Jump to content

కమల్ హాసన్

వికీపీడియా నుండి
(కమల్ హసన్ నుండి దారిమార్పు చెందింది)
కమల్ హాసన్
జననంకమల్ హాసన్
(1954-11-07) 1954 నవంబరు 7 (వయసు 70)
పరమక్కుడి, తమిళనాడు,భారతదేశం
నివాస ప్రాంతంచెన్నై, తమిళనాడు
వృత్తిసినిమా నటుడు
దర్శకుడు
నిర్మాత
గాయకుడు
నృత్య దర్శకుడు
కథారచయిత &
మాటల రచయిత
రాజకీయ పార్టీమక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ
మతంనాస్తికుడు
భార్య / భర్తవాణీ గణపతి(1978-1988)
సారిక(1988–2004)[1]
పిల్లలుశ్రుతి హాసన్
అక్షర హాసన్
తండ్రిశ్రీనివాసన్
తల్లిరాజ్య లక్ష్మి

కమల్ హాసన్ (తమిళం : கமல்ஹாசன்) ( November 7, 1954లో తమిళనాడు రాష్ట్రం రామనాథ పురం జిల్లాలోని పరమక్కుడి లో పుట్టాడు) భారతదేశపు నటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునా ఎక్కువగా తమిళ చిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు.

బాల్య జీవితం

[మార్చు]

శ్రీనివాసన్, రాజ్య లక్ష్మి దంపతులకు కమల్ హాసన్ నాలుగో సంతానం, ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఈ దంపతులు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో తమకి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 3 1/2 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్ తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగాడు.

60వ దశకం

[మార్చు]

కమల్ తన సినీ జీవితాన్ని కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.

70వ దశకం

[మార్చు]

70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు. పూర్తి స్థాయి కథా నాయకుడిగా "అవర్‌గళ్", "అవళ్ ఓరు తొడరర్‌కదై", "సొల్ల తాన్ నినైక్కిరేన్", "మాణవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయదినిలె (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు. 16 వయదినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.

1970 లో విభిన్న పాత్రలను పోషించారు.

  • వెంట్రిలోక్విస్ట్గా అవర్ గళ్ చిత్రంలో (తెలుగులో ఇది కథ కాదు)
  • అమాయకమైన పళ్ళెటూరి వాడిగా 16 వయతినిలె చిత్రంలో (తెలుగులో చంద్రమొహన్ కథానాయకుడుగా పదహారేళ్ళ వయసు)
  • డిస్కో జాకిగా ఇళమై ఊన్జలాడుగిరదు చిత్రంలో
  • వరుస హత్యల స్త్రీ హంతకుడిగా ఉన్మాది పాత్రలో సిగప్పు రోజక్కళ్ చిత్రంలో (తెలుగులో ఎర్రగులాబీలు)
  • ఎత్తు పళ్ళ పళ్ళెటూరి వాడిగాకళ్యాణరామన్ చిత్రంలో (తెలుగులో కల్యాణరాముడు)
  • అలాద్దిన్ గా అలావుద్దీనమ్ అర్పుధ విలక్కుమ్ చిత్రంలో

80వ దశకం

[మార్చు]

దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం "శంకర్ లాల్" చిత్రీకరణ జరుగుతుండగా టి.ఎన్.బాలు దుర్మరణం జరిగింది. 1979 లో కమల్ పలు క్లాసిక్, మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ పొందాడు. దీనికి ఎమ్.జీ.అర్/శివాజి వంటి చిత్ర రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది. (ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు). చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కథలతో, పాత్రలతో ముందుకు వచ్చారు.

ఈ దశకంలో నటించిన వివిధ పాత్రలు:

  • అంధ వయొలిన్ విద్వాంసునిగా రాజ పార్వయి చిత్రంలో 27 ఏళ్ళ వయసులో నటించాడు. (ఇదే కమల్ స్క్రీన్ ప్లే వహించిన తొలి చిత్రం ఇదే తెలుగులో అమావాస్యచంద్రుడుగా వచ్చింది.)
  • శాస్త్రీయ నృత్య కళాకారునిగా సాగర సంగమం చిత్రంలో
  • ప్రేమలో పడే మానసిక వికలాంగిగా స్వాతి ముత్యం చిత్రంలో
  • అజ్ఞాత పోలీసుగా కాకి చట్టై చిత్రంలో
  • అండర్ వరల్డ్ డాన్ గా నాయగన్ (నాయకుడు) చిత్రంలో 33 ఏళ్ళ వయసులో మణి రత్నం దర్శకత్వంలో
  • ఒక నిరుద్యోగ యువకుడు ఒక వారం పాటు భోగ భాగ్యాలు అనుభవించే పాత్రలో మూకీ చిత్రం అయిన పుష్పక్లో (తెలుగులో పుష్పక విమానం)
  • నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా, సర్కస్ లో మరుగుజ్జు బఫూన్ గా, సరదాగా ఉండే మెకానిక్ పాత్రలలో అపూర్వ సగోదరర్‌గళ్(విచిత్ర సోదరులు) చిత్రంలో 35 ఏళ్ళ వయసులో (ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా కమల్ చేశారు)
  • చెడ్డవాడు అయిన మేయర్ గా ఇంద్రుడు చంద్రుడు, తెలుగు చిత్రంలో
  • 1989 లో విడుదల అయిన అపూర్వ సగోదరగళ్ (తెలుగులో విచిత్ర సహోదరులు) చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు10 కోట్ల రూపాయలను వసూలు చేసిన మొదటి కమల్ చిత్రం.

