ఇల్లరికం
స్వరూపం
ఇల్లరికం అనగా వివాహం అయిన పిదప పెళ్ళి కుమారుడు అత్తవారింటిలో పూర్తిగా ఉండిపోవు సాంప్రదాయం.
విశేషాలు
[మార్చు]హిందూ మత సంప్రదాయంలో వివాహమైన పిదప వధువును వెంటనే అత్త వారింటికి పంపుతారు. ఇది పితృ స్వామ్య వవస్థ రీతి. అలా కాకుండా వరుడే ఆత్త వారింటికి వెళ్లటమే ఇల్లరికం. ఈ విషయ మై వివాహానికి ముందే వధువు మరియూ వరుడి తల్లి తండ్రులు ఒక అంగీకారానికి వస్తారు. ఇల్లరికం అంటే కూతుర్ని అత్తవారింటికి పంపించకుండా, అల్లున్ని తన ఇంటికి తెచ్చుకోవడం. ఇదొక ఆంధ్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అన్ని చోట్లా ఉంది. ఈ సాంప్రదాయం ఈ క్రింది కారణాల వలన కొనసాగుతుంది.
కారణాలు
[మార్చు]- ఒకే కూతురు ఉన్నవారు అల్లుని ఇల్లరికం తెచ్చుకొంటారు.
- అధికంగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవారు
- అల్లుని వైపు ఎవరూ లేక ఒంటరిగా ఉన్నపుడు
- అల్లుని ఉద్యోగం ఉన్న ఊరిలో అత్తవారు నివసించుచున్నపుడు.
ఇల్లరికంలో కష్టాలు సుఖాలు
[మార్చు]- ఇల్లరికంలో అల్లుని చిన్న బుచ్చడం వలన సంసారాలు దెబ్బతినదం సాధారణంగా జరుగుతుంటుంది.
సినిమాలు
[మార్చు]ఇల్లరికంపై పలు సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని
- ఇల్లరికం (అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా ఈ సినిమా తెరకెక్కింది.)
పాటలు
[మార్చు]- భలేఛాన్సులే..భలేఛాన్సులే..లలలాం లలలాం లక్కీ ఛాన్సులే...ఇల్లరికంలో ఉన్నమజా[1]
సామెతలు
[మార్చు]- ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.[2]
- ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు - కొమ్ముల బర్రె కొట్టానికి చేటు [3]