Jump to content

భక్త ప్రహ్లాద (1942 సినిమా)

వికీపీడియా నుండి


భక్త ప్రహ్లాద
(1942 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
తారాగణం వేమూరి గగ్గయ్య
గరికపాటి వరలక్ష్మి
రాజేశ్వరి
నారాయణరావు
భాష తెలుగు

భక్త ప్రహ్లాద 1942 లో వచ్చిన పౌరాణిక చిత్రం. శోభనాచల ప్రొడక్షన్స్ వారు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం విష్ణు భక్తుడైన ప్రహ్లాద కథే ఈ సినిమా. ఈ కథ ఆధారంగా తెలుగులో వచ్చిన రెండవ చిత్రం ఇది. మరింత ఆధునిక సాంకేతిక విలువలతో కూడుకుని ఉంటుంది. ఆ రోజుల్లో సురభి తెలుగు నాటక సమాజం ఉపయోగించిన డ్రామా వెర్షన్ ఆధారంగా ఈ సినిమా డైలాగులను రూపొందించారు.[1]

మొదటి భక్తప్రహ్లాద 1932 లో విడుదలైంది. ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి టాకీ సినిమా కూడా.

దానవ చక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. విష్ణువు పేరు వినబడితేనే సహించలేని వ్యక్తి. అలాంటిది అతడికి పుట్టిన కుమారుడు, ప్రహ్లాదుడు పరమ విష్ణు భక్తుడౌతాడు. పసిప్రాయం నుండే విష్ణుభక్తిని అలవరచుకుంటాడు. విద్యనేర్చుకోను గురువు చండామార్కుల వద్దకు పంపితే విష్ణుభక్తిని తోటి విద్యార్థులకు కూడా బోధిస్తాడు. నయానా భయానా విష్ణుభక్తిని పోగొట్టలేక, చివరికి కన్నకొడుకునే చంపించే ప్రయత్నాలు చేస్తాడు దానవ చక్రవర్తి. తండ్రి చేయించిన అనేక హత్యా ప్రయత్నాల నుండి విష్ణుమూర్తి కటాక్షం వలన చెక్కుచెదరకుండా బయట పడతాడు.

చివరకు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన సంవాదంలో "విష్ణువు ఎక్కడుంటాడో చెప్పు అతడి సంగతి నేను చూస్తాను" అని హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడిని అడుగుతాడు. ప్రహ్లాదుడు విష్ణువు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉంటాడు అని చెప్పగా, ఈ స్తంభంలో ఉంటాడా అని ఒక స్తంభాన్ని గదతో పగల గొడతాడు. ఆ స్తంభం నుండి విష్ణుమూర్తి రౌద్రమూర్తి అయిన నరసింహావతారంలో బయటికి వచ్చి హిరణ్య కశిపుని సంహరిస్తాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: చిత్రపు నారాయణ మూర్తి

సంగీతం: మోతీబాబు

నేపథ్య సంగీతం: హెచ్ ఆర్ బాబు

గాయనీ గాయకులు:వేమూరి గగ్గయ్య ,రామకృష్ణ శాస్త్రి, రాజేశ్వరి,

నిర్మాణ సంస్థ: శోభనాచల పిక్చర్స్

విడుదల:30:01:1942.

పాటల జాబితా

[మార్చు]
  1. నారాయణ నారాయణ నారాయణో పాహిమాం,
  2. నా స్వప్నము నందు నారాయణ నా హృదయమందు
  3. నా హితము వినకీవిధమున హరి నారాయణ, గానం.వేమూరి గగ్గయ్య
  4. కనవా మనసా కాలగతి విధి కాలసర్పమని ,
  5. గర్వాంధుడు నిన్ గననౌనా నీదైన విలాస, గానం.రామకృష్ణ శాస్త్రి
  6. జగన్మోహనాకారా శ్యామసుందరా శరీరా,
  7. జయ జయ జననీమాతా భవానీ జగజ్జననీ, గానం.రాజేశ్వరి
  8. జయకాళీనన్ కృపనేతి నా సూనున్ బ్రోవగా, గానం.రాజేశ్వరి
  9. జయ జయ జయ జయ నారసింహ సర్వసారా, గానం.బృందం
  10. పరమ పావనా భక్తపోషణ భవ విదారణ నిరుణ,
  11. ప్రభూమూర్తీ మంగళకారీ భక్తులకెల్ల ప్రాపగు,
  12. ప్రియంభు పాడరే రారే చెలులారా జన్మ ఉత్సవము,గానం. రాజేశ్వరి బృందం
  13. భజ భజ నారాయణ నారాయణ హరిని చూడ, గానం.రామకృష్ణ శాస్త్రి
  14. భజ భజ నారాయణ నారాయణ మదిని చూడ మాయకాదా,
  15. భజ భజ హరిభజ నారాయణ నిరాకార నారాయణ, గానం.రామకృష్ణ శాస్త్రి
  16. మంగళ హారతి కొమ్మా మంగళతర విభావములను, గానం.రాజేశ్వరి బృందం
  17. రాగదే నాగా రాగదే నాగా చిత్తమున శ్రీ రమణు చేరుము వేగ
  18. లాలీ మమ ధీమతీ లాలి సాధు హృదయా నిదురపో, గానం.రాజేశ్వరి
  19. వినరా తనయా నీ జనకుండను మాటలను, గానం.రాజేశ్వరి
  20. వారి జోద్భవముఖ సురార్చిత పాదపంకజ,
  21. శ్రీనాథా శ్రీనాధా భవ భారాహారా శ్రీనాధ మము,
  22. శ్రీరమణా నారాయణ శ్రిత జనపాలనా నారాయణా,
  23. సారాయి మజా చూడు సోరగానను లేదీడు, గానం.బృందం
  24. హరిభజ హరిభజ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ,
  25. హరి హరి యనవే మనసా ఆ నామమే జీవము, గానం.బృందం
  26. హే నారాయణ్ హే నారాయణ్ భవ సాగర తరణా
  27. హే ప్రభూ మూర్తీ మంగళకారీ ప్రభూ మూర్తీ,

పద్యాలు

[మార్చు]
  1. పటుతర నీతిశాస్త్ర చయపారగు చేసేదనంచు,
  2. ఆంధ్ర ప్రక్రియ నున్నవాడు పలుకండ, గానం.వేమూరి గగ్గయ్య
  3. అస్మదీయంభగు నా దేశమున గాని మిక్కిలి , గానం.వేమూరి గగ్గయ్యా
  4. ఇందుగల డoదులేడని సందేహము వలదు ,
  5. ఎల్ల శరీర దారులకు నిల్లను చీకటి నూతిలోపాల
  6. కంజాక్షునకు గాని కాయంభు కాయమే పవన ,
  7. గాలిన్ గుంభిన్ నగ్ని నంభువుల నాకాశ, గానం.వేమూరి గగ్గయ్య
  8. చదివించిరి నను గురువులు చదివితి,
  9. పర్వతాగ్రమునుండి పడద్రోసినన్ నీవు, గానం.వేమూరి గగ్గయ్య
  10. బాలకా మేలకో ఈ పంతం ఇటులన్, గానం.రాజేశ్వరి
  11. భువి సకలము హరిమయము జ్ఞానహీను,
  12. మందార మకరంద మాధుర్యమున దేలు,
  13. సంసార జీమూత సంఘంభు విచ్చునే చక్రి దాస్య,

మూలాలు

[మార్చు]
  1. "Bhaktha Prahladha (1942)". Indiancine.ma. Retrieved 2025-01-02.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]