Jump to content

నందమూరి బాలకృష్ణ

వికీపీడియా నుండి
నందమూరి బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ


పదవీ కాలం
2014 – ప్రస్తుతం
నియోజకవర్గం హిందూపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-10) 1960 జూన్ 10 (age 64)
India ఆంధ్రప్రదేశ్, ఇండియా
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి వసుంధర [1]
సంతానం కుమార్తెలు : బ్రాహ్మణి, తేజస్విని
కుమారుడు : తారకరామ తేజ మోక్షజ్ఞ
నివాసం హైదరాబాదు,తెలంగాణ
వృత్తి నటుడు
నిర్మాత
రాజకీయ నాయకుడు
మతం హిందూ

నందమూరి బాలకృష్ణ (జననం: 1960 జూన్ 10) ఒక తెలుగు సినిమా నటుడు, నిర్మాత, శాసనసభ సభ్యుడు. బాలకృష్ణ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. ఇతను నందమూరి తారకరామారావు కుమారుడు. ప్రస్తుతం ఆయన శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.వీరేష్ హీరో కూడా నందమూరి బాలకృష్ణ

బాలకృష్ణకు భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత మూడో పురస్కారం పద్మ భూషణ్ అవార్డును 2025 జనవరి 25న ప్రకటించింది.[2][3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

బాలకృష్ణ బాల్యం హైదరాబాదులో గడిచింది. ఇంటర్మీడియట్ చదువు పూర్తయిన వెంటనే నటుడు కావాలని కోరుకున్నాడు. కానీ కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయాలనే తండ్రి కోరికను మన్నించి నిజాం కళాశాలలో డిగ్రీ చదివాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

బాలకృష్ణ 1982లో వసుంధరాదేవి వివాహం చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని, ఒక కుమారుడు మోక్షజ్ఞ ఉన్నాడు.[5]

కెరీర్

[మార్చు]

బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించాడు. తర్వాత తండ్రితో కలిసి నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. కథానాయకుడు కాకముందు బాలకృష్ణ నటించిన తాతమ్మ కల, దాన వీర శూర కర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, శ్రీమద్విరాట పర్వము, శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమాలకు ఎన్. టి. ఆర్ దర్శకత్వం వహించాడు. 2021 లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ వారి కలయికలో మూడవ సినిమా ఎన్టీ రామారావు గారి 12 మంది సంతానంలో బాలకృష్ణ ఆరవ కుమారుడు‌‌ చిన్నతనంలోనే సినిమాలలోకి ప్రవేశించిన బాలకృష్ణ ఇప్పటికీ వంద కన్నా ఎక్కువ సినిమాల్లో నటించారు. 16 సంవత్సరాల వయసులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాలో నటించారు. 1984లో సాహసమే జీవితం అనే సినిమాలో మొట్టమొదటిసారిగా హీరోగా నటించడం జరిగింది. బాలకృష్ణ తన కెరీర్ ప్రారంభంలో నటించినా సినిమాలలో సాహసమే జీవితం జననీ జన్మభూమి మంగమ్మగారి మనవడు అపూర్వ సహోదరుడు మువ్వగోపాలుడు ముద్దుల మామయ్య సినిమాలు విజయవంతమయ్యాయి. తెలుగులో మొట్టమొదటి సారిగా తీసిన సైపై సినిమా ఆదిత్య 36 9 లో బాలకృష్ణ పాత్రను, కథను చాలామంది మెచ్చుకున్నారు. రాబోయే కాలంలో జరిగే మార్పులను చాలావరకు ఆ రోజుల్లోనే అంచనా వేశారని చెప్పవచ్చు. 2019 వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలలో తన తండ్రి పాత్రను పోషించాడు.[6]

పురస్కారాలు

[మార్చు]
  • 1994 లో భైరవద్వీపం చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ఫిలింఫేర్ అవార్డు.
  • 2నరసింహ నాయుడు (2001), సింహా ( 2010)లెజెండ్ (2014) ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.
  • నరసింహనాయుడు చిత్రానికి గాను సినీగోయర్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్టర్ అవార్డు.
  • 2007 లో అక్కినేని అభినయ పురస్కారంతో సత్కరించారు.
  • పాండు రంగడు, సింహా, శ్రీరామరాజ్యం చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా భరతముని అవార్డు.
  • లెజెండ్ చిత్రానికి గాను 2014 ఉత్తమ కథనాయకునిగా SICA అవార్డు.నంది అవార్డు కూడా

లెజెండ్ మూవీకి వచ్చింది.

