Jump to content

మురళీనగర్ (విశాఖపట్నం)

అక్షాంశ రేఖాంశాలు: 17°44′43″N 83°15′41″E / 17.745220°N 83.261311°E / 17.745220; 83.261311
వికీపీడియా నుండి
మురళీనగర్
సమీపప్రాంతం
జాతీయ రహదాలోని బిర్లా జంక్షన్
జాతీయ రహదాలోని బిర్లా జంక్షన్
మురళీనగర్ is located in Visakhapatnam
మురళీనగర్
మురళీనగర్
విశాఖట్నం నగర పటంలో మురళీనగర్ స్థానం
Coordinates: 17°44′43″N 83°15′41″E / 17.745220°N 83.261311°E / 17.745220; 83.261311
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530007
Vehicle registrationఏపి 32, 33

మురళీనగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] ఇక్కడ అనేక నివాస భవనాలు ఉన్నాయి. ఇది ఆటోమొబైల్ షోరూంలకు కేంద్రంగా ఉంది.[2]

భౌగోళికం

[మార్చు]

ఇది 17°44′43″N 83°15′41″E / 17.745220°N 83.261311°E / 17.745220; 83.261311 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో మర్రిపాలెం, కంచరపాలెం, న్యూ కరసా, డిఎల్ఎస్ కాలనీ, ఓల్డ్ కరసా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]

రవాణా

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మురళీనగర్ మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, ఆర్టీసీ కాంప్లెక్స్, రవళమ్మపాలెం, జిల్లా పరిషత్, సింహాచలం హిల్స్, కింతాడ కోటపాడు, మాధవధార, ఎంఎన్ క్లబ్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  1. రామ నవీన్ లక్ష్మి దేవాలయం
  2. కోదండ రామాలయం
  3. సాయిబాబా దేవాలయం
  4. నిషాని ఘౌస్ - ఇ - ఆజామ్
  5. మసీదు-ఎ-నబ్వి

మూలాలు

[మార్చు]
  1. "Murali Nagar Street, Muralinagar, Madhavadhara Locality". www.onefivenine.com. Retrieved 14 May 2021.
  2. "location". the hindu. 28 March 2013. Retrieved 14 May 2021.
  3. "Muralinagar Locality". www.onefivenine.com. Retrieved 14 May 2021.
  4. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 14 May 2021.