అఖండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అఖండ
దర్శకత్వంబోయపాటి శ్రీను
రచనబోయపాటి శ్రీను
ఎం. రత్నం
నిర్మాతమిర్యాల రవీందర్ రెడ్డి
తారాగణం
ఛాయాగ్రహణంసి. రామ్ ప్రసాద్
కూర్పుకోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతంతమన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుపెన్ స్టూడియోస్
విడుదల తేదీ
2 డిసెంబరు 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

అఖండ 2021లో రూపొందిన, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెలుగు సినిమా. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసి, శ్రీకాంత్, ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలైంది.[1] అఖండ సినిమా 21 జనవరి 2022న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల అయ్యింది.[2]

చిత్ర నిర్మాణం

[మార్చు]

బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా 6 డిసెంబర్ 2019లో పూజ కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది.[3][4] ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 2న రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది.[5] ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న తరువాత కరోనా కారణంగా వాయిదా పడి లాక్ డౌన్ అనంతరం తిరిగి అక్టోబర్ 2020లో షూటింగ్ ప్రారంభమైంది.[6] తొలుత బిబి3 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు 13 ఏప్రిల్ 2021న ‘అఖండ’అనే టైటిల్‌ని అనౌన్స్‌ చేసి టీజర్‌ను విడుదల చేశారు.[7]

కరోనా సెకండ్ వేవ్ లాక్‌డౌన్ సందర్బంగా మార్చ్ 2021లో షూటింగ్‌ మళ్ళీ వాయిదా పడిన ఈ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్ తిరిగి 12 జులై 2021న హైదరాబాద్ లో ప్రారంభమై,[8] క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులో పూర్తయింది.[9]

ప్రారంభం

[మార్చు]

కర్ణాటక అడవుల్లో దాగి ఉన్న అతి క్రూరుడు, బందిపోటు అయిన గజేంద్ర సాహు (నితిన్ మెహతా) ను అటవీ శాఖాధికారులు పట్టుకోవటానికి చేసే ప్రయత్న సన్నివేశాలతో చిత్రం ప్రారభం అవుతుంది. అటవీ శాఖాధికారులను మట్టు పెట్టే ప్రయత్నం లో గాయలపాలు అయిన గజేంద్ర సాహు, ఒక పీఠాధిపతిని హత్య చేసి, ఆ పీఠాన్ని తన అధీనం లోకి తీసుకుని శక్తి స్వరూపానంద స్వామిగా పేరు మార్చుకొని, తానే ఆ పీఠాధిపతిగా కొనసాగుతాడు.[10]

అఖండ జననం

[మార్చు]

పీఠాధిపతి హత్యకు గురైన రాత్రే, రాయలసీమ లోని ఒక ప్రాంతం లో రామచంద్రయ్య దంపతులకు మగ కవల శిశువులు జన్మిస్తారు. అయితే అందులో ఒక శిశువుకు చలనం ఉండదు. ఎవరి గడపా త్రొక్కని అఘోరా బాబా (జగపతి బాబు) ఎవరూ చెప్పకనే, కవలల గురించి తెలుసుకొని వారిని చూడటానికి రామచంద్రయ్య ఇంటికి వస్తాడు. సాధారణంగా ఉన్న శిశువు ప్రకృతి అని, ఆ బంధం పెంచుకొమ్మని, చలనం లేని శిశువు ప్రళయం అని, ఆ బంధం తెంచుకొమ్మని తెలుపగా, చలనం లేని శిశువును అఘోరా బాబాకు ఇచ్చేస్తాడు రామచంద్రయ్య. అఘోరా బాబా చలనం లేని శిశువుని, కాశీ వెళ్ళే అఘోరా లకు ఇవ్వగా, వారు శిశువుని కాశీ గుడి చేరుస్తారు. లింగాన్ని అభిషేకం చేసే పాత్ర నుండి ఒక బిందువు, శిశువు భృకుటి పై పడగనే, శిశువు లో చలనం వస్తుంది. చలనం వచ్చిన శిశువు కళ్ళు చండ్ర నిప్పుల్లా ఎర్రగా ఉండటం తెరపై చూపించటం జరుగుతుంది.