రాజకీయ ప్రవేశం

[మార్చు]

నటించిన చిత్రాలు

[మార్చు]
క్రమ సంఖ్య సినిమా పేరు సంవత్సరం సహ నటీనటులు సంస్థ దర్శకులు ఇతరములు
1 తాతమ్మకల 1974 ఎన్.టి.ఆర్, భానుమతి రామకృష్ణా సినీ స్టూడియోస్ దాసరి నారాయణరావు
2 రాం రహీమ్ 1974 రోజారమణి రాజలక్ష్మి కంబైన్స్ బి.ఎ.సుబ్బారావు
3 అన్నదమ్ముల అనుబంధం 1975 లత గజలక్ష్మి చిత్ర ఎస్.డి.లాల్
4 వేములవాడ భీమకవి 1975 ఎన్.టి.ఆర్,షావుకారు జానకి రామకృష్ణా సినీ స్టూడియోస్ డి.యోగానంద్
5 దాన వీర శూర కర్ణ 1977 దీప రామకృష్ణా సినీ స్టూడియోస్ ఎన్.టి. రామారావు
6 అక్బర్ సలీం అనార్కలి 1979 దీప తారకరామ ఫిలిం యునిట్ ఎన్.టి. రామారావు
7 శ్రీమద్విరాట్ పర్వం 1979 వాణిశ్రీ, ప్రభ, విజయలలిత రామకృష్ణా సినీ స్టూడియోస్ ఎన్.టి. రామారావు
8 శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం 1979 ఎన్.టి. రామారావు,జయప్రద,జయసుధ రామకృష్ణా సినీ స్టూడియోస్ ఎన్.టి. రామారావు
9 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు 1980 రాజ్యలక్ష్మి రామకృష్ణా సినీ స్టూడియోస్ కె. రాఘవేంద్ర రావు
10 అనురాగ దేవత 1982 ఎన్.టి. రామారావు,శ్రీదేవి,జయసుధ రామకృష్ణా సినీ స్టూడియోస్ తాతినేని రామారావు
11 సింహం నవ్వింది 1983 ఎన్.టి. రామారావు,శ్రీదేవి రామకృష్ణా సినీ స్టూడియోస్ డి. యోగానంద్
12 సాహసమే జీవితం 1984 విజ్జి గజలక్ష్మి కంబైన్స్ వాసు
13 డిస్కో కింగ్ 1984 తులసి శ్రీవిష్ణు ఫిలింస్ తాతినేని ప్రసాద్ డిస్కో డ్యాన్సర్ అనే హిందీ సినిమా రిమేక్
14 జనని జన్మభూమి 1984 సుమలత శ్రీ బ్రమరాంబా ఫిలింస్ కె. విశ్వనాథ్
15 మంగమ్మ గారి మనవడు 1984 సుహాసిని భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ కోడి రామకృష్ణ మన్ వాసనయి అనే సినిమా రిమేక్
16 పల్నాటి పులి 1984 భానుప్రియ శ్రీ సాయి చక్ర ప్రొడక్షన్ తాతినేని ప్రసాద్
17 శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 1984 రతి అగ్నిహోత్రి రామకృష్ణా సినీ స్టూడియోస్ ఎన్.టి. రామారావు
18 కథానాయకుడు 1984 విజయశాంతి సురేష్ ప్రొడక్షన్స్ కె. మురళీమోహనరావు
19 ఆత్మబలం (1985 సినిమా) 1985 భానుప్రియ శ్రీ వల్లీ ప్రొడక్షన్స్ తాతినేని ప్రసాద్ కర్జ్ అనే సినిమా రిమేక్
20 బాబాయి అబ్బాయి 1985 అనితారెడ్డి ఉషోదయ మూవీస్ జంధ్యాల
21 భార్య భర్తల బంధం 1985 రజని జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ వి.బి. రాజేంద్రప్రసాద్
22 భలే తమ్ముడు 1985 ఊర్వశి శ్రీ సత్య చిత్ర పరుచూరి బ్రదర్స్
23 కత్తుల కొండయ్య 1985 సుమలత ప్రసన్న ఆర్ట్స్ ఎస్.బి.చక్రవర్తి
24 పట్టాభిషేకం 1985 విజయశాంతి రామకృష్ణా సినీ స్టూడియోస్ కె. రాఘవేంద్ర రావు
