ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
Jump to navigation
Jump to search
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ భారతదేశంలో సినీ నిర్మాణ సంస్థ. ఈ సంస్థ అధిపతి అనుమోలు వెంకటసుబ్బారావు. ఈ సంస్థ మొదటి చిత్రం ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన పెంపుడు కొడుకు. ఈ సంస్థ ద్వారా సుబ్బారావు 22 తెలుగు, ఒక తమిళ, 3 హిందీ చిత్రాలు నిర్మించాడు. విజయ, సురేష్, అన్నపూర్ణ లాంటి సంస్థలకు ధీటుగా సినిమాలు నిర్మించింది ఈ సంస్థ. రచయిత శ్రీశ్రీకి ఇది మాతృసంస్థ లాంటిది.
నిర్మించిన సినిమాలు
[మార్చు]1953లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించిన పెంపుడు కొడుకు ఈ సంస్థ నిర్మించిన మొదటి చిత్రం. 1959లో తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఇల్లరికం నిర్మించిన తర్వాత అతని వద్ద సహాయకునిగా పనిచేసిన కె.ప్రత్యగాత్మతో భార్య భర్తలు (1961), కులగోత్రాలు (1962) నిర్మించాక, 1963 లో పునర్జన్మ చిత్రాన్ని నిర్మించాడు.[1]
- పోలీస్ బ్రదర్స్ (1994)
- గోల్ మాల్ గోవిందం (1992)
- తల్లిదండ్రులు (1991)
- ప్రెసిడెంట్ గారి అబ్బాయి (1987)
- నాయకుడు వినాయకుడు (1980)
- కమలమ్మ కమతం (1979)
- ఆలుమగలు (1977)
- అర్ధాంగి (1977)
- అల్లుడొచ్చాడు (1976)
- అత్తవారిల్లు (1976)
- పల్లెటూరి బావ (1973)
- భార్యాబిడ్డలు (1971)
- ఆదర్శ కుటుంబం (1969)
- బ్రహ్మచారి (1968)
- నవరాత్రి (1966)
- మనుషులు మమతలు (1965)
- పునర్జన్మ (1963)
- కులగోత్రాలు (1962)
- భార్యాభర్తలు (1961)
- ఇల్లరికం (1959)
- వీరప్రతాప్ (1958)
- పెంపుడు కొడుకు (1953)
మూలాలు
[మార్చు]- ↑ "కళల కోసమే.. పునర్జన్మ". సితార. Archived from the original on 2019-11-09. Retrieved 2020-04-19.