సూర్యాబాగ్ (విశాఖపట్టణం)
సూర్యాబాగ్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°42′44″N 83°17′58″E / 17.712202°N 83.299386°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530020 |
Vehicle registration | ఏపి |
సూర్యాబాగ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలోని పాత శివారు ప్రాంతం.[1] జగదాంబ సెంటర్ కు సమీపంలో ఉన్న ఈ సూర్యాబాగ్ ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్ దుకాణాల కేంద్రంగా ఉంది.[2] ఇక్కడ విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ కార్యాలయం, విశాఖి జల ఉధ్యానవనం ఉన్నాయి. ఆ ప్రాంతం పాత పట్టణం, కొత్త నగరాల మధ్య వారధిగా ఉంది.
భౌగోళికం
[మార్చు]ఇది 17°42′44″N 83°17′58″E / 17.712202°N 83.299386°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
రవాణా
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సూర్యాబాగ్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, కైలాసగిరి, టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, వెంకోజిపాలెం, ఓహ్పో, అరిలోవ, పూర్ణ మార్కెట్, యారాడ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను, మర్రిపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఇక్కడ అనేక దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ వస్తువులకు కేంద్రంగా ఉంది. సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ విశాఖపట్నం సెంట్రల్ షాపింగ్ మాల్ ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- కాశీ విశ్వేశ్వర దేవాలయం
- రామాలయం
- దుర్గా భవానీ దేవాలయం
- రామలింగేశ్వర స్వామి దేవాలయం
- అల్లిపురం మసీదు
- మసీదు-ఇ-ఫిర్డస్
- కేరళ మసీదు
మూలాలు
[మార్చు]- ↑ "Suryabagh, Jagadamba Junction Locality". www.onefivenine.com. Retrieved 6 May 2021.
- ↑ "Oganic saris on sale at Co-optex outlet". The Hindu. Special Correspondent. 2017-07-29. ISSN 0971-751X. Retrieved 6 May 2021.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Suryabagh, Daba Gardens, Allipuram Locality". www.onefivenine.com. Retrieved 6 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 6 May 2021.