25 నిప్పులాంటి మనిషి 1986 రాధ శ్రీ రాజలక్ష్మి ఆర్ట్స్ పిక్చర్స్ ఎస్.బి.చక్రవర్తి ఖయామత్ కి రిమేక్
26 ముద్దుల కృష్ణయ్య 1986 రాధ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ కోడి రామకృష్ణ
27 సీతారామ కళ్యాణం 1986 రజని యువ చిత్ర జంధ్యాల
28 అనసూయమ్మ గారి అల్లుడు 1986 భానుప్రియ రామకృష్ణా సినీ స్టూడియోస్ ఎ. కోదండరామిరెడ్డి
29 దేశోద్ధారకుడు 1986 విజయశాంతి విజయభాస్కర్ ఫిలిం ప్రొడక్షన్స్ ఎ. కోదండరామిరెడ్డి
30 కలియుగ కృష్ణుడు 09.05. 1986 రాధ విశ్వనాథ్ ఎంటర్ ప్రైజెస్ కె.మురళీమోహనరావు
31 అపూర్వ సహోదరులు 1986 విజయశాంతి, భానుప్రియ ఆర్ కే అసోసియేట్స్ కె. రాఘవేంద్ర రావు
32 భార్గవ రాముడు 1987 విజయశాంతి దేవి కమల్ మూవీస్ ఎ. కోదండరామిరెడ్డి
33 రాము 1987 రజని సురేష్ ప్రొడక్షన్స్ వై.నాగేశ్వరరావు
34 అల్లరి కృష్ణయ్య 1987 భానుప్రియ వనిత ఆర్ట్స్ నందమూరి రమేష్
35 సాహస సామ్రాట్ 1987 విజయశాంతి దేవి కమల్ మూవీస్ కె. రాఘవేంద్ర రావు
36 ప్రెసిడెంట్ గారి అబ్బాయి 1987 సుహాసిని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వై.నాగేశ్వరరావు
37 మువ్వ గోపాలుడు 19.06.1987 విజయశాంతి, శోభన భార్గవ్ ఆర్ట్ పిక్చర్స్ కోడి రామకృష్ణ
38 భానుమతిగారి మొగుడు 18.11.1987 విజయశాంతి డి వి ఎస్ ఎంటర్ ప్రైజెస్ వై.నాగేశ్వరరావు
39 ఇన్స్‌పెక్టర్ ప్రతాప్ 1988 విజయశాంతి కృష్ణచిత్ర ముత్యాల సుబ్బయ్య
40 దొంగరాముడు 1988 మోహన్ బాబు గోపి ఆర్ట్ పిక్చర్స్ కె. రాఘవేంద్రరావు
41 తిరగబడ్డ తెలుగు బిడ్డ 1988 భానుప్రియ తేజస్వి ప్రొడక్షన్ ఎ. కోదండరామిరెడ్డి
42 భారతంలో బాలచంద్రుడు 1988 భానుప్రియ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ కోడి రామకృష్ణ
43 రాముడు భీముడు 1988 రాధ, సుహాసిని సత్యం సినీ ఎంటర్ ప్రైజెస్ కె.మురళీమోహనరావు
44 రక్తాభిషేకం 1988 రజని రాజీవ్ ప్రొడక్షన్ ఎ. కోదండరామిరెడ్డి
45 భలే దొంగ 1989 విజయశాంతి తారకరామ ప్రొడక్షన్ ఎ. కోదండరామిరెడ్డి
46 ముద్దుల మావయ్య 1989 విజయశాంతి భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ కోడి రామకృష్ణ తమిళ సినిమా రీమేక్
47 అశోక చక్రవర్తి 1989 భానుప్రియ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ ఎస్.ఎస్.రవిచంద్ర మలయాళ చిత్రం ఆర్యన్ రీమేక్
48 బాల గోపాలుడు 1989 సుహాసిని పి.బి. ఆర్ట్ ప్రొడక్షన్ కోడి రామకృష్ణ
49 ప్రాణానికి ప్రాణం 1990 రజని హరీష్ ఎంటర్ ప్రైజెస్ చలసాని రామారావు
50 నారీ నారీ నడుమ మురారి 1990 శోభన,నిరోషా యువ చిత్ర ఎ. కోదండరామిరెడ్డి
51 ముద్దుల మేనల్లుడు 1990 విజయశాంతి భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ కోడి రామకృష్ణ
52 లారీ డ్రైవర్ 1990 విజయశాంతి జయ ప్రొడక్షన్ బి. గోపాల్
