సి.కృష్ణవేణి
ఇదే పేరుగల ఇతర వ్యాసాలకోసం అయోమయ నివృత్తి పేజీ కృష్ణవేణి చూడండి.
మేకా కృష్ణవేణి | |
---|---|
![]() గొల్లభామ సినిమాలో కృష్ణవేణి | |
జననం | డిసెంబర్ 24, 1924 పంగిడి గూడెం, కృష్ణా జిల్లా, మద్రాసు రాష్ట్రం |
నివాస ప్రాంతం | మద్రాసు (చెన్నై), హైదరాబాదు |
ఇతర పేర్లు | సి.కృష్ణవేణి, మీర్జాపురం రాణి |
వృత్తి | తెలుగు చలనచిత్ర నటి, గాయని, నిర్మాత |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | మీర్జాపురం రాజు మేకా రంగయ్య |
పిల్లలు | మేకా రాజ్యలక్ష్మి అనూరాధ |
తండ్రి | డాక్టర్ యర్రంశెట్టి లక్ష్మణరావు[1] |
తల్లి | నాగరాజు |
సి.కృష్ణవేణి లేదా (ఎం.కృష్ణవేణి) (జ.1924) అలనాటి తెలుగు సినిమా నటీమణి, గాయని, నిర్మాత.
జీవిత చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో సతీఅనసూయ /ధృవ చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా తెలుగులో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.


కృష్ణవేణి గారు తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజా (జన్మనామం: మేకా రంగయ్య)గారితో వివాహం జరిగింది. ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించారు. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసారు. 1949 లో అమన దేశం చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రం ద్వారా తెలుగు తెరకు నందమూరి తారక రామారావును, యస్వీ రంగారావును, నేపథ్యగాయకునిగా ఘంటసాల వెంకటేశ్వరరావును పరిచయం చేసారు. ఆ తరువాత సినిమాలలో అనేక గాయకులు నటులు, సంగీత దర్శకులను పరిచయం చేసారు. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు రమేష్ నాయుడును తెలుగు సినిమాకు పరిచయం చేసారు.
పురస్కారాలు
[మార్చు]- తెలుగు సినిమా పరిశ్రమకు ఈమె చేసిన జీవితకాలపు కృషిగాను 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకుంది.
- 2021 సాక్షి ఎక్సలెన్స్ పురస్కారాలలో భాగంగా లైఫ్ టైమ్ ఎఛివ్‌మెంట్ అవార్డును ఆమె అందుకుంది.[2]
- 2022: ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ఆకృతి- ఘంటసాల శతాబ్ది పురస్కారం[3]
కృష్ణవేణి నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
---|---|---|---|
1935 | సతీ అనసూయ | ||
1937 | మోహినీ రుక్మాంగద | ||
1938 | కచ దేవయాని | ||
1939 | మళ్ళీ పెళ్ళి | అన్నపూర్ణ | |
మహానంద | |||
1940 | జీవనజ్యోతి | ||
1941 | దక్షయజ్ఞం | ||
1942 | భక్త ప్రహ్లాద | ||
1944 | భీష్మ | ||
1947 | బ్రహ్మరథం | ||
గొల్లభామ | స్వయంప్రభ | ||
1948 | మదాలస | ||
కామవల్లి | తమిళ సినిమా | ||
1949 | మన దేశం | నిర్మాత కూడా | |
ధర్మాంగద | |||
1950 | లక్ష్మమ్మ | ||
ఆహుతి | |||
తిరుగుబాటు | |||
1951 | పెరంటాలు |
నిర్మాతగా కృష్ణవేణి
[మార్చు]కృష్ణవేణి నిర్వహించిన నిర్మాణ సంస్థలు
[మార్చు]- భర్త స్థాపించిన సంస్థ - జయా పిక్చర్స్ ఆ తరువాతి కాలంలో దీన్ని శోభనాచల స్టూడియోస్ గా నామకరణం చేశారు.
- సొంత సంస్థ - తన కుమార్తె మేకా రాజ్యలక్ష్మీ అనురాధ పేరు మీదుగా ఎం.ఆర్.ఏ.ప్రొడక్షన్స్
కృష్ణవేణి నిర్మించిన సినిమాలు
[మార్చు]- మన దేశం (1949)
- లక్ష్మమ్మ (1950)
- దాంపత్యం (1957)
- గొల్లభామ (1947)
- భక్త ప్రహ్లాద (1942)
గమనిక: ఈ జాబితా అసంపూర్ణమైంది
మరణం
[మార్చు]సి. కృష్ణవేణి (మేకా కృష్ణవేణి)16 ఫిబ్రవరి,2025న ఫిల్మ్‌నగర్‌లోని తన స్వగృహంలో వయోభారంతో బాధ పడుతూ కన్నుమూసారు[4][5][6][7]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Ch Krishnaveni's Exclusive Interview - Telugucinema.com Oct 25, 2005[permanent dead link]
- ↑ "Tollywood Heroes, Director Speech at Sakshi Excellence Awards 2021 - Sakshi". web.archive.org. 2022-11-03. Archived from the original on 2022-11-03. Retrieved 2022-11-03.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Nava Telangana (2 December 2022). "నటి కృష్ణ వేణికి ఆకృతి-ఘంటసాల శతాబ్ది పురస్కారం". Archived from the original on 5 December 2022. Retrieved 5 December 2022.
- ↑ "Krishnaveni: అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు". EENADU. Retrieved 2025-02-16.
- ↑ "తెలుగు సినిమా తొలి మహిళా నిర్మాత కృష్ణవేణి ఇకలేరు". NT News. 17 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "ప్రముఖ నిర్మాత–నటి–గాయని కృష్ణవేణి కన్నుమూత". Sakshi. 17 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "కృష్ణవేణి మరణం సినీరంగానికి తీరని లోటు : తెలంగాణ ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్". NT News. 16 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
వెలుపలి లంకెలు
[మార్చు]- All articles with dead external links
- రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు
- 1924 జననాలు
- తెలుగు సినిమా నటీమణులు
- తెలుగు సినిమా గాయకులు
- తెలుగు సినిమా నేపథ్యగాయకులు
- తెలుగు సినిమా బాలనటులు
- కృష్ణా జిల్లా గాయకులు
- తూర్పు గోదావరి జిల్లా సినిమా నటీమణులు
- తూర్పు గోదావరి జిల్లా రంగస్థల నటీమణులు
- తూర్పు గోదావరి జిల్లా మహిళా గాయకులు
- తూర్పు గోదావరి జిల్లా మహిళా సినిమా నిర్మాతలు
- భారతీయ మహిళా గాయకులు
- తెలుగు సినిమా మహిళా నేపథ్య గాయకులు
- 2025 మరణాలు