రాము (1987 సినిమా)
రాము (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వై.నాగేశ్వరరావు |
---|---|
నిర్మాణం | డి.రామానాయుడు |
కథ | వి.సి. గుహనాథన్ |
చిత్రానువాదం | వై.నాగేశ్వరరావు |
తారాగణం | బాలకృష్ణ, రజని , శారద |
సంగీతం | యస్.పి. బాలసుబ్రహ్మణ్యం |
సంభాషణలు | జంధ్యాల |
ఛాయాగ్రహణం | ఎస్. గోపాలరెడ్డి |
కూర్పు | కె.ఎ. మార్తాండ్ |
నిర్మాణ సంస్థ | సురేష్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రాము 1987 లో విడుదలైన తెలుగు చిత్రం. దీనిని వై.నాగేశ్వరరావు దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో డి. రామానాయుడు నిర్మించాడు. ఇందులో నందమూరి బాలకృష్ణ, రజని ప్రధాన పాత్రల్లో నటించగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టైంది.[1][2]
కథ
[మార్చు]రాము ( నందమూరి బాలకృష్ణ ) అనాథ. న్యాయవాది రాఘవరావు ( జగ్గయ్య ), గాయత్రి దేవి ( శారద ) తమ నలుగురు పిల్లలలో ఒకరిగా కొడుకులాగా దత్తత తీసుకున్నారు. రాము చాలా తెలివిగలవాడు. తల్లిదండ్రులను చాలా ప్రేమిస్తాడు. వారి కోసం ఏదైనా చేస్తాడు. రాము వారి ఇంట్లో పనివాడి కుమార్తె అయిన సీతను ( రజని ) తో ప్రేమలో పడతాడు. రాముకు వారి ఇంటి వ్యవహారాలలో ఉన్న స్వేచ్ఛ, హక్కులు వారి స్వంత కుమారులు సతీష్, రమేష్ (హరి ప్రసాద్, భాస్కర్) లకు, అల్లుడు గోపాలానికీ ( సుధాకర్ ) నచ్చదు. కాబట్టి వారు ఒక కుట్ర చేసి రామును ఇంటి నుండి పంపించేసి అధికారాలన్నీ తమ చేతిలోకి తీసుకుంటారు. ఇప్పుడు రాము తన కుటుంబంతో తిరిగి కలవడమే మిగతా కథ
నటవర్గం
[మార్చు]- నందమురి బాలకృష్ణ
- రజని
- కైకాల సత్యనారాయణ
- శారద
- కొంగర జగ్గయ్య
- బేతా సుధాకర్
- చలపతిరావు తమ్మారెడ్డి
- బాలాజీ
- హరి ప్రసాద్
- భాస్కర్
- సుత్తివేలు
- పి.ఎల్. నారాయణ
- బాబూ మోహన్
- మాలాశ్రీ
- జయమాలిని
- అనూరాధ
- రమాప్రభ
- శ్రీలక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]- కళ: సుధేందు రాయ్
- నృత్యాలు: రఘురం
- పోరాటాలు: విజయన్
- సంభాషణలు: జంధ్యాల
- సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్పీ బాలు, ఎస్.జానకి, పి. సుశీలా
- సంగీతం: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
- కథ: వి.సి. గుహనాథన్
- కూర్పు: KA మార్తాండ్
- ఛాయాగ్రహణం: ఎస్.కోపాల్రెడ్డి
- నిర్మాత: డి.రామానాయిడు
- చిత్రానువాదం - దర్శకుడు: వై.నాగేశ్వరరావు
- బ్యానర్: సురేష్ ప్రొడక్షన్స్
- విడుదల తేదీ: 1987 జూలై 31
పాటలు
[మార్చు]సం. | పాట పేరు | గాయకులు | పొడవు |
---|---|---|---|
1 | "అనురాగాల" | ఎస్పీ బాలు | 5:19 |
2 | "వానేమి చేస్తుంది" | ఎస్పీ బాలు, ఎస్.జానకి | 4:49 |
3 | "కానీ కానీ ముందు" | ఎస్పీ బాలు, పి.సుశీలా | 4:40 |
4 | "ఒంటి గంట కొట్టు" | ఎస్పీ బాలు, పి.సుశీలా | 4:41 |
5 | "దండాలమ్మ దండాలమ్మ" | ఎస్పీ బాలు, రమణ | 5:06 |
మూలాలు
[మార్చు]- ↑ "Heading". IMDb.
- ↑ "Heading-2". Nth Wall. Archived from the original on 2015-01-29. Retrieved 2020-08-29.