53 తల్లిదండ్రులు 1991 విజయశాంతి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ తాతినేని రామారావు
54 బ్రహ్మర్షి విశ్వామిత్ర 1991 మీనాక్షి శేషాద్రి బసవ తారకం మెడికల్ ట్రస్ట్ ఎన్.టి. రామారావు
55 ఆదిత్య 369 1991 మోహిని శ్రీ దేవీ మూవీస్ సింగీతం శ్రీనివాసరావు
56 ధర్మక్షేత్రం 1992 దివ్యభారతి శ్రీ రాజీవ్ ప్రొడక్షన్ ఎ. కోదండరామిరెడ్డి
57 రౌడీ ఇన్‌స్పెక్టర్ 1992 విజయశాంతి విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బి. గోపాల్
58 అశ్వమేధం 1992 నగ్మా, మీనా వైజయంతి మూవీస్ కె. రాఘవేంద్రరావు
59 నిప్పురవ్వ 1993 విజయశాంతి యువరత్నా ఆర్ట్స్ ఎ. కోదండరామిరెడ్డి
60 బంగారు బుల్లోడు 1993 రమ్యకృష్ణ, రవీనా టాండన్ జగపతి ఆర్ట్ పిక్చర్స్ రవిరాజా పినిశెట్టి
61 భైరవ ద్వీపం 1994 రోజా చందమామ విజయ కంబైన్స్ సింగీతం శ్రీనివాసరావు
62 గాండీవం 1994 రోజా శ్రీ లక్ష్మీ నరసింహ కంబైన్స్ ప్రియదర్శన్
63 బొబ్బిలి సింహం 1994 రోజా, మీనా విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ ఎ. కోదండరామిరెడ్డి
64 టాప్ హీరో 1994 సౌందర్య శ్రీ చిత్ర క్రియేషంస్ ఎస్.వి.కృష్ణారెడ్డి
65 మాతో పెట్టుకోకు 1995 రోజా, రంభ భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ ఎ. కోదండరామిరెడ్డి
66 వంశానికొక్కడు 1996 ఆమని శ్రీ దేవి మూవీస్ శరత్ వి
67 శ్రీ కృష్ణార్జున విజయం 1996 రోజా చందమామ విజయ కంబైన్స్ సింగీతం శ్రీనివాసరావు
68 పెద్దన్నయ్య 1997 రోజా, ఇంద్రజ రామకృష్ణా హార్టీకల్చరల్ సినీ స్టూడియోస్ శరత్
69 ముద్దుల మొగుడు 1997 మీనా రమా ఫిలిమ్స్ ఎ. కోదండరామిరెడ్డి
70 దేవుడు 1997 రమ్యకృష్ణ, కాంచన శ్రీ చిత్ర క్రియేషన్స్ రవిరాజా పినిశెట్టి
71 యువరత్న రాణా 1998 హీరా ఋగ్వేద ప్రొడక్షన్స్ ఎ. కొదండరామిరెడ్డి
72 పవిత్రప్రేమ 1998 లైలా, రోషిణి శ్రీనివాస ప్రొడక్షన్స్ ముత్యాల సుబ్బయ్య
73 సమరసింహా రెడ్డి 1999 అంజలా జవేరీ, సిమ్రాన్, సంఘవి శ్రీ సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బి. గోపాల్
74 సుల్తాన్ 1999 రోజా, రచన పి.బి. ఆర్ట్స్ శరత్
75 కృష్ణ బాబు 1999 మీనా, రాశి శ్రీనివాస ప్రోడక్షన్ ముత్యాల సుబ్బయ్య
76 వంశోద్ధారకుడు 2000 రమ్యకృష్ణ, ఆమని గాయత్రి ఫిలింస్ సరత్
77 గొప్పింటి అల్లుడు 2000 సిమ్రాన్ రామకృష్ణా సినీ స్టూడియోస్ ఇ.వి.వి.సత్యనారాయణ
78 నరసింహ నాయుడు 2001 సిమ్రాన్, ప్రీతి జింఘానియా శ్రీ వెంకటరమణ ప్రొడక్షన్ బి. గోపాల్
79 భలేవాడివి బాసు 2001 అంజలా జవేరి,శిల్పా శెట్టి శ్రీదేవీమూవీస్ పి ఎ అరుణ్ ప్రసద్
80 సీమ సింహం 2002 సిమ్రాన్, రీమా సేన్ బాలాజీ క్రియేషన్స్ రామ్ ప్రసాద్
81 చెన్నకేశవరెడ్డి 2002 టబు, శ్రియా సరన్ శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్ వి.వి.వినాయక్
