Jump to content

శ్రీరంగ గద్యం

వికీపీడియా నుండి
శ్రీరంగంలోని ఈ వచనంలో కీర్తించబడిన రంగనాథ మఱియు అతని భార్యల విగ్రహాలు

శ్రీరంగ గద్యం అనేది 11వ శతాబ్దం చివరలో హిందూ తత్వవేత్త రామానుజాచార్యుడు చే వ్రాయబడిన సంస్కృత గద్య రచన. [1] [2] శ్రీ వైష్ణవ ఆలోచనా సరళిలో రచించబడిన భక్తి గద్య రచనలలో మొదటిది ఇదే తరువాత వచ్చిన రఘువీర గద్యం వంటి అనేక గద్య రచనలకు కూడా ఆధారం. శ్రీరంగంతో సహా 108 వైష్ణవ దివ్య దేశాల దేవాలయాలలో ఇది పారాయణం చేయబడుతుంది. [3]

రచనా విధానం

[మార్చు]

రామానుజులు మఱియు అతని శిష్యులు శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని పంగుని ఉత్తరం నాడు అనగా తమిళ పంచాంగం ప్రకారం నెల పంగుని (వసంత మాసంలో) ఉత్తరం అనే నక్షత్రం ఆవిర్భవించిన రోజున సందర్శించారు. తమిళ పురాణాలలో, ఆలయ దేవత, శ్రీ రంగనాయకి తాయార్, లక్ష్మి జన్మించినప్పుడు ఉత్తరం అధిరోహణంలో ఉంది. రామానుజులు ఇలాంటి ఉత్సవాల నుండి ప్రేరణ పొంది శ్రీరంగ గద్యం, శరణాగతి గద్యం మఱియు వైకుంఠ గద్యాలను రచించారు. [4]

శ్రీరంగ గద్యంలో వేదాంతానికి సంబంధించిన రామానుజుల వ్యాఖ్యానాల వలె వివరణాత్మక తాత్విక చర్చలు లేవు. బదులుగా ఇది భక్తి యొక్క స్వచ్ఛమైన వ్యక్తీకరణ మఱియు లెక్కలేనన్ని ఆదర్స గుణాలకు నిలయమైన రంగనాథ దేవుడు గురించి వివరణాత్మక వర్ణనను ఇందులో నిరూపిస్తారు. అతను రంగనాధుని కల్యాణ గుణాన్ని "సద్గుణం" అని పిలుస్తాడు. [5]

మొదట అతను రంగనాథుడిని జ్ఞాని అని (నిజమైన మఱియు పరిపూర్ణమైన జ్ఞానం కలవాడుగా), బలవంతుడని లేదా శక్తి వంతుడుగా వర్ణించాడు, ఈ సందర్భంలో మొత్తం విశ్వం యొక్క ఉనికిని ఇవ్వగల సామర్థ్యం కలవాడుగా, ఐశ్వర్యం కలవాడుగా (సాటిలేని సంపద మఱియు విశ్వం అనే ఓడను నడిపించేవాడుగా), వీర్యవంతుడని (అలుపులేని పురుషత్వం కలవాడుగా), శక్తివంతుడని (స్వీయ శక్తితో నడిపించగల సామర్ధ్యం కలవాడు), అగ్ని (అసమానమైన తేజోవంతుడని), సౌశీల్య వంతుడని(స్వచ్ఛమైన వాడు), వాత్సల్యుడని (స్వచ్ఛమైన మఱియు అపరిమితమైన ప్రేమకలవాడు), మార్దవుడని (భక్తుల పట్ల ఆప్యాయతతో కూడిన సాన్నిహిత్యం కలవాడు), ఆర్జవ (నిజాయితీ కలవాడని), సౌహార్ద (మంచిని మాత్రమే ఆలోచించడం), సమ్య (సమానత్వం గల వ్యక్తి), కారుణ్య (దయగల), మాధుర్య (శత్రువులకు కూడా తీపి కలిగించేవాడు), గంభీర్య (గంభీరత మఱియు గొప్పతనం), ఔదార్య (ఉదారంగా ఇవ్వడం), చాతుర్య (మేధస్సు, శత్రువులను కూడా స్నేహితులుగా మార్చగల సామర్థ్యం), స్థైర్య (ఎంపిక చేసుకున్న మార్గంలో ఉండాలని నిర్ణయించుకున్నారు), ధైర్య (భక్తులకు సాయపడే శక్తి), సౌర్య (ఒంటరిగా పోరాడగల సామర్థ్యం), పరాక్రమ (యుద్ధాలను అప్రయత్నంగా గెలవడం), సత్యకామ (నీ సంకల్పం ఎప్పటికీ నెరవేరడం), సత్య సంకల్ప (నీ కర్మలను పూర్తిగా అమలు చేయడం), కృతిత్వం (భగవంతుని విధులను నిర్వర్తించడం), కృతాంగనాథై (ఆయనకు సమర్పించిన కొద్దిపాటి పూజలను కూడా కృతజ్ఞతతో స్మరించుకోవడం) మఱియు అటువంటి అసంఖ్యాకమైన అన్ని ధర్మాల నిలయంగా అమిత సాగరుడని; అతను పరబ్రహ్మం మఱియు పురుషోత్తముడని వర్ణించాడు. [6]

తరువాత, అతను సంసారంలో ఎలా చిక్కుకున్నాడో మఱియు పాపాలకు దారితీసే కర్మలను చేస్తూ ఎలా బంధించబడ్డాడో వివరిస్తాడు. భగవద్గీతలో వివరించిన విధంగా జ్ఞాన యోగం, లేదా కర్మ యోగం వంటివి ఆశ్రయించినా కూడా అతనికి మోక్షాన్ని ఇవ్వటంలో సహాయపడవు అని వర్ణించాడు.

చివరగా, అతను అనేక విధాలుగా మోక్షానికి పొందటానికి అనర్హుడని కానీ రంగనాథుడు కృపాసాగరుడని దయతో తనకు అనుగ్రహం ప్రసాదించమని కోరాడు.

శైలి

[మార్చు]

ఈ గద్య రచనలో కల శ్లోకాలు అనేక విశేషణ పదబంధాలతో ప్రత్యామ్నాయ దీర్ఘ మఱియు చిన్న సమాసములతోను, వాక్యాలతోను రచించబడినది.



ప్రస్తావనలు

[మార్చు]
  1. Uppe, Dr Shivakumar V. (2022-12-10). Major Socio -Religious Reform Movements in India (in ఇంగ్లీష్). Ashok Yakkaldevi. p. 87. ISBN 978-1-387-43350-6.
  2. Marga, Bhakti (2018-01-31). Prathana: Prayers of Bhakti Marga – Complete with Translations and Vedic Chants (in ఇంగ్లీష్). BoD – Books on Demand. p. 79. ISBN 978-3-96343-022-0.
  3. Moser, Paul K.; Meister, Chad (2020-07-16). The Cambridge Companion to Religious Experience (in ఇంగ్లీష్). Cambridge University Press. p. 208. ISBN 978-1-108-47217-3.
  4. Juergensmeyer, Mark; Roof, Wade Clark (2012). Encyclopedia of Global Religion (in ఇంగ్లీష్). SAGE. p. 1050. ISBN 978-0-7619-2729-7.
  5. SAWAI, YOSHITSUGU (1993). "RĀMĀNUJA'S THEORY OF KARMAN".
  6. Ramanujacharya, Sri. Sriranga Gadyam (PDF). Hindu Community and Cultural Center.