దాచేపల్లి
పట్టణం | |
Coordinates: 16°36′N 79°44′E / 16.6°N 79.73°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | దాచేపల్లి మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 33.58 కి.మీ2 (12.97 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 19,042 |
• జనసాంద్రత | 570/కి.మీ2 (1,500/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 989 |
ప్రాంతపు కోడ్ | +91 ( 08649 ) |
పిన్(PIN) | 522414 |
Website |
దాచేపల్లి, పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలానికి చెందిన పట్టణం, మండలానికి కేంద్రం.
భౌగోళికం
[మార్చు]ఇది సమీప పట్టణమైన పిడుగురాళ్ళ నుండి 21 కి. మీ. దూరంలో ఉంది.
జనగణన
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4580 ఇళ్లతో, 17238 జనాభాతో 1996 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8620, ఆడవారి సంఖ్య 8618.[1] 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 14,256. ఇందులో పురుషుల సంఖ్య 7,237, స్త్రీల సంఖ్య 7,019, గ్రామంలో నివాస గృహాలు 3,164 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,358 హెక్టారులు.
పరిపాలన
[మార్చు]దాచేపల్లి నగరపంచాయితీ పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]జాతీయ రహదారి 167A పై పట్టణం వుంది. సమీప రైల్వే కూడలి దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో గల నడికుడి
విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
[మార్చు]1917 లో ఈ పాఠశాల నిర్మాణానికి కోలా వెంకటరెడ్డి, కోలా కేశవరెడ్డి రెండెకరాల భూమిని విరాళంగా అందజేశాడు. పాఠశాలలో అభివృద్ధిలో భాగంగా దాతలు, పూర్వ విద్యార్థులు తమ వంతు తోడ్పాటు అందించారు.
ఇతరాలు
[మార్చు]సమీప ఇంజనీరింగ్ కళాశాల నరసరావుపేటలో, సమీప వైద్య కళాశాల గుంటూరులో, మేనేజిమెంటు కళాశాల నరసరావుపేటలో ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం నరసరావుపేటలో వున్నది
ప్రముఖులు
[మార్చు]- ధూళిపాళ సీతారామశాస్త్రి, సుప్రసిద్ధ సినీ నటుడు.
ప్రధాన పంటలు
[మార్చు]దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ వీర్లంకమ్మ తల్లి ఆలయం: ఉత్సవ విగ్రహాన్ని, ప్రతి సంవత్సరం ఉగాదిరోజున, పురవీధులలో ఊరేగిస్తారు.