ముమ్మిడివరం నగరపంచాయితీ
ముమ్మిడివరం | |
స్థాపన | 2011 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | అమలాపురం |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
ముమ్మిడివరం నగరపంచాయితీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కోనసీమ జిల్లాకు చెందిన ముమ్మిడివరం పట్టణ స్థానిక స్వపరిపాలనా సంస్థ. ఈ పురపాలక సంఘం అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలోని, ముమ్మిడివరం శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన నగరపంచాయితీ.
చరిత్ర
[మార్చు]ఈ నగర పంచాయతీ సమీప పట్టణమైన అమలాపురం నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 1969 సంవత్సరం వరకు ముమ్మిడివరం అమలాపురం తాలుకాలో ఉండేది. తరువాతి కాలంలో మండలాలు ఏర్పాటులో ముమ్మిడివరానికి మండల ప్రతిపత్తి కల్పించబడింది. 2011 జూన్ 23 న గ్రామ పంచాయతీ నుండి నగరపంచాయతీకి అప్‌గ్రేడ్ చేయబడింది [1]
భౌగోళికం
[మార్చు]ముమ్మిడివరం 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E.[2] వద్ద ఉంది.సముద్రమట్టానికి మూడు అడుగుల ఎత్తులో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]ఈ నగర పంచాయతీని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.2011 జనాభా లెక్కల ప్రకారం 23732 మంది జనాభా ఉండగా అందులో పురుషులు 11733, మహిళలు 11999 మంది ఉన్నారు. ఈ నగర పంచాయతీ పరిధిలో మొత్తం 6560 ఇండ్లు కలిగిఉన్నాయి. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2080 ఉన్నారు. అక్షరాస్యత రేటు 80.33% ఉండగా, పురుష జనాభాలో 85% ఉండగా, స్త్రీ జనాభాలో 75% అక్షరాస్యులు ఉన్నారు.[3]
ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్
[మార్చు]ప్రస్తుత చైర్‌పర్సన్ గా బి.వి రమణ పనిచేస్తున్నాడు.[4]
ఇతర వివరాలు
[మార్చు]ఈ పురపాలక సంఘంలో 6560 గృహాలు ఉన్నాయి.ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది.5 ఇ-సేవా కేంద్రాలు,2 ఉన్నత పాఠశాలలు,23 ప్రాథమిక పాఠశాలలు, ఒక మార్కెట్టు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Kodad upgraded to municipality". The Hindu. Hyderabad. 24 June 2011. Retrieved 28 January 2016.
- ↑ Falling Rain Genomics.Mummidivaram
- ↑ "Mummidivaram Village Population - Mummidivaram - East Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-02-22.
- ↑ "Muncipality Contacts / Nagar panchayati | Commissioner and Director of Municipal Administration". cdma.ap.gov.in. Retrieved 2021-02-22.