Jump to content

గుడివాడ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
గుడివాడ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°25′48″N 80°59′24″E మార్చు
పటం

గుడివాడ శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లాలోగలదు.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కఠారి ఈశ్వర్ కుమార్‌పై 8862 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకటేశ్వరరావు 57843 ఓట్లు పొందగా, ఈశ్వర్ కుమార్ 48981 ఓట్లు సాధించాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున కె.వెంకటేశ్వరరావు (నాని) పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ తరఫున పి.వెంకటేశ్వరరావు పోటీపడ్డాడు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కె.వి.రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.వి.రావుపై 17630 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.[1]

2014 ఎన్నికలు

[మార్చు]

2014లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు పై 11537 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. కొడాలి వెంకటేశ్వరరావు 81298 ఓట్లు పొందగా, రావి వెంకటేశ్వరరావు 69761 ఓట్లు సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024 వెనిగండ్ల రాము[2] పు టీడీపీ 109980 కొడాలి నాని పు వైఎస్‌ఆర్‌సీపీ 56940
2019 కొడాలి నాని పు వైఎస్‌ఆర్‌సీపీ 89,833 దేవినేని అవినాష్ పు టీడీపీ 70,354
2014 కొడాలి నాని పు వైఎస్‌ఆర్‌సీపీ 81298 రావి వెంకటేశ్వరరావు పు టీడీపీ 69761
2009 కొడాలి నాని పు వైఎస్‌ఆర్‌సీపీ 68034 పిన్నమనేని వెంకటేశ్వర రావు పు ఐఎన్‌సీ 50404
2004 కొడాలి నాని పు టీడీపీ 57843 ఈశ్వర కుమార్ కటారి పు ఐఎన్‌సీ 48981
2000(ఉప ఎన్నిక) రావి వెంకటేశ్వర రావు పు టీడీపీ 62559 రమేష్ శిస్ట్ల పు ఐఎన్‌సీ 30562
1999 రవి హరి గోపల్ పు టీడీపీ 43126 శేగు వెంకటేశ్వర్లు పు ఐఎన్‌సీ 26180
1994 రావి శోభనాద్రి చౌదరి పు టీడీపీ 59022 ఈశ్వర కుమార్ కఠారి పు ఐఎన్‌సీ 38032
1989 ఈశ్వర కుమార్ కఠారి పు ఐఎన్‌సీ 52723 రావి శోభనాద్రి చౌదరి పు టీడీపీ 52213
1985 నందమూరి తారక రామారావు పు టీడీపీ 49600 ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు పు ఐఎన్‌సీ 42003
1985ఉప ఎన్నిక రావి శోభనాద్రి చౌదరి పు టీడీపీ 53106 యు.ఎస్.బాబు పు ఐఎన్‌సీ 31463
1983 నందమూరి తారక రామారావు పు టీడీపీ 53906 కటారి సత్యనారాయణ రావు పు ఐఎన్‌సీ 27368
1978 కటారి సత్యనారాయణ రావు పు ఐఎన్‌సీ [ఐ] 38060 పి.వెంకటసుబ్బారావు పు సీపీఐ (ఎం) 32236
1972 కటారి సత్యనారాయణ రావు పు ఐఎన్‌సీ 34373 పి.వెంకటసుబ్బారావు పు సీపీఐ (ఎం) 27434
1967 ఎం.కె.దేవి స్త్రీ ఐఎన్‌సీ 24854 వి.ఎస్.ఆర్.పుట్టగుంట పు సీపీఐ (ఎం) 15851
1962ఎస్.సి గంజి రామా రావు పు సీపీఐ 27267 వేముల కూర్మయ్య పు ఐఎన్‌సీ 23767
1955 అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం పు స్వతంత్ర 52210 వేముల కూర్మయ్య పు ఐఎన్‌సీ 49939

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  2. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gudivada". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.