అనే కర్ణాటక సంగీత కచ్చేరిని నిర్వహిస్తుంది. ఈ కచ్చేరీలో యువ గాయనీగాయకులు వక్కలంక సరళ స్వరపరచిన పాటలను ప్రముఖంగా పాడతారు.[4][5]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Anveshana team finds 'Gorintaku' actress Vakkalanka Padma - TV9 Exclusive, retrieved 2023-05-15
  2. "gorintaku movie special - Sakshi". web.archive.org. 2023-05-15. Archived from the original on 2023-05-15. Retrieved 2023-05-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2013-08-26.
  4. "Rhythm of recall". The Hindu. No. August 10, 2012. Retrieved 2 December 2014.
  5. "Hyderabad today". The Hindu. No. August 8, 2007. Retrieved 2 December 2014.