అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
శ్రీకాళహస్తి
—  శాసనసభ నియోజకవర్గం  —
శ్రీకాళహస్తి is located in Andhra Pradesh
శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం, తిరుపతి జిల్లాలో గలదు. ఇది తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనిది. ఈ నియోజక వర్గం 1951 లో డీలిమిటేషన్ ఉత్తర్వుల ప్రకారం ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి అత్యధికంగా ఐదు సార్లు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈయన తర్వాతి స్థానం మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన అద్దూరి బలరామిరెడ్డిది.

చరిత్ర

[మార్చు]

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ నియోజకవర్గం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. 1952 లో మొదటిసారిగా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దూరి బలరామిరెడ్డి, కృషికార్ లోక్ పార్టీకి చెందిన టి. వెంకటసుబ్బారావుపై గెలుపొందాడు.[1] మద్రాసు నుండి విడివడి ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ 1955 లో ఎన్నికలు జరిగాయి. ఈ ప్రభుత్వం ఏడేళ్ళ పాటు పాలించేందుకు అనుమతించారు ఎందుకంటే 1957కి తెలంగాణా ప్రాంతం ఆంధ్రరాష్ట్రంలో కలవడం వలన ఆ ప్రాంతానికే మాత్రమే శాసనసభ ఎన్నికలు జరిగాయి. 1962 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎన్నికలు జరుగుతూ వచ్చాయి.

మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్.సి.వి.నాయుడు తన సమీప ప్రత్యర్థి బొజ్జల గోపాలకృష్ణరెడ్డిపై 13078 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. నాయుడుకు 69262 ఓట్లు రాగా, గోపాలకృష్ణరెడ్డి 56184 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గోపాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ తరఫున ఎస్సీవీ నాయుడు పోటీ చేశారు.[2] ఈ ఎన్నికల్లో గోపాలకృష్ణా రెడ్డి సమీప ప్రత్యర్థి ఎస్.సి.వి. నాయుడుపై గెలుపొందాడు.

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా

[మార్చు]
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2024 287 జనరల్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి M తెలుగుదేశం పార్టీ 121565 బియ్యపు మధుసూదన్ రెడ్డి M వైఎస్సార్సీపీ 78761
2019 287 జనరల్ బియ్యపు మధుసూదన్ రెడ్డి M వైఎస్సార్సీపీ 109541 బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి M తెలుగుదేశం పార్టీ 71400
2014 287 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 89953 బియ్యపు మధుసూదన్ రెడ్డి M వైఎస్సార్సీపీ 82370
2009 287 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 70707 ఎస్. సి. వి నాయుడు M కాంగ్రెస్ 58244
2004 135 జనరల్ ఎస్. సి. వి నాయుడు M కాంగ్రెస్ 69262 బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 56184
1999 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 61017 సత్రవాడ మునిరామయ్య M కాంగ్రెస్ 52606
1994 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 59827 చదలవాడ కృష్ణమూర్తి M కాంగ్రెస్ 55606
1989 135 జనరల్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి M తె.దే.పా 58800 తాటిపర్తి చెంచురెడ్డి M కాంగ్రెస్ 51432
1988 ఉప ఎన్నిక జనరల్ తాటిపర్తి చెంచురెడ్డి M కాంగ్రెస్ 47984 కె. ఎస్. మూర్తి M తె.దే.పా 43565
1985 135 జనరల్ సత్రవాడ మునిరామయ్య M తె.దే.పా 46721 తాటిపర్తి చెంచురెడ్డి M కాంగ్రెస్ 46641
1983 135 జనరల్ అద్దూరు దశరథరామిరెడ్డి M స్వతంత్ర 41011 తాటిపర్తి చెంచురెడ్డి M స్వతంత్ర 22790
1978 135 జనరల్ ఉన్నం సుబ్రహ్మణ్యం నాయుడు M కాంగ్రెస్ (ఐ) 30204 తాటిపర్తి చెంచురెడ్డి M JNP 24292
1972 135 జనరల్ అద్దూరి బలరామిరెడ్డి M స్వతంత్ర 41218 బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి M కాంగ్రెస్ 32754
1967 132 జనరల్ బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి M స్వతంత్ర 34282 అద్దూరు బలరామిరెడ్డి M కాంగ్రెస్ 26531
1962 139 జనరల్ అద్దూరి బలరామిరెడ్డి M కాంగ్రెస్ 16356 పి. వెంకటప్పయ్య M సిపిఐ 12216
1955 119 ద్విసభ్య నీలం సంజీవరెడ్డి, పట్రా సింగారయ్య M కాంగ్రెస్ 40404, 37190 గొడుగు సోమయ్య M సిపిఐ 12909
1952 119 జనరల్ అద్దూరి బలరామిరెడ్డి M కాంగ్రెస్ 31743 టి. వెంకటసుబ్బారావు M కృషికార్ లోక్ పార్టీ 8377

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. indianelections.in (2024-02-12). "Srikalahasti, Andhra Pradesh: Read & Vote for Favorite political party. -" (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2024-06-19.
  2. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009