82 పల్నాటి బ్రహ్మ నాయుడు 2003 ఆర్తి అగర్వాల్, సొనాలీ బింద్రె శ్రీ వెంకట రమణ ప్రోడక్షన్ బి. గోపాల్
83 లక్ష్మీ నరసింహా 2004 ఆసిన్ శ్రీ సాయిగణేష్ ప్రోడక్షన్ జయంత్ సి పరాన్జీ తమిళ చిత్రం సామి రీమేక్
84 విజయేంద్ర వర్మ 2004 లయ, అంకిత, సంగీత ఆదిత్య ప్రోడక్షన్ స్వర్ణ సుబ్బారావు
85 అల్లరి పిడుగు 2005 కత్రినా కైఫ్, ఛార్మి పి.బి ఆర్ట్స్ జయంత్ సి పరాన్జీ
86 వీరభద్ర 2006 తనూశ్రీ దత్తా, సదా అంబిక సినిమా ప్రొడక్షన్స్ ఎస్. రవికుమార్ చౌదరి
87 మహారథి 2007 స్నేహ, మీరా జాస్మిన్ శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ పి. వాసు
88 ఒక్క మగాడు 2008 అనుష్క,సిమ్రాన్ బొమ్మరిల్లు వై. వి. ఎస్. చౌదరి
89 పాండురంగడు 2008 స్నేహ, తబు అర్.కె. ఫిలిమ్ అసోసియేషన్ కె. రాఘవేంద్రరావు
90 మిత్రుడు 2009 ప్రియమని వైష్ణవి సినిమా మహదేవ్
91 సింహా 2010 నయనతార, స్నేహా ఉల్లాల్ యునైటెడ్ మూవీస్ బోయపాటి శ్రీను
92 పరమ వీర చక్ర 2011 అమీషా పటేల్, నేహా ధుపియ, షీలా తేజ సినిమా దాసరి నారాయణ రావు
93 శ్రీరామరాజ్యం 2011 నయనతార శ్రీ సాయిబాబా మూవీస్ బాపు
94 అధినాయకుడు 2012 లక్ష్మీ రాయ్ శ్రీ కీర్తీ క్రీయేషన్స్ పరుచూరి మురళి
95 ఊ..కొడతారా ఉలిక్కిపడతారా 2012 పంచిబొర మంచు ఎంటర్ టైన్ మెంట్ శేకర్ రాజ
96 శ్రీమన్నారాయణ 2012 పార్వతి మెల్టన్, ఇషా చావ్లా యెల్లోఫ్లవర్స్ రవి చావలి
97 లెజెండ్ 2014 సొనల్ చౌహన్, రథిక అప్తే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ వారాహి చలన చిత్రం బోయపాటి శ్రీను
98 లయన్ 2015 త్రిష, రథిక అప్తే రుద్రపాటి రమణ రావు సత్యదేవ్
99 డిక్టేటర్ 2016 సొనల్ చౌహన్, అంజలి ఎరోస్ ఇంటర్నేషనల్ శ్రీవాస్
100 గౌతమీపుత్ర శాతకర్ణి (సినిమా) 2017 శ్రియా సరన్ క్రిష్
101 పైసా వసూల్ 2017 శ్రియా సరన్ భవ్య క్రియేషన్స్ పూరి జగన్నాథ్
102 జై సింహ 2018 నయనతార కె. ఎస్. రవికుమార్
103 ఎన్.టి.ఆర్. కథానాయకుడు 2019 ఎన్.బి.కె. ఫిల్స్మ్ క్రిష్
104 ఎన్.టి.ఆర్. మహానాయకుడు 2019 ఎన్.బి.కె. ఫిల్స్మ్ క్రిష్
105 రూలర్ 2019 సోనాల్ చౌహాన్, వేదిక సి.కె. ఎంటర్టైన్మెంట్స్
హ్యాపీ మూవీస్
కె. ఎస్. రవికుమార్
106 అఖండ 2021 ప్రగ్య జైస్వాల్ ద్వారక క్రియేషన్స్ బోయపాటి శ్రీను
107 వీర సింహా రెడ్డి 2023 శృతి హాసన్, శ్రీలీల మైత్రీ మూవీ మేకర్స్ గోపీచంద్ మలినేని
108 భగవంత్‌ కేసరి 2023 కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌శ్రీలీల షైన్ స్క్రీన్ అనిల్‌ రావిపూడి
109 డాకు మహారాజ్ 2024 ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బాబీ
నర్తనశాల 2020 సౌందర్య ఎన్.బి.కె. ఫిల్స్మ్ బాలకృష్ణ విడుదల కాలేదు

