వాడుకరి:Ch Maheswara Raju/ప్రయోగశాల-వ్యాసాలు రాయడం కొరకు
ఆంధ్రప్రదేశ్ నగరపంచాయితీలు
[మార్చు]మూలాలు
[మార్చు]దేశము | భారతదేశం |
---|---|
తరహా | శాఖా గ్రంథాలయం |
స్థాపితము | 1954 |
ప్రదేశము | తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం |
గ్రంధ సంగ్రహం / సేకరణ | |
సేకరించిన అంశాలు | పుస్తకాలు, పరిశోధన గ్రంథాలు, దిన-వార-మాసిక-పక్ష-వార్షిక పత్రికలు, చేవ్రాతలు |
గ్రంధాల సంఖ్య | 23,699 పుస్తకాలు/పత్రికలు |
చట్టపరమైన జమ | ఔను |
ప్రాప్యత, వినియోగం | |
వినియోగించుటకు అర్హతలు | ఎవరైనా రావచ్చును |
అమలాపురం గ్రంథాలయం ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పట్టణకేంద్రంలోని గ్రంథాలయం.గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం గ్రంథాలయ వారోత్సవాలు, సాహితీవేత్తల, జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులు నిర్వహిస్తూ ఉంటారు.
చరిత్ర
[మార్చు]అమలాపురం ప్రధమ శ్రేణి శాఖ గ్రంథాలయం తూర్పు గోదావరి జిల్లా,అమలాపురం,ముమ్మిడివరం గేట్ గాంధీ బజార్ వద్ద ఒక ప్రైవేట్ బిల్లింగ్ లో ఉంది.దీనిని 11 అక్టోబర్ 1954 లో స్థాపించారు. ఇందులో చైతన్య స్ఫూర్తిని రగిలించే అనేక పుస్తకాలు ఉన్నాయి.ఈ గ్రంథాలయంలో 23,699 పుస్తకాలు ఉన్నాయి. దరవత్తులు 2467 మంది ఉన్నారు.ఈ గ్రంథాలయంలో 2012 నుండి ఆంధ్రజ్యోతి దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి. గ్రంథాలయంలో ఏటా గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.
పుస్తక ప్రదర్శన
[మార్చు]54 జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో స్వాతంత్ర గాథలు, చరిత్ర పై పుస్తకాలు ప్రదర్శించారు.వివిధ విభాగాల్లో జరిగిన చిత్రలేఖన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. వి. కృష్ణకామేశ్వర్ నిర్వాహణలో 350 దేశాల నాణేలు, కరెన్సీ నోట్ల ప్రదర్శన జరిగింది.
గ్రంథపాలకులు
[మార్చు]గ్రంథాలయం స్థాపించినప్పటి నుండి 6 మొత్తంగ్రంథపాలకులు పని చేశారు.
- సిహెచ్ సుబ్బారావు
- వి.అర్.పి నాగరాజు
- పి.బుల్లి రామయ్య
- నల్ల రాధ కృష్ణ మూర్తి
- జి వర్మ
- కె.జె. కుమారి
గ్రంథాలయ పని దినాలు
[మార్చు]ఈ గ్రంథాలయం ఉదయం 8 నుండి సాయంత్రం 8 గంటలు వరకు ఉంటుంది. శుక్రవారం, ప్రతి రెండవ శనివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో సెలవు ఉంటుంది.