Jump to content

బద్వేలు పురపాలక సంఘం

వికీపీడియా నుండి
బద్వేలు పురపాలక సంఘం
బద్వేలు
స్థాపన2006
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
బద్వేలు
కార్యస్థానం
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడువెబ్ సైట్

బద్వేలు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లాకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం కడప లోక్‌సభ నియోజకవర్గం లోని,బద్వేలు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

బద్వేలు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 326 కి.మీ దూరంలోనూ, కడప కి 55 కిలోమీటర్లు దూరంలో ఉంది.ఈ పురపాలక సంఘం 2006 లో స్థాపించారు.[1] బద్వేల్ మున్సిపాలిటీ లోని మూడవ వార్డు వల్లేరవారి పల్లె గ్రామం నుండి పత్తిపాటి నరసింహులు గారు 2022 లో మోడీ గారి జన్మదినం సందర్భంగా పాదయాత్రలో కేవలం 54 రోజుల్లో బద్వేల్ నుండి న్యూఢిల్లీకి 2015 కిలోమీటర్లు పూర్తిచేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించి చరిత్రలో బద్వేల్ కి ఒక పేరును నమోదు చేశాడు

జనాభా గణాంకాలు

[మార్చు]

బద్వేలు పురపాలక సంఘం లో 2006 వ సంవత్సరంలో మొదటిగా 26 వార్డులుగా విభజించారు, ప్రస్తుతం 35 వార్డులుగా దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 1,35,089 జనాభా ఉన్నారు.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్ గా వాకముల రాజగోపాల్ రెడ్డి గారు.[2]వైస్ చైర్మన్ గా గోపాల స్వామి గారు మరియు రాచపూడి సాయి గారు పనిచేస్తున్నారు.[2]

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘంలో 24518 గృహాలు ఉన్నాయి.11 రెవెన్యూ వార్డులు,ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. మురికివాడలో 35150 జనాభా ఉన్నారు.1 ఇ-సేవా కేంద్రం, 47 ప్రభుత్వ పాఠశాలలు, 7 ఉన్నత పాఠశాలలు, 36 ప్రాథమిక పాఠశాలలు, రెండు కూరగాయల మార్కెట్ లు ఉన్నాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-06-18.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 September 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]