90వ దశకం

[మార్చు]

1997లో మరొక యాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమానులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగారు.

ఈ కాలంలో ఆయన నటించిన పాత్రలు:

  • తమిళ హాస్య చిత్రం "సతీలీలావతి"లో డాక్టరుగా (తెలుగులో అదే పేరు)
  • నలుగురు కవలలుగా హాస్య చిత్రం "మైకేల్ మదన కామరాజన్" (తెలుగు: "మైకేల్ మదన కామరాజు")
  • ప్రేమలో పడ్డ ఉన్మాదిగా "గుణ"
  • గ్రామంలో స్థిర పడే ఆధునిక యువకుడిగా "దేవర్ మగన్" (తెలుగు: క్షత్రియ పుత్రుడు) - 38 ఏళ్ళ వయసులో రచించి నిర్మించిన చిత్రం.
  • గ్రామం నుంచి వలస వచ్చి పట్టణంలో కుటుంబాన్ని కోల్పొయే వ్యక్తిగా "మహానది"
  • ఒక విప్లవాత్మకమైన ఉపాధ్యయుడిగా "నమ్మవర్" (తెలుగు: "ప్రొఫెసర్ విశ్వం")
  • ఉగ్రవాదాన్ని అణిచివేసే ప్రత్యేక పొలీసు అధికారిగా "ద్రోహి" (తమిళం: కురుదిప్పునల్)
  • ముదుసలి స్వతంత్రసమరయోధుడిగా, అతని లంచగొండి కొడుకుగా ద్విపాత్రాభినయనం "ఇండియన్" (తెలుగు: "భారతీయుడు")
  • 42 ఏళ్ళ వయసులో ముసలి దాదిగా (naany) (ఇంగ్లీషు చిత్రం మిసెస్ డౌట్ ఫైర్ ఆధారంగా) "అవ్వై షణ్ముఖి" (తెలుగు: భామనే సత్యభమనే)

ఐతే ఎనభైలో మాదిరిగా తొంభైలలో అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996 లో విడుదలైన "ఇండియన్", "అవ్వై షణ్ముఖి" మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ ను అగ్రపథంలో నిలిపాయి.

2000లలో

[మార్చు]

నూతన శతాబ్దంలో కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించాడు. వాటిలో కొన్ని:

  • కవల సోదరులుగా: ఆళవందాన్ (అభయ్)
  • ప్రేమలో పడే ఘోటక బ్రహ్మచారిగా: పమ్మల్ కె. సంబంధం (బ్రహ్మచారి)
  • రసికుడైన విమాన చోదకునిగా: పంచతంత్రం
  • వికలాంగుడైన మానవతావాదిగా: అన్బే శివం (సత్యమే శివం)
  • ప్రేయసి హత్యలో అన్యాయంగా ఇరికించబడి జైలు పాలైన మొరటు పల్లె వాసిగా: విరుమాండి (పోతురాజు)
  • సర్కస్ లో పోరాటాలు చేసే బధిరుడిగా: ముంబై ఎక్స్ ప్రెస్
  • ముదురు వయసులో వైద్య విద్యనభ్యసించే ఆకు రౌడీ పాత్రలో: వసూల్ రాజా ఎమ్. బి. బి. ఎస్. (హిందీ చిత్రం మున్నాభాయ్ ఎమ్. బి. బి. ఎస్. ఆధారంగా)
  • ప్రతిభావంతుడైన పోలీస్ అధికారి రాఘవన్ పాత్రలో: వేట్టైయాడు - విళయాడు (రాఘవన్)
  • ప్రతిదానికీ భయపడే అమాయకుడైన పిరికివాడిగా: తెనాలి (ఆంగ్ల చిత్రం వాట్ అబౌట్ బాబ్ ఆధారంగా)

2000లో విడుదలైన తెనాలి కమల్ హసన్ చిత్రాల్లో రూ. 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసుల్ రాజా ఎమ్. బి. బి. ఎస్ సుమారు రూ. 40 కోట్లు సాధించగా, 2006 లో వచ్చిన వేట్టైయాడు - విళయాడు రూ. 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీసుపై కమల్ హసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి.

పురస్కారాలు

[మార్చు]

కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసగా: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు), ఇండియన్ (భారతీయుడు). ఈయన ఉత్తమ బాలనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని [[కలతూర్ కన్నమ్మ]] చిత్రానికిగానూ గెలుచుకున్నాడు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్రప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.

నిర్మాతగా కమల్ హాసన్ ప్రస్థానం

[మార్చు]

కమల్ హాసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజ పార్వై. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, మగళిర్ మట్టమ్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి.

కమల్ హసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరుద నాయగం దశాబ్దంనర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మదురై నగర వాసియైన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ (మొహమ్మద్ యూసఫ్ ఖాన్) గురించిన ఈ చిత్ర నిర్మాణమ్ రెండవ ఎలిజబెత్ రాణి చేతులమీదుగా మొదలయింది.

2005లో కమల్ హాసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడాదు.తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం సాగిస్తున్నాడు.