అన్యాయాన్ని ఎదురించే మురళీకృష్ణ

[మార్చు]

అనంతపురం లో ఫ్యాక్షన్ గొడవలను రూపు మాపి, ఫ్యాక్షనిస్టులను రైతులు గా మార్చే ఒక మోతుబరి రైతు మురళీకృష్ణ (నందమూరి బాలకృష్ణ).[11] విద్యాలయాలను స్థాపించటం, విద్యార్థులకు సరియైన దిశానిర్దేశం చేయటం, శిశువుల ఆరోగ్యానికి కావలసిన టీకాలు/చుక్కల మందులను వేసే ఆరోగ్య శిబిరాలను నిర్వహించటం వంటి పలు సేవాకార్యక్రమాలను చేసే మురళీకృష్ణను ఆ జిల్లాకు కలెక్టర్ గా వచ్చిన శరణ్య బాచుపల్లి (ప్రగ్యా జైస్వాల్) ఫ్యాక్షనిస్టుగా అపార్థం చేసుకొంటుంది. అయితే తర్వాత నిజం తెలిసి, అతణ్ణి ప్రేమిస్తుంది. ఇద్దరికీ పెళ్ళవటం, ఒక అమ్మాయి పుట్టటం చకచకా జరిగిపోతాయి. గజేంద్ర సాహు వెన్నుదన్నుతో అన్యాయంగా మైనింగ్ నిర్వహిస్తున్న వరదరాజులు (శ్రీకాంత్ (నటుడు)) తో మురళీకృష్ణ ఘర్షణ పడతాడు. వరదరాజులు అక్రమాల వల్ల ఆ ఊరి పిల్లలకు అనారోగ్యం చేస్తుంది. పలువురు పిల్లలు, వారి తల్లిదండ్రులతో ఆసుపత్రి కిక్కిరిసి ఉన్న సమయంలో జరిగిన బాంబు పేలుడు వలన చాలా మంది చనిపోతారు. ఆసుపత్రి మురళీకృష్ణదే కావటంతో పోలీసులు అతణ్ణి అదుపులోకి తీసుకొంటారు. మురళీకృష్ణ-శరణ్య దంపతుల పాప కూడా అనారోగ్యం పాలు కావటంతో, వైద్యం నిమిత్తం శరణ్య పాపను తీసుకుని బెంగుళూరు బయలుదేరుతుంది. ఈ ప్రయాణం లో వరదరాజుల మనుషులు వీరిని వెంబడిస్తారు.

అఖండ ఆగమనం

[మార్చు]

అదుపు తప్పిన వాహనం పాడుబడ్డ గుహల వైపుగా పోవటం తో, వరదరాజుల మనుషుల నుండి తప్పించుకోవటానికి శరణ్య పాపను తీసుకొని గుహల లోపలికి పోతుంది. వరదరాజులు మనుషుల తో పోరాడి, వారిని వధించి, వారి నుండి పాపను కాపాడిన అఘోరా (నందమూరి బాలకృష్ణ) అచ్చం మురళీకృష్ణను పోలి ఉండటంతో నివ్వెర పోతుంది. విరామం బదులుగా, "అఖండ ఆగమనం" అని తెరపై పడుతుంది.

ముగింపు

[మార్చు]

పోలీసుల అదుపులో ఉన్న మురళీకృష్ణ ఏమౌతాడు? వరదరాజులు మైనింగ్ వ్యాపారానికి అడ్డుకట్ట వేసింది ఎవరు? పాపను కాపాడిన అఖండ గజేంద్ర సాహును వెదుక్కొంటూ ఎలా వెళ్తాడు? భవబంధాలకు లొంగని అఘోరా ను చిన్నారి బంధం చివరి వరకు ఎలా కట్టిపడేసింది? తన తల్లి ఎవరో తెలుసుకొన్న అఘోరా, తిరిగి తల్లి ఒడి చేరతాడా? చిన్నారితో ఏర్పడిన అనుబంధం నుండి అఘోరా విముక్థుడు అవుతాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే ద్వితీయార్థం.

రివ్యూలు

[మార్చు]

బాలకృష్ణ గూండాలని చావగొట్టినట్లు, ఈ సినిమా మనల్ని చావగొడుతుంది అని న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రివ్యూ ఇచ్చింది.[12] బోయపాటి సినిమాలలో లాజిక్ కు స్థానం ఉండదని, పాత్రలు అరిచే అరుపులు థియేటర్ బయటికి వచ్చినా వినిపించేంత గట్టిగా ఉండటం పరిపాటి అని ఇండియా టుడే విమర్శాస్త్రం సంధించింది. మాస్ గా కనబడినా అఖండ లో బలమైన కథ ఉందని, అయితే హీరో పాత్రను మెప్పింపజేసేందుకు, కథ ప్రక్కదోవ పట్టిందని తెలిపింది. అఖండ కేవలం బాలయ్య అభిమానులను అలరిస్తుందని, అంతకు మించి మరేమీ సినిమా లో లేదని రివ్యూ ఇచ్చింది.[13]

