కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని)

పదవీ కాలం
8 జూన్ 2019[1] – 2022 ఏప్రిల్ 10[2]
ముందు పత్తిపాటి పుల్లారావు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004
ముందు రావి వెంకటేశ్వరరావు
నియోజకవర్గం గుడివాడ

వ్యక్తిగత వివరాలు

జననం 22 అక్టోబరు 1971
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ (2012 కు ముందు)
నివాసం గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తి రాజకీయనాయకుడు

కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (కొడాలి నాని) వై.ఎస్.ఆర్, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయనాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి మంత్రి వర్గంలో పొర సరఫరాలు, వినియోగదారులు వ్యవహారాల మంత్రి. [3]అతను కృష్ణా జిల్లా లోని గుడివాడ శాసనసభ నియోజకవర్గం నుండి 2004 నుండి వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యాడు. అతను 2004,[4] 2009[5] శాసనసభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా, 2014[6], 2019[7] శాసనసభ ఎన్నికలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందాడు.

అతను తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా 2004, 2009 శాసనసభ ఎన్నికలలో భారీ మెర్జార్టీతో గెలిచాడు. అతను సాంబ సినిమాను నిర్మించాడు. కొన్ని రాజకీయ కారణాల మూలంగా 2012లో తెలుగు దేశం పార్టీ నుండి బయటికి వచ్చేసాడు. తరువాత వై.ఎస్.జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 2014 శాసన సభ ఎన్నికలలో కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభిమానం ఎక్కువగా ఉన్న సమయంలో కూడా అతను గుడివాడ శాసన సభ నియోజక వర్గం నుండి గెలుపొందాడు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికలలో అతను గుడివాడ నియోజక వర్గం నుండి పోటీ చేసి తెలుగు దేశంపార్టీ అభ్యర్థి దేవినేని అవినాష్ పై 19,479 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అతను 2019 జూన్ 8 నుండి రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్నాడు.[8][1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 TV5 News (8 June 2019). "ఏపీ మంత్రుల ప్రొఫైల్." (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2022. Retrieved 5 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Prajasakti (10 April 2022). "రాజీనామాలను ఆమోదించిన గవర్నర్". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  3. M, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolio's". www.thehansindia.com. Retrieved 8 June 2019.
  4. "Andhra Pradesh 2004". Election Commission of India (in Indian English). Retrieved 8 June 2019.
  5. "Statistical Report AP 2009" (PDF).
  6. "Andhra Pradesh Elections 2014".
  7. "Andhra Pradesh Lok Sabha General Election 2019 Date, Seats, Results". www.loksabhaelections.in. Archived from the original on 27 మే 2019. Retrieved 8 June 2019.
  8. M, Sambasiva Rao (8 June 2019). "AP new Cabinet Ministers portfolios". www.thehansindia.com. Retrieved 9 June 2019.

బాహ్య లంకెలు

[మార్చు]
  1. YSR Congress MLA arrested for telling his men to protest
  2. YSRCP leaders face the heat in Krishna
  3. 3.Nani did his homework well
  4. Deception, exploitation hallmark of TDP rule
  5. Kodali Venkateswar Rao
  6. ADR Report 2019
  7. Kodali Venkateswar Rao 2019, Affidavit 2019 AP Assembly Elections