సమాజ సేవా కార్యక్రమాలు

[మార్చు]

తన అభిమాన సంఘాలను సమాజానికి సేవ చేసే సేవా సంస్థలుగా మార్చిన మొదటి నటుడు కమల్ హాసన్.తన అభిమానుల ద్వారా పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఆయన పుట్టిన రోజున ఆయన అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

వివాదాలు

[మార్చు]

మొదటి నుంచీ కమల్ హసన్ సినిమాలు సంచలనాలకే కాక వివాదాలకు కూడా కేంద్రబిందువులుగా ఉంటున్నాయి. 1992లో విడుదలైన తెవర్ మగన్ (తెలుగు అనువాదంలో క్షత్రియ పుత్రుడు) సినిమా తెవర్ కులస్తుల్లోని హింసాత్మక ప్రవృత్తిని గొప్పగా చూపించిందన్న ఆరోపణపై వివాదాలు చెలరేగాయి. సినిమాలోని తొలిపాట తెవర్ కులాన్ని, ఆ కులస్తుల పౌరుషాలను పొడుగుడతూ ఉండడంతో బహిరంగంగా వారు వినిపిస్తూండడం, ఇతరులపై ఆధిక్యసూచనగా ప్రదర్శించడం వంటివి సమాజంలోని వివాదాలను రేపేందుకు పనికివచ్చాయని భావించారు. 2000లో విడుదలైన కమల్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హే రామ్ చిత్రం చాలా వివాదాలకు మూలబీజమైంది. స్వాతంత్ర్యానంతరం మహాత్మాగాంధీ హత్య వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో నిర్మించిన చారిత్రికాంశాలతో కూడిన చిత్రమిది. ఈ సినిమాలో మహాత్మా గాంధీని తక్కువ చేసి చూపారని కాంగ్రెస్ నాయకులు భావించగా, స్వాతంత్ర్యోద్యమంలో తమ పాత్రను కించపరిచారని సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపించాయి. 2002నాటి పంచతంత్రం సినిమాలోని ఒక పాటకు సెన్సార్ బోర్డు నుంచి వ్యతిరేకత వ్యక్తమైనప్పుడు సమస్యలు ఎదురయ్యాయి. చివరికి ఆ పాటను తీసివేసి సినిమా విడుదల చేశారు. సందియర్ అన్న పేరుతో ఓ సినిమాను చిత్రీకరిస్తున్నప్పుడు పుతియ తమిళగం సంస్థ నాయకుడు కె.కృష్ణమూర్తి, ఇతర దళిత సంఘాలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశాయి. తెవర్-దళిత కులస్తుల మధ్య విభేదాలు, హింసాత్మక ఘటనలు నమోదైన దృష్ట్యా తెవర్ కులస్తుల ఆభిజాత్యానికి, వారి హింసాప్రవృత్తికి ఆ పేరు ఉత్తేజం కల్పిస్తుందని దళిత నాయకులు ఆరోపించారు. తన చిత్రబృందానికి రక్షణ కల్పించాలని స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుని కమల్ హాసన్ కలవగా తర్వాత విస్తృత ప్రజానీకం భద్రత దృష్ట్యా కల్పించలేమని ఆయన తిరస్కరించారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలితను కమల్ హసన్ స్వయంగా కలిసి మాట్లాడి భద్రత తెచ్చుకున్నారు. అలానే సినిమా పేరును విరుమాండిగా మార్చి 2004లో చలనచిత్రాన్ని విడుదల చేశారు. 2004లోనే విడుదలైన వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్. సినిమా పేరు తమ వృత్తిని కించపరిచేదిగా ఉందని ఈరోడ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం 2005 నాటి ముంబై ఎక్స్ప్రెస్ సినిమాపై భాషాభిమానులు వ్యతిరేక ప్రదర్శనలు చేశారు. తమిళ సినిమాకు ఇంగ్లీషులో పేరు పెట్టడాన్ని నిరశిస్తూ సాగిన ఈ ఆందోళనకు పిఎంకె నేత, తమిళ భాషా పరిరక్షణ ఉద్యమానికి ఆద్యులైన ఎస్.రామదాసు నేతృత్వం వహించారు. 2010 నాటి మన్మథన్ అంబు (తెలుగులో మన్మథబాణం) సినిమాలోని ఒక పాటలోని సాహిత్యం హిందూ మక్కల్ కచ్చి వారు హిందూమతాన్ని కించపరిచేదిగా ఉందంటూ ఆందోళన చేశారు. పాటను తొలగించాకా సినిమా విడుదల అయింది. విశ్వరూపం సినిమా ఇస్లాం మతాన్ని తక్కువచేసి చూపిందని ఆరోపణలు రాగా, తమిళనాడు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తవచ్చు అంటూ సినిమాను నిషేధించింది. కొన్ని దృశ్యాలను తొలగించి, కొన్ని సంభాషణలు మ్యూట్ చేసేందుకు కమల్ అంగీకరించాకా దాదాపు విడుదల అయిన 22 రోజులకు ప్రభుత్వం నిషేధాన్ని సడలించింది. 2015లో విడుదల అయిన ఉత్తమ విలన్ చలనచిత్రం క్లైమాక్స్ పాట హిందువులను అవమానిస్తోందని ఆరోపిస్తూ విశ్వహిందూపరిషత్ సినిమాను నిషేధించాలని ఆందోళన చేసింది, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒక ప్రెంచి ఫోటోగ్రాఫర్ చిత్రాన్ని కాపీచేస్తున్నట్టు వుందని గొడవ చెలరేగితే, చిత్రవర్గాలు "ఆ పోస్టర్లో చూపిన తెయ్యం అన్నది వేయి సంవత్సరాలకు పైగా వయసున్న భారతీయ కళ అని, దాన్ని వేరెవరి నుంచో కాపీ చేయాల్సిన అవసరం తమకు లేదని" స్పష్టీకరించాయి.[3]

