Jump to content

నైవేలి

అక్షాంశ రేఖాంశాలు: 11°32′00″N 79°29′00″E / 11.533307°N 79.483297°E / 11.533307; 79.483297
వికీపీడియా నుండి
నైవేలి
టౌన్‌షిప్
నైవేలి తాపవిద్యుత్కేంద్రం
నైవేలి తాపవిద్యుత్కేంద్రం
Nickname: 
Powercity
నైవేలి is located in Tamil Nadu
నైవేలి
నైవేలి
Location in Tamil Nadu, India
Coordinates: 11°32′00″N 79°29′00″E / 11.533307°N 79.483297°E / 11.533307; 79.483297
దేశం India
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకడలూరు
Government
 • Typeమునిసిపాలిటీ
 • Bodyనైవేలి మునిసిపాలిటీ
Elevation
87 మీ (285 అ.)
జనాభా
 (2011)
 • Total1,05,687
భాషలు
 • అధికారTamil
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationTN-31(Old),TN-91(New)
Websitehttps://www.nlcindia.com

నైవేలి లేదా నేయ్వెలి అనేది తమిళనాడుకు చెందిన కడలూర్ జిల్లాలోని ఒక విద్యుత్ ఉత్పాదన చేసే సంస్థకు చెందిన టౌన్ షిప్. చెన్నైకు దక్షిణంగా 197 కి.మీ దూరంలో ఉంది. 1956 లో ఇక్కడ లిగ్నైట్ కనుగొన్న తర్వాత నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ పేరుతో లిగ్నైట్‌ వెలికితీతకు, దాన్నుండి విద్యుదుత్పత్తికీ ఒక సంస్థను స్థాపించారు. దాని ఉద్యోగుల కోసం ఇక్కడ టౌన్ షిప్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ టౌన్ షిప్ సుమారు 53 చ.కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఇక్కడ పనిచేసే ఉద్యోగుల కోసం సుమారు 21,000 ఇళ్ళు ప్రభుత్వం నిర్మించింది. ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ సంస్థ. తమిళనాడులో ఉత్పత్తి అయ్యే థర్మల్ విద్యుత్ లో సగ భాగం ఇక్కడి నుంచే ఉత్పత్తి కావడం విశేషం. ఇక్కడి నుంచి ప్రస్తుతం 2,500 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది.

భౌగోళికం

[మార్చు]

నైవేలి సముద్ర మట్టం నుండి 87 మీ. ఎత్తున ఉంది. చెన్నై తంజావూరు జాతీయ రహదారిపై ఉంది. ఈ టౌన్‌షిప్‌ను 32 బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకు 1 కి.మి.. పొడవు, 0.7 కి.మీ. వెడల్పూ ఉంటుంది. టౌన్‌షిప్‌లో 15,000 ఆవాసాలున్నాయి.

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, నైవేలి జనాభా 1,05,687. అక్షరాస్యులు 90,114. అందులో పురుషులు 47,876 కాగా స్త్రీలు 42,238. ప్రతి వెయ్యి మంది పురుషులకు 978 స్త్రీలు ఉన్నారు. పిల్లల్లో లింగ నిష్పత్తి 898/1000. మొత్తం పిల్లల సంఖ్య 6,634. అందులో బాలురు 3,496, బాలికలు 3,138.[1]

మూలాలు

[మార్చు]
  1. "Neyveli population - Census 2011 data". GOI. Archived from the original on 2019-11-25. Retrieved 2020-06-13.
"https://te.wikipedia.org/w/index.php?title=నైవేలి&oldid=3944514" నుండి వెలికితీశారు