Coordinates: 16°33′22″N 79°38′00″E / 16.55625°N 79.63345°E / 16.55625; 79.63345

గురజాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్టణం
పటం
Coordinates: 16°33′22″N 79°38′00″E / 16.55625°N 79.63345°E / 16.55625; 79.63345
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండలంగురజాల మండలం
విస్తీర్ణం
 • మొత్తం43.41 km2 (16.76 sq mi)
జనాభా
 (2011)[1]
 • మొత్తం26,190
 • జనసాంద్రత600/km2 (1,600/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1025
ప్రాంతపు కోడ్+91 ( 08649 Edit this on Wikidata )
పిన్(PIN)522415 Edit this on Wikidata
WebsiteEdit this at Wikidata


గురజాల ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా, గురజాల మండలం లోని గ్రామం, ఇది మునిసిపల్ పట్టణం, అదే పేరుతో గల మండలానికి కేంద్రం.ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 28 కి.మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7045 ఇళ్లతో, 26190 జనాభాతో 4341 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 12931, ఆడవారి సంఖ్య 13259. షెడ్యూల్డ్ కులాల జనాభా 3687 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 1134. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 589846.[2] పిన్ కోడ్: 522415.

చరిత్ర

[మార్చు]

హైహయ వంశపు రాజు అలుగురాజు గురజాలను రాజధానిగా చేసుకుని పలనాడును పాలించాడు. అతని వారసుడు నలగాముడు గురజాలనే రాజధానిగా చేసుకున్నాడు. నలగాముడి సోదరుడైన మలిదేవుడు, మాచర్లను రాజధానిగా చేసుకుని తన రాజ్యాన్ని పాలించాడు. ఈ దాయాదుల మధ్య జరిగిన పోరే ఆంధ్ర కురుక్షేత్రంగా పేరుగాంచిన పల్నాటి యుద్ధం.

భౌగోళికం

[మార్చు]

ఇది సమీప పట్టణమైన మాచర్ల నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.

జనగణన గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24,550. ఇందులో పురుషుల సంఖ్య 12,430, స్త్రీల సంఖ్య 12,120, గ్రామంలో నివాస గృహాలు 5,827 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణము 4,341 హెక్టారులు.

పరిపాలన

[మార్చు]

దీని పరిపాలన గురజాల నగరపంచాయితీ నిర్వహిస్తుంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ఒక బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 11, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 9, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. 2 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 2 ప్రైవేటు ఆర్ట్స్, సైన్స్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల మాచర్లలో ఉంది.సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మాచర్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం మాచర్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరులోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

సమీప జాతీయ రహదారి 167A 14 కి.మీ దూరంలో దాచేపల్లి పట్టణంలో పోతుంది.

భూమి వినియోగం

[మార్చు]

2011 జనగణన ప్రకారం భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 1766 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 841 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 99 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 40 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 200 హెక్టార్లు
  • బంజరు భూమి: 179 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూ క్షేత్రం: 1216 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూ క్షేత్రం: 693 హెక్టార్లు
  • నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం: 902 హెక్టార్లు
  • కాలువలు: 902 హెక్టార్లు

ప్రధాన పంటలు

[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల
శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం, గురజాల
  • శ్రీ పాతపాటేశ్వరీ అమ్మవారి ఆలయం: అమ్మవారి వార్షిక తిరునాళ్ళు నిర్వహిస్తారు. వెండి, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరిస్తారు. అమ్మవారి వార్షిక తిరునాళ్ళ ఉత్సవాలు బియ్యం కొలతతో ప్రారంభమవుతవి. తొలి రోజు రాత్రి 6 మానికల బియ్యం కొలిచి అమ్మవారి పాదాలచెంత ఉంచుతారు. నాలుగవ రోజు రాత్రి విడుపు కొలత కొలుస్తారు. అమ్మవారి మహిమ వలన బియ్యం పెరుగుతాయని భక్తుల విశ్వాసం. పెరిగిన బియ్యాన్ని బట్టి, పలనాడులో పంటల దిగుబడి వస్తుందని భక్తుల నమ్మకం. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. తిరునాళ్ళ ముగిసిన తరువాత రోజు శనివారం అమ్మవారి గ్రామోత్సవం ముగుస్తుంది. ఊరేగింపులో వీరులు, మాతంగి పాల్గొని అదనపు ఆకర్షణగా నిలుస్తారు. ప్రతి ఇంటి ముందు మహిళలు నీటితో వారు పోసి అమ్మవారిని పూజిస్తారు.
  • శ్రీ ఇష్ట కామేశ్వరస్వామివారి ఆలయం ఇది పురాతన దేవాలయం - ఇక్కడ ఋషులు సంచరించారు అని చరిత్రల్లో ఉంది. శ్రీనాధుడు ఈ దేవాలయం నుండే పల్నాటి వీరచరిత్ర రచనచేసారు గుడి కారంపూడి రోడ్డుమార్గంలో రైల్వేట్రాక్ సమీపంలో ఉంది గుడివెనుక నాయకురాలు నాగమ్మ తవ్వించిన చెరువు చాల ఆహ్లాదంగా ఉంటుంది.

ఇతర విషయాలు

[మార్చు]

గురజాల పట్టణంలోని గురజాలమ్మ ఆలయ పరిసరాలలో, 2017, జూన్-3న, సా.శ. నాల్గవ శతాబ్దానికి చెందిన మహిసాసురమర్దని శిలా ఫలకం బయల్పడినది. ఈ ప్రతిమ లక్షణాలనుబట్టి, ఇది విష్ణుకుండినుల కాలంనాటిదిగా పురావస్తు శాస్త్రజ్ఞుల అభిప్రాయం.

ప్రముఖులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గురజాల&oldid=4045412" నుండి వెలికితీశారు