Jump to content

దగ్గుబాటి రామానాయుడు

వికీపీడియా నుండి
(డి.రామానాయుడు నుండి దారిమార్పు చెందింది)


దగ్గుబాటి రామానాయుడు
దగ్గుబాటి రామానాయుడు
జననందగ్గుబాటి రామానాయుడు
జూన్ 6, 1936
ప్రకాశం జిల్లా కారంచేడు
మరణం2015 ఫిబ్రవరి 18(2015-02-18) (వయసు 78)[1]
హైదరాబాద్, తెలంగాణ
మరణ కారణంకేన్సర్
నివాస ప్రాంతంహైదరాబాద్
ఇతర పేర్లుమూవీ మోఘల్
ప్రసిద్ధితెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత , భారత పార్లమెంటు మాజీ సభ్యుడు
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
మతంహిందూ
భార్య / భర్తరాజేశ్వరి
పిల్లలుసురేష్, వెంకటేష్
తండ్రివెంకటేశ్వర్లు
Notes
ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు

డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (జూన్ 6, 1936 - ఫిబ్రవరి 18, 2015) తెలుగు సినిమా నటుడు, ప్రముఖ నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. ఇతను 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో జన్మించాడు. ఒకే వ్యక్తి శతాధిక చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డ్ సృష్టించిన నిర్మాతగా డి. రామానాయుడు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. మూవీ మోఘల్ గా ఈయన్ని అభివర్ణిస్తారు. అంతటితో ఆగకుండా నేటికీ నిర్మాతగా ఆయన కొనసాగుతూ వర్ధమాన నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచాడాయన. అంతేగాక తన సంపాదనలో ప్రధానభాగం సినిమా రంగానికే వెచ్చిస్తూ, స్టూడియో, ల్యాబ్‌, రికార్డింగ్‌ సదుపాయాలు, డిస్ట్రిబ్యూషన్‌, ఎగ్జిబిషన్‌, పోస్టర్స్ ప్రింటింగ్‌, గ్రాఫిక్‌ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంతో పాటు పార్లమెంట్‌ సభ్యునిగానూ రాణించాడు. ఇతను 1999లో బాపట్ల నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికైనాడు. 2004లో అదే స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయాడు. 2010 సెప్టెంబరు 9న భారత ప్రభుత్వం నాయుడికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము ప్రకటించింది. 2015 ఫిబ్రవరి 18న హైదరాబాదులో కాన్సర్ వ్యాధితో బాధపడుతూ మరణించాడు[1].

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దగ్గుబాటి రామానాయుడు, 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా కారంచేడులో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు[2]. తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడుకి ఒక అక్క, చెల్లెలు. మూడేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. పినతల్లి వద్ద గారాబంగా పెరిగాడు. ఒంగోలులోని డాక్టరు బి.బి.ఎల్.సూర్యనారాయణ అనే బంధువు ఇంట్లో వుంటూ ఎస్సేసేల్సి దాకా విద్యాబ్యాసం చేశాడు. సూర్యనారాయణను చూశాక తానూ కూడా డాక్టరు కావాలని కలలుకనేవాడు. బడి లేనప్పుడు కాంపౌండరు అవతారం ఎత్తేవాడు. విజయవాడలో లయోలా కాలేజి ఏర్పాటు కోసం రెండు లక్షల చందాలు వసులుచేసినందుకు కృతజ్ఞ్యతగా క్రైస్తవ మిషనరీలు మద్రాసులోని ఆంధ్రా లయోలా కాలేజిలో సీటు కొరకు సాయం చేసారు. ఎప్పుడూ కాలేజిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో, కబడ్డీ మైదానంలోనే కనిపించేవాడు. మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో, తండ్రి తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్పించాడు. ఇక్కడ కాలేజి రాజకీయాలు తోడయాయి. రెండో సంవత్సరం పరీక్షలు కూడా తప్పాడు. రామానాయుడుకు మామ కూతురు రాజేశ్వరితో పెళ్ళి జరిగింది. పెళ్ళయిపోగానే ఆస్తి పంచివ్వమని తండ్రిని అడిగాడు కానీ తండ్రిమాట కాదనలేక మొదటి కొడుకు సురేష్ పుట్టేదాకా ఆస్తి విభజన వాయిదాపడింది. ఆతర్వాత, వందెకరాల పొలంతో సొంత సేద్యం మొదలుపెట్టాడు. వీరికి సురేష్, వెంకటేష్ ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మీద సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించారు.