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

మూలాలు

[మార్చు]
  1. "Balakrishna and Vasundhara Wedding Card బాలకృష్ణ - వసుంధర గార్ల పెళ్లి ఆహ్వాన పత్రిక". Telugu Adda. 2023-12-27.
  2. "నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్". 25 January 2025. Archived from the original on 25 January 2025. Retrieved 25 January 2025.
  3. "14ఏళ్లకే తెరంగేట్రం.. ఇప్పుడు పద్మభూషణ్‌.. బాలకృష్ణ డ్రీమ్‌రోల్స్‌ ఇవే." Eenadu. 26 January 2025. Archived from the original on 26 January 2025. Retrieved 26 January 2025.
  4. "బాలకృష్ణ గురించి ఈ విశేషాలు మీకు తెలుసా?". www.eenadu.net. Archived from the original on 2020-06-08. Retrieved 2020-06-08.
  5. "ఆమెనే నాకు బెస్ట్ ఫ్రెండ్- మా ఇంట్లో అంతా 'వసుంధర'దే : బాలకృష్ణ - Nandamuri Balakrishna Family". ETV Bharat News. 1 September 2024. Archived from the original on 25 January 2025. Retrieved 25 January 2025.
  6. "Balakrishna: I fully trust in Boyapati Sreenu". TeluguBulletin.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-13. Retrieved 2022-03-21.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.