వివిధ భాషలలో ఆరంగేట్రం

[మార్చు]
  • 1960 - తమిళ చిత్ర రంగ ప్రవేశం
  • 1962 - మలయాళ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - బెంగాలీ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - కన్నడ చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - తెలుగు చిత్ర రంగ ప్రవేశం
  • 1977 - హిందీ చిత్ర రంగ ప్రవేశం

కమల్ హసన్ చిత్ర మాలిక: నటుడి గా

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాష దర్శకత్వం వివరములు Ref.
1960 మావూరి అమ్మాయి (కలథుర్ కన్నమ్మ) Selvam తమిళ ఎ. భీమ్‌సింగ్ ఉత్తమ బాల నటుడి"గా జాతీయ బహుమతి వచ్చింది. [4]
1962 పవిత్ర ప్రేమ (పార్దాల్ పాసి థీరుమ్) Babu & Kumar తమిళ ఎ. భీమ్‌సింగ్ (మొట్ట మొదటి ద్వి-పాత్రాభినయం) (అతిథి పాత్రలో) [5]
1962 పాధ కానిక్కై Ravi తమిళ K. Shankar Child artist [6]
1962 కన్నుమ్ కరులుమ్ Babu మలయాళ K. S. Sethumadhavan Child artist [7]
1963 వానంపడి (Vanambadi) Ravi తమిళ G. R. Nathan Child artist
1963 దొంగ బంగారం (అనంధ జోధి) Balu తమిళ వి.ఎన్.రెడ్డి Child artist [8]
1970 మాణవన్ తమిళ M. A. Thirumugam Uncredited role [9]
1971 Annai Velankanni Jesus తమిళ Thankappan Uncredited role [10]
1972 కురత్తి మగన్ తమిళ కె.ఎస్‌.గోపాలకృష్ణన్‌
1973 అరంగేట్రమ్ Thiagu తమిళ కైలాసం బాలచందర్ [11]
1973 చొల్లత్తాన్ నినైక్కిరేన్ Kamal తమిళ కైలాసం బాలచందర్
1974 పరువ కాలమ్ Chandran తమిళ Jos A.N. Fernando [12]
1974 గుమస్తావిన్ మగళ్ Mani తమిళ A. P. Nagarajan [13]
1974 శృంగార లీల (నాన్ అవనిల్లై తమిళ కైలాసం బాలచందర్
1974 కన్యాకుమారి Sankaran మలయాళ K. S. Sethumadhavan
1974 అన్బు తంగై Buddha తమిళ S. P. Muthuraman Guest appearance [14]
1974 విష్ణు విజయమ్ మలయాళ N. Sankaran Nair
1974 అవళ్ ఒరు తొడర్ కదై Prasad తమిళ కైలాసం బాలచందర్ [15]
1974 పణత్తుక్కాగ Kumar తమిళ M. S. Senthil [12]
1975 సినిమా పైత్యమ్ Natarajan తమిళ ముక్తా శ్రీనివాసన్ [12]
1975 ప్రేమ లీలలు (పట్టామ్ బూచ్చి) Siva తమిళ A. S. Pragasam [12]
1975 ఆయిరత్తిల్ ఒరుత్తి Kamal తమిళ Avinashi Mani [12]
1975 భలే బ్రహ్మచారి (తేన్ సిందుదే వానమ్) తమిళ R. A. Sankaran [12]
1975 మేల్‌నాట్టు మరుమగళ్ Raja తమిళ A. P. Nagarajan ఈ చిత్ర నిర్మాణ సమయంలో వాణి గణపతిని కలుసుకొని ప్రేమలో పడి తరువాత ఆమెను వివాహం చేసుకున్నాడు [12]
1975 యవ్వనం మురిపించింది (తంగత్తిలే వైరమ్) Kumar తమిళ K. Sornam
1975 భలేరాజా (పట్టికాట్టు రాజా) Mahesh తమిళ K. Shanmugam
1975 నాన్ నిన్నె ప్రేమిక్కున్ను Suresh మలయాళ K. S. Gopalakrishnan
1975 మాలై సూడవా తమిళ C. V. Rajendran
1975 అపూర్వ రాగంగళ్ Prasanna తమిళ కైలాసం బాలచందర్ [16]
1975 తిరువోణమ్ Prem Kumar మలయాళ Sreekumaran Thampi [12]
1975 మట్టొరు సీతా మలయాళ P. Bhaskaran [12]
1975 రాసలీల మలయాళ N. Sankaran Nair [12]
1975 అందాలరాజా (అంతరంగమ్) Kaanthan తమిళ ముక్తా శ్రీనివాసన్
1976 అప్పూపన్ Babumon మలయాళ P. Bhaskaran
1976 అగ్ని పుష్పమ్ Somu మలయాళ Jeassy
1976 మన్మధ లీల (మన్మద లీలై) Madhu తమిళ కైలాసం బాలచందర్ [17]
1976 అంతులేని కథ Arun తెలుగు కైలాసం బాలచందర్ Cameo appearance [18]
1976 సమస్సియ మలయాళ K. Thankappan
1976 స్విమ్మింగ్ పూల్ మలయాళ J. Sasikumar
1976 అరుతు మలయాళ Ravi
1976 సత్యమ్ Kumaran తమిళ S. A. Kannan
1976 మరో ప్రేమకథ (ఒరు ఊదాప్పూ కణ్ సిమిట్టు గిరదు) Ravi తమిళ ఎస్. పి. ముత్తురామన్ [19]
1976 ఉణర్చిగళ్ Selvam తమిళ R. C. Sakthi [20]
1976 కుట్టువమ్ సిత్షయుమ్ మలయాళ M. Masthan
1976 కుమార విజయమ్ Kumar తమిళ A. Jagannathan [21]