  • ఈనాడు: బాలకృష్ణ-బోయపాటి ల కలయికలలో ప్రేక్షకులు ఏం ఆశిస్తారో అవన్నీ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ లో అఖండ పరచయం వరకూ సినిమా ఒక ఎత్తు అయితే, అక్కడి నుండి మరొక ఎత్తు. బాలకృష్ణను బోయపాటి శక్తిమంతంగా చూపిస్తారని అందరికీ తెలిసినా, ఇందులో ఆ పాళ్ళు మరింత పెంచారు. ఇది మాస్ ప్రేక్షకులను అలరించే చిత్రం. ఈ సినిమా కథ, బాలకృష్ణ మాత్రమే చేయగలడని అనిపిస్తుంది. తమన్ నేపథ్య సంగీతం అతడు పడిన కష్టాన్ని తెలుపుతుంది. బాలకృష్ణ-బోయపాటి ల కలయిక ఎందుకు ప్రత్యేకమో ఈ సినిమా మరొకసారి తెలుపుతుంది. చిత్ర యూనిట్ సాంకేతిక అంశాలతో బాటు, సెంటిమెంట్ ను కూడా పండించగలిగారు.[10]
  • సాక్షి: వన్ మేన్ షో గా, బాలకృష్ణ మరొక మారు తనదైన శైలిలో విజృంభించాడు. రెండు విభిన్న పాత్రల్లో వేరియషన్స్ తో బాలయ్య ఆకట్టుకొన్నాడు. బాలయ్య-బోయపాటి కాంబో లోని హ్యాట్రిక్ అయిన ఈ చిత్రం నుండి ఫ్యాన్స్ ఏవైతే ఆశిస్తారో అవన్నీ ఉన్నాయి. బాలయ్య కనబడే ప్రతీ సీన్ పరిచయ సన్నివేశం అంత ఫ్రెష్ గా, క్లైమాక్స్ అంత తీవ్రంగా ఉంది. అయితే సగటు ప్రేక్షకుడికి మాత్రం హింస శృతి మించిందనే అభిప్రాయం కలుగుతుంది. కథ కంటే హీరోయిజం కే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చారనే అసంతృప్తి కలుగుతుంది. చిత్రం మొదలు నుండి తుదివరకూ ఆసాంతం తమన్ నేపథ్య సంగీతం అదిరిపోతుంది.[11]
  • టైంస్ ఆఫ్ ఇండియా: ఈ సినిమా కేవలం బాలకృష్ణ అభిమానులకు మాత్రమే. "జై బాలయ్య" అని వారితో అనిపించే పలు సన్నివేశాలు చిత్రం లో ఉన్నా, బోయపాటి తాను చేయాలనుకొన్నది చేయలేకపోయాడు. ఒక మంచి కథను, పేలవమైన కథనం చెడగొట్టింది. ఫ్యాక్షన్ ను అంతమొందించాలనే మురళీకృష్ణ పాత్ర లోని వినూత్ననత అభినందనీయం అనుకొంటుండగనే, శరణ్య తో పండని కొన్ని ప్రేమ సన్నివేశాలు ఉసూరు మనిపిస్తాయి. పైగా, ఈ సినిమా వారి కథ కాదు. అఖండ ది. అఖండ ఆగమనం, మురళీకృష్ణతో సహా మిగతా అన్ని పాత్రలను, ప్రేక్షకులను వెనక్కి నెట్టేస్తుంది. కథ ఆసక్తి కలిగించేది అయిననూ, బోయపాటి మాస్ సీన్ల తుపానులో కొట్టుకుపోవటం వలన సినిమాకు న్యాయం చేయలేకపోయాడు. ప్రేక్షకుల నుండి ఈ మాస్ సీన్లు ఈలలైతే వేయిస్తాయి కానీ, కథకు ఏ మాత్రం ఉపయోగకరం కాలేకపోయయి. అఖండ దైవసమానుడిగా చిత్రీకరించబడ్డాడు. శరణ్య పాత్ర బలమైంది గా పరిచయం అయినప్పటికీ, కథ ముందుకు పోయే కొద్దీ, ఆమె పాత్ర బలహీనం చేయవలసి వచ్చింది. తమన్ నేపథ్యసంగీతం తో బాటు రాంప్రసాద్ కెమెరా పనితనం అభినందనీయం.[14]
  • హిందు: యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించటం లో బోయపాటి బృందం అలుపెరగక శ్రమించింది. ఎం రత్నం చే రాయబడిన సంభాషణలు చిత్రానికి బిగువును తెచ్చాయి. బోయపాటి-బాలకృష్ణ ద్వయం ఈ చిత్ర నిర్మాణాన్ని అణువణువూ ఆస్వాదించినట్లు స్పష్టంగా కనబడుతుంది. శ్రీకాంత్ శక్తిమంతమైన విలన్ గా పరిచయం చేయబడినప్పటికీ, తర్వాతి సన్నివేశాలలో సాధారణ విలన్ లాగే కనబడతాడు. కర్ణభేరులు మ్రోగిపోయేలా తమన్ ఇచ్చిన సంగీతం సైతం కథను ఎలివేట్ చేయలేకపోయింది.[15]

