Jump to content

ఆస్టా నీల్సన్

వికీపీడియా నుండి
ఆస్టా నీల్సన్
1911లో ఆస్టా నీల్సన్
జననం
ఆస్టా సోఫీ అమలీ నీల్సన్

(1881-09-11)1881 సెప్టెంబరు 11
వెస్టెర్బ్రో, డెన్మార్క్
మరణం1972 మే 24(1972-05-24) (వయసు 90)
ఫ్రెడెరిక్స్‌బర్గ్, డెన్మార్క్
Burial placeవెస్ట్రే సెమెంట్రీ, కోపెన్‌హాగెన్, డెన్మార్క్
జాతీయతడేనిష్
విద్యాసంస్థరాయల్ డేనిష్ థియేటర్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1902–1936
జీవిత భాగస్వామి
  • అర్బన్ గడ్
    (m. 1912; div. 1918)
  • ఫెర్డినాండ్ వింగార్డ్
    (m. 1919; div. 1923)
  • అందెర్స్ క్రిస్టియన్
    (m. 1970)
భాగస్వామిగ్రెగొరి చ్మరా (1923–1936)
పిల్లలు1

ఆస్టా సోఫీ అమాలీ నీల్సన్ (1881 సెప్టెంబర్ 11 – 1972 మే 24) డానిష్ మూకీ సినిమా నటి. ఆమె 1910లలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో ఒకరు. అలాగే అంతర్జాతీయ స్థాయి స్టార్‌డమ్ సాధించిన తొలి నటీమణుల్లోనూ ఒకరు.[1] నీల్సన్ పనిచేసిన 74 చిత్రాలలో 70 జర్మనీలోనే నిర్మించబడ్డాయి, అక్కడ ఆమెను డై అస్టా అని పిలుస్తారు.

ఆమె పెద్ద నల్లటి కళ్ళు, మాస్క్ లాగా కనిపించే ముఖం వంటి శారీరక లక్షణాలు ప్రాచుర్యం పొందాయి. ఎక్కువగా ఆమె కష్టాలు, కన్నీళ్ళతో కూడిన పరిస్థితుల్లో ఇరుక్కున్న గట్టి పట్టుదల కలిగి ఉద్వేగభరితురాలైన మహిళ పాత్రలు పోషించింది. ఆమె నటన బాగా ఎరోటిక్‌గా (శృంగారభరితంగా) ఉండడంతో అమెరికాలో ఆమె సినిమాలను సెన్సార్ చేసేవారు. దీనితో అమెరికన్ ప్రేక్షకులకు ఆమె గురించి అంతగా తెలియదు. చలనచిత్ర నటనను తీవ్ర నాటకీయత నుండి సూక్ష్మమైన సహజ శైలికి మార్చిన ఘనత ఆమెకు దక్కుతుంది.[1]

నీల్సన్ 1920లలో బెర్లిన్‌లో తన సొంత ఫిల్మ్ స్టూడియోని స్థాపించింది.[2] 1930ల్లో మూకీ సినిమాలు పోయి శబ్ద చిత్రాలు వచ్చాకా ఆమె సినిమాలు తీయడం మానేసింది. 1932లో ఆమెను టీకి ఆహ్వానించిన హిట్లర్ తిరిగి సినిమాలు తీయమని కోరాడు. అయితే, అందుకు తిరస్కరించిన ఆమె జర్మనీలో నాజీయిజం పెరిగిన తర్వాత 1937లో డెన్మార్క్‌కు తిరిగి వచ్చింది.[3] తర్వాతి సంవత్సరాల్లో ఆమె కొల్లేజ్ చిత్రకళాకారిణిగా, రచయితగా మారింది. లైమ్ లైట్ నుంచి తప్పుకుని ప్రైవేటుగా జీవితం గడిపింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Morris 1996.
  2. Jensen, Jytte (30 June 2010). Cornelia H. Butler (ed.). Modern Women: Women Artists at the Museum of Modern Art. The Museum of Modern Art. pp. 88–91. ISBN 978-0-87070-771-1.
  3. Jensen, Jytte (30 June 2010). Cornelia H. Butler (ed.). Modern Women: Women Artists at the Museum of Modern Art. The Museum of Modern Art. pp. 88–91. ISBN 978-0-87070-771-1.

ఆధార గ్రంథాలు

[మార్చు]

Morris, Gary (April 1996). "Asta Nielsen". Bright Lights Film Journal (16). Retrieved 2011-11-04.