1976 కళ్యాణ జ్యోతి (ఇదయ మలర్) Mohan తమిళ జెమినీ గణేశన్
1976 కొండరాజు కోయపిల్ల (పొన్ని) Maran మలయాళ Thoppil Bhasi [22]
1976 Nee Ente Lahari మలయాళ P. G. Viswambharan [12]
1976 మూన్రు ముడిచ్చు Balaji తమిళ కైలాసం బాలచందర్ [23]
1976 మోగమ్ ముప్పదు వ్రుషమ్ Ramesh తమిళ S. P. Muthuraman
1976 లలిత Balu తమిళ Valampuri Somanathan [12]
1977 ఆయినా Prem Kapoor హిందీ కైలాసం బాలచందర్ Cameo appearance in the song "Ho Jaaye Jab Dil Se Dil Takraaye" [11]
1977 ఉయర్న్దవర్‌గళ్ Aarumugam తమిళ T. N. Balu [24]
1977 శివతాండవమ్ మలయాళ N. Sankaran Nair [25]
1977 ఆశీర్వాదమ్ మలయాళ I. V. Sasi
1977 అవర్గళ్ Janardhan (Johnny) తమిళ కైలాసం బాలచందర్ [26]
[27]
1977 మదుర సొప్పనమ్ మలయాళ M. Krishnan Nair
1977 శ్రీ దేవి Venugopal మలయాళ N. Sankaran Nair
1977 ఉన్నై సుట్రుమ్ ఉలగమ్ Raja తమిళ G. Subramanya Reddiar [12]
1977 కబిత Gopal బెంగాలి Bharat Shamsher [28]
1977 ఆష్త మాంగల్యమ్ మలయాళ P. Gopikumar
1977 నిరకుడమ్ Devan మలయాళ A. Bhimsingh
1977 పార్వతి మళ్ళీ పుట్టింది (ఓర్ మగళ్ మరిక్కుమో) Chandrasekharan మలయాళ కె. ఎస్. సేతుమాధవన్
1977 16 Vayathinile Gopalakrishnan (Chappani) తమిళ P. Bharathiraja [29]
1977 ఆడు పులి ఆట్టమ్ Madan తమిళ S. P. Muthuraman [30]
[12]
1977 ఆనందం పరమానందం Babu మలయాళ I. V. Sasi
1977 నామ్ పిరంద మణ్ Ranjith తమిళ A. Vincent [31]
1977 కోకిల Vijaykumar కన్నడ Balu Mahendra కన్నడంలో మొదటి చిత్రం [32]
1977 సత్యవంతుడు (సత్యవాన్ సావిత్రి) Sathyavan మలయాళ P. G. Viswambharan
1977 ఆద్యపాదమ్ మలయాళ Adoor Bhasi
1978 Avalude Ravukal మలయాళ I. V. Sasi Cameo appearance [33]
1978 నిళల్ నిజమాగిరదు Sanjeevi తమిళ కైలాసం బాలచందర్
1978 Sakka Podu Podu Raja తమిళ S. P. Muthuraman Cameo appearance [34]
1978 మదనోత్సవమ్ Raju మలయాళ N. Sankaran Nair dubbed into Hindi as Dil Ka Sathi Dil [12]
1978 అమర ప్రేమ Raju తెలుగు తాతినేని రామారావు Remake of మదనోత్సవమ్. Most of scene reshot and used some scenes dubbed in original version.
1978 Kaathirunna Nimisham Raju మలయాళ Baby [12]
1978 Aval Viswasthayayirunnu Anto మలయాళ Jeassy Guest appearance
1978 Anumodhanam మలయాళ I. V. Sasi [12]
1978 మరో చరిత్ర Balu తెలుగు కైలాసం బాలచందర్ [35]
1978 ఇళమై ఊంజలాడు గిరదు Prabhu తమిళ C. V. Sridhar [36]
1978 చట్టమ్ ఎన్ కైయ్యిల్ Babu & Rathinam తమిళ T. N. Balu
1978 వయసు పిలిచింది Raja తెలుగు C. V. Sridhar [37]
1978 తప్పిట తల Amrit Lal కన్నడ కైలాసం బాలచందర్ Cameo appearance [38]
1978 Padakuthira మలయాళ P. G Vasudevan [12]
1978 వయానధన్ తంబన్ Vayanadan Thamban మలయాళ A. Vincent
1978 అవళ్ అప్పడిదాన్ Arun తమిళ C. Rudhraiya [39]
1978 ఎర్ర గులాబీలు Dileep తమిళ P. Bharathiraja [40]
1978 పట్నం పిల్ల (మనిదరిల్ ఇత్తని నిరంగళా) Velu తమిళ R. C. Sakthi [12]
1978 తప్పు తాళంగళ్ Amrit Lal తమిళ కైలాసం బాలచందర్ Cameo appearance [12]
[38]
1978 ఏట్టా Ramu మలయాళ I. V. Sasi [12]
1979 సొమ్మొకడిది సోకొకడిది Rangadu & Shekar తెలుగు సింగీతం శ్రీనివాసరావు (తెలుగులో మొదటి ద్వి-పాత్రాభినయం) తమిళంలో "ఇరు నిలవుగల్ "గా విడుదల చేశారు. dubbed into Tamil as Iru Nilavugal [12]
1979 సిగపుక్కల్ మూక్కుథి తమిళ Valampuri Somanathan
1979 నాగ మోహిని (నీయా!) Kamal తమిళ Durai
1979 అలవుదీనుమ్ అల్బుత వెలక్కుమ్ Alauddin మలయాళ / తమిళ I. V. Sasi Multiple-language version- Simultaneously made in Tamil as అలా ఉధ్ధీనుమ్ అర్పుద విలక్కుమ్ [41]