నటీనటులు

[మార్చు]

పాటల రచయిత

[మార్చు]

అడిగా అడిగా , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం.ఎస్.పి.చరణ్ , ఎం ఎల్ శ్రుతి

జై బాలయ్య, రచన: అనంత్ శ్రీరామ్ ,గానం.గీతా మాధురి , సాహితి చాగంటి, సత్య యామిని, అదితి భావరాజు

అఖండ టైటిల్ సాంగ్, రచన: అనంత్ శ్రీరామ్, గానం.శంకర్ మహదేవన్ , సిద్ధార్ద్ మహదేవన్, శివo మహదేవన్

అమ్మ సాంగ్ , రచన: కళ్యాణ్ చక్రవర్తి , గానం . మోహన భోగరాజు

సంభాషణలు

[మార్చు]
  • రౌడీ మూకలతో మురళీకృష్ణ (బాలకృష్ణ): ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. శీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికి, శీను గారు మీ అమ్మా మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా ******!!![16]
  • రౌడీ మూకలతో మురళీకృష్ణ: ఏయ్! అంచనా వేయటానికి నువ్వేమయినా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమా? పిల్లకాలువ!![17]
  • వరదరాజులు (శ్రీకాంత్) తో మురళీకృష్ణ: ఒకసారి డిసైడ్ అయ్యి బరిలోకి దూరితే బ్రేకుల్లేని బుల్-డోజర్ ని. తొక్కి పడ ***!! లెఫ్టా రైటా టాపా బాటమా ఎటు నుంచి రేకు పెట్టి గోకినా, కొడకా...ఇంచి బాడీ దొరకదు!!
  • తనను తల ఎత్తి చూడమన్న తల్లితో ఏ మాత్రం చలించని అఖండ (బాలకృష్ణ) : వాగర్థావివ సంప్రక్తౌ, వాగర్థ ప్రతిపత్తయే! జగత:పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం!!
  • గజేందర్ సాహు (నితిన్ మెహతా) తో అఖండ: ఒక మాట నువ్వంటే అది శబ్దం. అదే మాట నేనంటే అది శాసనం. దైవ శాసనం.[17]
  • సిబిఐ ఆఫీసరుతో అఖండ: మీకు సమస్య వస్తే దండం పెడతారు. మేము ఆ సమస్యకే పిండం పెడతాం. Both are not same!![17]
  • ఒక పోరాట సన్నివేశం లో అఖండ: అనంతం అఖండం మా రూపం. అమేయం అమోహం మా దేహం. అహం శివం, అయం శివం!![18]
  • సిబిఐ ఆఫీసరుతో అఖండ: మనిషి మనుగడ కోసం మేము స్మరించేది మంత్రం. ఆ మనుగడకే ప్రమాదం వస్తే మేము చేసేది యుద్ధం. దారుణమైన యుద్ధం.[19]
  • ఒక పోరాట సన్నివేశం లో అఖండ: సోమసూర్య అగ్ని లోచనుడు, శ్వేత వృషభ వాహనుడు, శూల బాణ భుజంగ భూషణుడు, త్రిపురనాశ రక్షకుడు: .....శివుడు.....[20]
  • వరదరాజులు మనుషులతో తనను తాని పరిచయం చేసుకొంటూ అఖండ: అఖండ రుద్ర సికందర్ ఘోరా. గమ్యం కైలాసం, భుక్తం కపాలం, ఆయుధం త్రిశూలం, కర్తవ్యం దుష్ట సంహారం. సైనిక్, శివ్ కా సైనిక్. దైవం జోలికొస్తే దవడ పగిలిపోద్ది.[21]
  • గుడిని పేకాట క్లబ్బుగా మార్చిన ఒక అల్లరిమూకతో అఖండ: భగవంతుడు సృష్టికి తండ్రి, ప్రకృతి తల్లి, వాటికి పుట్టిన బిడ్డే ఈ విజ్ఞానం. ఇది నిజం. తెలుసుకొండి!![22]
  • అఖండ: దేవుణ్ణి కరుణించమని అడుగు. కనిపించమని కాదు! [22]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

