Jump to content

మదనపల్లి పురపాలక సంఘం

వికీపీడియా నుండి
మదనపల్లి పురపాలక సంఘం
మదనపల్లి
స్థాపన1961
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

మదనపల్లి పురపాలక సంఘం,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం లోని,మదనపల్లె శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

చరిత్ర

[మార్చు]

మదనపల్లి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుకు చెందిన పురపాలక సంఘం.ఇది 1961 సంవత్సరంలో మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 14.20.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.పురపాలక సంఘం పరిధి 35 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]
మదనపల్లె (పట్టణ) మొత్తం పురుషులు స్త్రీలు
జనాభా 184,267 92,692 91,575
అక్షరాస్యులు 128,467 69,340 59,127
పిల్లలు (0-6) 18,062 9,312 8,750
సరాసరి అక్షరాస్యత (%) 79.69 86.27 73.15

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

[మార్చు]

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా కె.శివప్రసాద్, వైస్ చైర్మన్‌గా జె. భవాని ప్రసాద్.[2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
హార్సిలీకొండల నుండి దృశ్యం.
  • హార్సిలీ హిల్స్- ఆంధ్రరాష్ట్రంలో ప్రసిధ్ధి చెందిన (ఆంధ్రా ఊటీ అని పిలువబడే) వేసవి విడిది ప్రాంతము. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారి అధికారిక వేసవి విడిది కేంద్రము.
  • బసినికొండ- వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి) ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది

ఇతర వివరాలు

[మార్చు]

ఈ పురపాలక సంఘం 14.20. చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.17 రెవెన్యూ వార్డులు,36 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 42 మురికివాడలు ఉండగా అందులో జనాభా 36575 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి, 87 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Municipalities, Municipal Corporations & UDAs" (PDF). Directorate of Town and Country Planning. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 January 2016.
  2. "Wayback Machine" (PDF). web.archive.org. 2019-09-06. Archived from the original (PDF) on 2019-09-06. Retrieved 2022-10-23.

వెలుపలి లంకెలు

[మార్చు]