1979 పాటగాడు (థాయిల్లమల్ నాన్ ఇల్ల్ య్) Raja తమిళ R. Thyagarajan [41]
1979 నినైత్తాలే ఇనిక్కుమ్ Chandru తమిళ కైలాసం బాలచందర్ Multiple-language version - Bilingual film ప్యార్ తరనా (ఇది 80 లో నిర్మించబడిన తమిళ చిత్రం నినైత్తాలే ఇనిక్కుమ్ యొక్క డబ్బింగ్ హిందీ చిత్రం) [42]
1979 అందమైన అనుభవం Chandru తెలుగు కైలాసం బాలచందర్ [42]
1979 ఇది కథ కాదు Janardhan తెలుగు కైలాసం బాలచందర్ [18]
1979 Nool Veli Kamal Haasan తమిళ కైలాసం బాలచందర్ Guest appearance as himself
Multiple-language version - Simultaneously filmed in Telugu as గుప్పెడు మనసు
[43]
1979 కళ్యాణ రాముడు (కళ్యాణరమన్) Raman & Kalyanam తమిళ G. N. Rangarajan [44]
1979 Pasi Kamal Haasan తమిళ Durai Guest appearance as himself [45]
1979 గుప్పెడు మనసు Kamal Haasan తెలుగు కైలాసం బాలచందర్ Guest appearance as himself
Simultaneously filmed in Tamil as Nool Veli
[46]
1979 మంగల వాథియమ్ తమిళ K. Shankar [12]
1979 నీల మలర్గల్ Chandran తమిళ Krishnan Panju
1979 అళియాద కోలన్గల్ Gowrishankar తమిళ Balu Mahendra Guest appearance [12]
1980 ప్రేమ పిచ్చి (ఉల్లాస పరవైగళ్) Ravi తమిళ C. V. Rajendran (దో దిల్ దివానే - hindi)
1980 గురు Guru తమిళ I. V. Sasi
1980 వరుమైయిన్ నిరమ్ సివప్పు Rangan తమిళ కైలాసం బాలచందర్ Simultaneously filmed in Telugu as ఆకలి రాజ్యం [47]
1980 మరియ మై డార్లింగ్ Raghu కన్నడ Durai Multiple-language version (Bilingual film) [12]
[48]
1980 తమిళ
1980 Saranam Ayyappa తమిళ Dasarathan Guest appearance [49]
1980 నట్చత్త్రిరమ్ Kamal Haasan తమిళ Dasari Narayana Rao Guest appearance
1981 తిల్లు ముల్లు Charu Haasan తమిళ కైలాసం బాలచందర్ Guest appearance [50]
1981 ఆకలి రాజ్యం J. Ranga Rao తెలుగు కైలాసం బాలచందర్ Simultaneously filmed in Tamil as వరుమైయిన్ నిరమ్ సివప్పు [51]
1981 మీండుమ్ కోకిలా Manian తమిళ G. N. Rangarajan
1981 Ram Lakshman Ram తమిళ R. Thyagarajan [12]
1981 అమావాస్య చంద్రుడు (రాజ పార్వై) (ఎ)(a) Raghu తమిళ Singeetam Srinivasa Rao (100th film)
Simultaneously filmed in Telugu as అమావాస్య చంద్రుడు
[44]
[51]
1981 ఏక్ దుజే కేలియే Vasu హిందీ కైలాసం బాలచందర్ [52]
1981 రంగూన్ రాజా (కడల్ మీన్‌గళ్) Selvanayagam & Rajan తమిళ G. N. Rangarajan [12]
1981 సవాల్ P. P. Raja తమిళ R. Krishnamoorthy [53]
1981 అందగాడు (1982 సినిమా) (శంకరలాల్) Dharmalingam & Mohan తమిళ T. N. Balu Simultaneously filmed in Telugu as అందగాడు [12]
1981 టిక్ టిక్ టిక్ Dilip తమిళ P. Bharathiraja [53]
1981 చిలిపి చిన్నోడు (ఎల్లామ్ ఇన్బమయమ్) Velu తమిళ G. N. Rangarajan [44]
1982 వాళ్వే మాయమ్ Raja తమిళ R. Krishnamoorthy [54]
1982 అంది వెయిలిలే Ponnu మలయాళ Radhakrishnan Dubbed Tamil as Ponmaalai Pozhudhu [55]
1982 వసంత కోకిల (మూన్రామ్ పిరై) Srinivasan (Seenu) తమిళ Balu Mahendra ఇది హిందీలో సద్మా గా పునర్నిర్మించబడింది. [44]
[56]
1982 Neethi Devan Mayakkam Military officer తమిళ Bapu Simultaneously shot in Telugu as Edi Dharmam Edi Nyayam [57]
1982 Maattuvin Chattangale మలయాళ K. G. Rajasekharan Special appearance in the song "Maattuvin Chattangale" [12]
[58]
1982 సిమ్లా స్పెషల్ Gopu తమిళ Muktha Srinivasan
1982 సనమ్ తేరీ కసమ్ Sunil Sharma హిందీ Narendra Bedi పాడగన్ (ఇది 90 లలో నిర్మించబడిన హిందీ చిత్రం తనమ్ మేరీ కసమ్ యొక్క తమిళ డబ్బింగ్ చిత్రం) [59]
1982 సకల కళా వల్లవన్ Velu తమిళ S. P. Muthuraman