2021 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ ప్రతినాయకుడు (శ్రీకాంత్)
  2. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (సి. రామ్ ప్రసాద్)

మూలాలు

[మార్చు]
  1. 10TV (8 June 2021). "Balakrishna : 'అఖండ' ఆన్ ది వే." (in telugu). Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. Sakshi (6 January 2022). "ఓటీటీలో అఖండ, సంక్రాంతి తర్వాతే రిలీజ్‌". Archived from the original on 6 జనవరి 2022. Retrieved 6 January 2022.
  3. 10TV (6 December 2019). "నువ్వొక మాటంటే అది శబ్ధం.. అదే మాట నేనంటే శాసనం.. NBK 106 ప్రారంభం." (in telugu). Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. The News Minute (25 December 2019). "Balakrishna's next with Boyapati Srinu put on hold?" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  5. Sakshi (2 March 2020). "బాలయ్య కొత్త చిత్రం షూటింగ్‌ స్టార్ట్‌". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  6. TV9 Telugu (29 October 2020). "బాలయ్య-బోయపాటి షురూ చేశారు". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Sakshi (13 April 2021). "బీబీ3 టైటిల్‌ వచ్చేసింది..మరోసారి అదరగొట్టిన బాలయ్య". Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.
  8. Telangana Today (13 July 2021). "Balakrishna's 'Akhanda' resumes shoot". Archived from the original on 14 July 2021. Retrieved 6 August 2021.
  9. 10TV (23 July 2021). "కుంభకోణంలో 'అఖండ' క్లైమాక్స్." (in telugu). Archived from the original on 6 August 2021. Retrieved 6 August 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  10. 10.0 10.1 "రివ్యూ: అఖండ". eenadu.net. 3 December 2021. Retrieved 25 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. 11.0 11.1 "Akhanda Movie Review: 'అఖండ'గా విజృంభించిన బాలయ్య..ఫ్యాన్స్‌కి పూనకాలే!". sakshi.com. Retrieved 2 December 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  12. "Akhanda movie review: Balakrishna punches goons, this film punches audience". newindianexpress.com. Retrieved 26 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  13. "Akhanda Movie Review: Balayya's film is a battle between people who have the loudest roar". www.indiatoday.in. Retrieved 26 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Akhanda Movie Review : Strictly for Balakrishna's fans". timesofindia.indiatimes.com. Retrieved 5 December 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  15. "'Akhanda' movie review: An ultra high decibel roar". thehindu.com. Retrieved 26 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  16. Creations, Dwaraka. "BB3 (Boyapati-Balayya no.3) First Roar". youtube.com. Retrieved 24 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  17. 17.0 17.1 17.2 Creations, Dwaraka. "Akhanda Trailer Role". youtube.com. Retrieved 24 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  18. Creations, Dwaraka. "Akhanda Roaring 50 days trailer". youtube.com. Retrieved 24 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  19. Creations, Dwaraka. "Akhanda Success Roar". youtube.com. Retrieved 24 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  20. Creations, Dwaraka. "Shivudu The Aghora - Dialogue". youtube.com. Retrieved 24 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  21. T-Series, Lahari Music. "Shiv Ka Sainik". youtube.com. Retrieved 24 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  22. 22.0 22.1 T-Series, Lahari Music. "Devunni Karuninchamani - Dialogue". youtube.com. Retrieved 24 January 2022.{{cite web}}: CS1 maint: url-status (link)
  23. Namasthe Telangana (29 December 2021). "'అఖండ' అంచనాల్ని నిజం చేసింది". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
[మార్చు]

మూస:Boyapati Srinu

"https://te.wikipedia.org/w/index.php?title=అఖండ&oldid=4229832" నుండి వెలికితీశారు