Jump to content

సులోచన (నటి)

వికీపీడియా నుండి
సులోచన
సులోచన 1920లలో.
జననం
రూబీ మేయర్స్

1907
పూణే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
మరణం1983 అక్టోబరు 10(1983-10-10) (వయసు 75–76) [1]
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1920–1980

సులోచన తొలి తరం హిందీ సినిమా నటి. ఈమె మొదట మూకీలలోను ఆ తర్వాత టాకీలలోను సుమారు 200 చిత్రాలలో నటించింది. ఈమె అసలు పేరు రూబీ మేయర్స్. ఈమె ఒక ఆంగ్లో ఇండియన్. "ఇండియన్ గ్రేటాగార్బో"గా ప్రసిద్ధి చెందిన ఈమె రూబీ పిక్చర్స్ పేరుతో ఒక సంస్థను నెలకొల్పి దోదోస్త్ అనే సినిమాని నిర్మించింది. 1974లో ఈమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు.[2]

విశేషాలు

[మార్చు]

ఈమె పూర్వీకులు బాగ్దాద్ నుండి భారతదేశానికి వలస వచ్చిన యూదులు. ఈమె పూనాలో 1907లో జన్మించింది. ఈమె మొదట బొంబాయిలో ఒక ప్రైవేటు సంస్థలో టెలీఫోన్ ఆపరేటర్‌గా పనిచేసింది. ఒక ఫంక్షన్‌లో ఈమెను చూసిన కోహినూర్ ఫిలిం కంపెనీకి చెందిన మోహన్ భావనాని ఈమెకు తొలిసారి సినిమాలలో అవకాశం కల్పించాడు. కోహినూర్ కంపెనీలో అనేక విజయవంతమైన సినిమాలు చేసిన తర్వాత ఈమె ఇంపీరియల్ ఫిలిం కంపెనీకి మారింది. అక్కడ ఆ సమయంలో భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా ఎదిగింది. ఆ సమయంలో బొంబాయి గవర్నర్ కన్నా ఈమె జీతం అధికంగా ఉండేది. ఈమె మూకీ శకంలో అతి పెద్ద హీరోగా పేరొందిన డి.బిల్లిమోరియాతో ప్రేమలో పడింది. ఇద్దరూ కలిసి 1933-39 మధ్యకాలంలో అనేక మూకీ చిత్రాలలో నటించారు. ఈమె నటించిన మూకీలు "మాధురి", "అనార్కలి"ల టాకీ వెర్షన్ విడుదలయ్యాయి. "ఇందిర బి.ఎ" మూకీ సినిమా "ఇందిర ఎం.ఎ"గా, "వైల్డ్ క్యాట్ ఆఫ్ బాంబే" మూగ సినిమా "బొంబాయికీ బిల్లీ"గా మాటలతో వెలువడ్డాయి. వైల్డ్ క్యాట్ ఆఫ్ బాంబే (బొంబాయికీ బిల్లి) సినిమాలో ఈమె ఏకంగా ఎనిమిది పాత్రలను ధరించింది. అనార్కలి పేరుతో వెలువడిన మూడు (ఒకటి మూకీ, రెండు టాకీలు) సినిమాలలో ఈమె నటించడం విశేషం. కాకపోతే వీటిలో తొలి రెండు సినిమాలలో కథానాయికగా మూడవ సినిమాలో ఈమె సలీం తల్లిగా నటించింది.

చిత్ర సమాహారం

[మార్చు]
1970లలో సులోచన

మూకీ సినిమాలు

[మార్చు]
  1. వీరబాల (1924) - తొలి చిత్రం
  2. సినిమా క్వీన్ (1926)
  3. పాగల్ ప్రేమి
  4. ముంతాజ్ మహల్
  5. టెలిఫోన్ గరల్
  6. టైపిస్ట్ గరల్ (1926)
  7. ది నర్స్
  8. బలిదాన్ (1927)
  9. వైల్డ్ కాట్ ఆఫ్ బాంబే (1927)
  10. మాధురి (1928)
  11. అనార్కలి (1928)
  12. ఇందిర బి.ఎ. (1928)
  13. ది డాన్సింగ్ గర్ల్
  14. హీర్ రంజా (1929)

టాకీ సినిమాలు

[మార్చు]
  1. మాధురి (1932)
  2. సులోచన (1933)
  3. ఇందిర ఎం.ఎ (1934)
  4. అనార్కలి (1935)
  5. బాంబేకి బిల్లి (1936)
  6. డాకూకీ లడ్కీ
  7. గుల్ సనో బర్
  8. ఆంఖ్ మిచౌలి (1942)
  9. జుగ్ను (1947)
  10. అనార్కలి (1953)
  11. బాజ్ (1953)
  12. నీల్ కమల్ (1968)
  13. అమ్రపాలి (1969)
  14. ఆప్ కీ కసం
  15. హత్ కీ సఫాయి
  16. జూలీ (1975)
  17. ఖట్టా మీటా (1978)

మరణం

[మార్చు]

ఒకప్పుడు తన గ్లామర్‌తో కోట్లాది ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ నటి చివరకు లోకం చేత విస్మరింపబడి ఒంటరిగా జీవిస్తూ 1983, అక్టోబర్ 10న ముంబాయిలోని తన ఫ్లాట్‌లో మరణించింది.

ఇవీ చదవండి

[మార్చు]
  • గ్రేట్ మాస్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా: ది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్స్, డి.పి.మిశ్రా, పబ్లికేషన్స్ డివిజన్, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం, 2006. ISBN 81-230-1361-2. పుట 16.
  • నటీమణి సులోచన సినిమా ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎంపైర్: ఎ పాలిటిక్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇన్ బ్రిటన్ అండ్ ఇండియా, ప్రియా జయకుమార్, డ్యూక్ యూనివర్సిటీ ప్రెస్, 2006. ISBN 0-8223-3793-2. పుట 73.
  • ది హండ్రెడ్ లూమినరీస్ ఆఫ్ హిందీ సినిమా, దినేష్ రహేజా, జితేంద్ర కొఠారి. ఇండియా బుక్ హౌస్ పబ్లిషర్స్, 1996. ISBN 81-7508-007-8. పుట 1871

మూలాలు

[మార్చు]
  1. Ruby Myers, Sulochana - Biography Archived 2012-10-11 at the Wayback Machine బ్రిటిష్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్.
  2. "ఫాల్కే అవార్డ్ పొందిన నటీమణి సులోచన". విజయచిత్ర. 9 (5): 9. 1 November 1974.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.