సినిమా జీవితం

[మార్చు]

కారంచేడులో 'నమ్మిన బంటు' షూటింగ్ లో ఎడ్లపందెం దృశ్యం చిత్రీకరణ జరిగేటప్పుడు, రామానాయుడు ఓ సీన్లో నటించాడు, హుషారుగా అటు ఇటు తిరుగుతుండగా సినిమావాళ్ళ దృష్టిని ఆకర్షించాడు. తిరిగి వెళ్తునప్పుడు 'మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు?' అని అక్కినేని అడికితే, ఊరు, వ్యవసాయం తప్పించి మరో ఆలోచన లేదని బధులు ఇచ్చాడు. ఇష్టం లేకున్నా రైసుమిల్లు వ్యాపారం మొదలు పెట్టాడు, ఓ రోజు హఠాత్తుగా సేల్స్-టాక్సవాళ్ళు వచ్చి, బిల్లులు రాయడములేదంటు రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు. దీనితో ఆ వ్యాపారం మిద విరక్తి వచ్చేసింది, మిల్లు మూసీవేసీ ఊరు విడచి చెన్నపట్నం చేరుకున్నాడు. మహాబలిపురం రోడ్డులో పొలం కొన్నాడు, కాలక్షేపానికి రోజు తోడల్లుడితో కలిసి ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్ళేవాడు. అక్కడే సినిమావాళ్ళతో పరిచయాలు అయ్యాయి. 'అనురాగం' చిత్ర నిర్మాతలు భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని కబురుపెట్టారు. రామానాయుడు తన తండ్రిని ఒప్పించి, దురలవాట్ల జోలికి వెళ్లనని మాటిచ్చాడు.జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, ఎస్వీ రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావులతో ఎక్కువ సమయాన్ని గడిపేవారు[3]. ఈ పరిచయాలతోనే ఆయనకు 'నమ్మిన బంటు' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత పలు వ్యాపారాలు చేసిన ఆయన మళ్లీ జి.రామినీడు దర్శకత్వంలో 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మించి తొలి విజయాన్ని అందుకున్నారు. తన పెద్ద కుమారుడు సురేష్‌బాబు పేరున సురేష్ ప్రొడక్షన్స్ ప్రారంభించి 1964లో ఎన్టీఆర్ కథానాయకుడిగా 'రాముడు-భీముడు' చిత్రాన్ని నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్నారు. సినీ నిర్మాణ రంగంలో అడుగు ముందుకే వేశారు. అయితే ఆ తర్వాత విపరీతంగా నష్టాల పాలైన ఆయన 1971లో ప్రేమ్‌నగర్ చిత్రాన్ని నిర్మించారు.'ప్రేమనగర్' విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. 21 మంది కొత్త దర్శకుల్ని, ఆరుగురు హీరోలను పరిచయం చేశారు

పురస్కారాలు

[మార్చు]
పౌర పురస్కారాలు
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (దక్షిణ భారతదేశం)

మరణం

[మార్చు]

2002-03 సమయంలో రామానాయుడికి ప్రోస్టేట్ గ్రంథి కాన్సర్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించడంతో కొన్నాళ్ళపాటు అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. 2015 సమయంలో మళ్లీ సమస్య తలెత్తడంతో హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో వైద్యులు చికిత్స చేశారు. చివరి సంవత్సరాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డ రామానాయుడు అదే వ్యాధి వల్ల 2015, ఫిబ్రవరి 18న హైదరాబాద్‌లో మరణించాడు.[1]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

దగ్గుబాటి రామానాయుడు నిర్మించిన సినిమాలు పై లింకులోకి వెళ్లి పరిశీలించవచ్చును

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-20. Retrieved 2015-02-18.
  2. "Daggubati Ramanaidu: The End of an inspiring journey | India.com". www.india.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-13.
  3. "Ramanaidu: Movie mogul with a golden heart". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-01-13.
  4. "Padma Awards". pib. January 27, 2013. Retrieved January 27, 2013.