1982 ఎళమ్ రాత్తిరి మలయాళ Krishnakumar
1982 రాణీ తేనీ Miller తమిళ G. N. Rangarajan Cameo appearance [60]
1982 ఎహ్ తో కమాల్ హోగయా Ratan Chander & Ajay Saxena హిందీ తాతినేని రామారావు (హిందీలో మొదటి ద్విపాత్రాభినయం) (హిందీ)ఇది పునర్నిర్మించబడిన "చట్టమ్ ఎన్ కైయ్యిల్ "యొక్క హిందీ చిత్రం. [61]
1982 పగడ్సై పన్నిరెండు Anand తమిళ Dhamodharan. N
1982 అగ్ని సాక్షి Kamal Haasan తమిళ కైలాసం బాలచందర్ Guest appearance [62]
1983 జరాసీ జిందగీ (Zara Si Zindagi) Rakesh Kumar Shastri హిందీ కైలాసం బాలచందర్ [60]
1983 ఉరువంగళ్ మారలామ్ Kamal Haasan తమిళ S. V. Ramanan Guest appearance
1983 చట్టం Raja తమిళ K. Vijayan స్నేహ బంధం (మలయాళం)
1983 సాగర సంగమం Balakrishna తెలుగు కె.విశ్వనాథ్ సలంగై ఒలి - Tamil [63]
[16]
1983 సద్మ Somu హిందీ బాలు మహేంద్ర [64]
1983 పొయ్‌క్కాల్ కుదిరై Kamal Haasan తమిళ కైలాసం బాలచందర్ Cameo appearance [60]
1983 బెనకియల్లి అరళింద హువు కన్నడ కైలాసం బాలచందర్ Special appearance in the song "Munde Banni" [65]
[66]
1983 జల్సారాయుడు (తూంగాదె తంబి తూంగాదే) డబుల్ రోల్ తమిళ ఎస్ పి ముత్తురామన్ [67]
1984 ఎహ్ దేష్ Mathur హిందీ తాతినేని రామారావు Guest role [60]
1984 ఏక్ నయీ పహేలీ Sandeep హిందీ కైలాసం బాలచందర్ [68]
1984 యాద్ గార్ Rajnath హిందీ Dasari Narayana Rao [60]
1984 రాజ్ తిలక్ Suraj హిందీ Rajkumar Kohli [69]
1984 ఎనక్కుళ్ ఒరువన్ Madhan & Upendhra తమిళ S. P. Muthuraman 125th Film [16]
1984 కరిష్మా Sunny హిందీ I. V. Sasi [60]
1985 ఖైదీ వేటా David & Shankar తమిళ P. Bharathiraja ఒరు కైదియిన్ డైరీ - తమిళ [44]
1985 కాక్కి చట్టై Murali తమిళ Rajasekhar [60]
1985 అంద ఒరు నిమిడమ్ Kumar తమిళ Major Sundarrajan [60]
1985 ఉయర్న్ద ఉళ్ళమ్ Anandh తమిళ S. P. Muthuraman [60]
1985 సాగర్ Raja హిందీ Ramesh Sippy [70]
[71]
1985 గిరఫ్తార్ Kishan Kumar Khanna హిందీ Prayag Raaj [60]
[72]
1985 మంగమ్మా శపధం Ashok & Raja తమిళ K. Vijayan [60]
1985 జపానిల్ కల్యాణ రామన్ Kalyanam & Raman తమిళ S. P. Muthuraman [73]
1985 దేఖా ప్యార్ తుమ్హారా Vishal హిందీ Virendra Sharma [60]
1986 విక్రమ్ (a) Vikram తమిళ Rajasekhar [74]
1986 స్వాతిముత్యం Sivaiah తెలుగు K. Viswanath (సిప్పికుళ్ ముత్తు-తమిళ) ఇది అనిల్ కపూర్ నాయకుడుగా హిందీలోఈశ్వర్గా పునర్నిర్మించ బడింది. [75]
1986 అందరికంటే ఘనుడు (నానుమ్ ఒరు తొళిలాళి) Bharath తమిళ C. V. Sridhar [60]
1986 మనకణక్కు తమిళ R. C. Sakthi Guest appearance as film director [53]
1986 ఒక రాధ – ఇద్దరు కృష్ణులు Krishna తెలుగు A. Kodandarami Reddy [60]
1986 డాన్స్‌మాష్టర్ (పున్నగై మన్నన్ -తమిళ) Sethu,
Chaplin Chellappa
తమిళ కైలాసం బాలచందర్ [44]
1987 కాదల్ పరిసు Mohan తమిళ A. Jagannathan [76]
[60]
1987 వ్రతం Balu మలయాళ I. V. Sasi [60]
1987 కడమై కణ్ణియమ్ కట్టుబాటు (ఎ) Kamal Haasan తమిళ Santhana Bharathi Guest appearance [60]
1987 పేర్ చొల్లుమ్ పిళ్ళై Ramu తమిళ ఎస్.పి.ముత్తురామన్ [76]
[60]
1987 పుష్పక విమానం "Unemployed graduate" (Silent film) Singeetam Srinivasa Rao Also known as Pushpak and Pesum Padam [77]
[23]
1987 నాయకుడు Sakthivelu (Velu Naicker) తమిళ Mani Ratnam [78][79]
1988 డైసీ James మలయాళ Pratap K. Pothen Extended Cameo [80]
1988 పోలీస్ డైరీ(సూర సంహారం) Pandiyan తమిళ Chitra Lakshmanan [76]
[81]
1988 ఉన్నాల్ ముడియుం తంబి Udhayamoorthy తమిళ కైలాసం బాలచందర్ [60]
[82]
1988 సత్య (ఎ) Sathyamurthy తమిళ Suresh Krissna [44]
1989 అపూర్వ సహోదరులు(ఎ) Sethupathi, Appadurai & Raja తమిళ సింగీతం శ్రీనివాసరావు [44]
1989 చాణిక్యన్ Johnson మలయాళ T. K. Rajeev Kumar [83]
1989 వెట్రి విళా Vetrivel తమిళ Prathap Pothan [76]
[60]
1989 ఇంద్రుడు చంద్రుడు G. K. Rayudu & Chandru తెలుగు Suresh Krissna ఇది తమిళంలో ఇంద్రన్ చంద్రన్ గా పునర్నిర్మించబడి హిందీలో మేయర్ సాబ్ గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు [84][85]
1990 మైఖేల్ మదన కామరాజు (1990) Michael,
Madhanagopal,
Kameshwaran,
Subramaniam Raju
తమిళ సింగీతం శ్రీనివాసరావు [86]
[87]
1991 గుణ Gunasekharan తమిళ Santhana Bharathi [88]
1992 సింగారవేలన్ Singaravelan తమిళ R. V. Udayakumar [89]
1992 క్షత్రియ పుత్రుడు (ఎ) Shakthivel తమిళ Bharathan [90]
1993 మహరాసన్ Vadivelu తమిళ G. N. Rangarajan [60]
1993 కళైంజన్ Indrajith తమిళ G. B. Vijay [76]
[60]
1994 మహా నది (బి) Krishnaswamy తమిళ Santhana Bharathi [91]
1994 ఆడవాళ్లకు మాత్రం (మగలీర్ మట్టుమ్) (ఎ) తమిళ సింగీతం శ్రీనివాసరావు Guest appearance [92]
1994 ప్రొఫెసర్ విశ్వం Selvam తమిళ K. S. Sethumadhavan [93]
[94]
1995 సతీ లీలావతి (ఎ) Shakthivel తమిళ Balu Mahendra [95]
1995 శుభసంకల్పం Dasu తెలుగు K. Viswanath [96]
1995 ద్రోహి (కురుదిపునల్) (ఎ) Adhi Narayanan తమిళ P. C. Sreeram Simultaneously shot in Telugu as Drohi [44]
1996 భారతీయుడు Senapathy & Chandrabose తమిళ S. Shankar [97]
1996 భామనే సత్యభామనే Pandian
(Avvai Shanmugi)
తమిళ K. S. Ravikumar ఇది హిందీలో చాచీ 420గా తిరిగి చిత్రించ బడింది [97]
1997 చాచి 420 (ఎ) (బి) (సి) Jaiprakash Paswan
(Lakshmi Godbhole)
హిందీ Kamal Haasan [98]
1998 కాధలా కాధలా Ramalingam తమిళ సింగీతం శ్రీనివాసరావు [99]
2000 హే రామ్ Saket Ram తమిళ, హిందీ Kamal Haasan [100]
2000 తెనాలి Thenali Soman తమిళ K. S. Ravikumar [101]
2001 అభయ్గా (అలవంధన్) Vijay Kumar & Nandha Kumar తమిళ, హిందీ Suresh Krissna ఉల్లేఖన లోపం: <ref> ట్యాగుకు, మూసే </ref> లేదు.
2002 పమ్మళ్ కె. సంబంధం Pammal Kalyana Sambandham తమిళ T. S. B. K. Moulee [102]
2002 పంచతంత్రం (2002) Ramachandramurthy తమిళ K. S. Ravikumar [76]
[103]
2003 అన్బే శివం Nallasivam తమిళ Sundar. C [104]
2003 Nala Damayanthi Kamal Haasan తమిళ T. S. B. K. Moulee Guest appearance as himself [105]
2004 పోతురాజుగా (విరుమాండి) Virumaandi తమిళ Kamal Haasan [106]
2004 వసూల్ రాజా MBBS Rajaraman తమిళ Saran [107]
2005 ముంబాయి ఎక్స్ ప్రెస్ అవినాష్ తమిళ, హిందీ సింగీతం శ్రీనివాసరావు ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొందింది
2005 రమ షమ బమ Dr. Shyam Sajjan కన్నడ రమేష్ అరవింద్ Extended Cameo. [108]
2006 రాఘవన్గా (వెట్టీయాడు విలైయాడు) DCP Raghavan తమిళ Gautham Menon [109]
2008 దశావతారం Govindarajan Ramaswamy,
Rangarajan Nambi,
Christian Fletcher,
Balram Naidu,
Krishnaveni,
Vincent Poovaragan,
Khalifulla Khan,
Avatar Singh,
Shinghen Narahashi,
George W. Bush
తమిళ K. S. Ravikumar ఏక కాలంలో తమిళ, తెలుగు, హిందీ,ఇంగ్లీష్ బాషలలో రూపొందించబడి 2008 జూన్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. [97]
2009 Unnaipol Oruvan "Common man" తమిళ Chakri Toleti [110]
[111]
2009 ఈనాడు "Common man" తెలుగు Chakri Toleti ఏక కాలంలో తమిళ, తెలుగు బాషలలో రూపొందించబడి 2009 సెప్టెంబరు 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది. [112]
2010 Four Friends Kamal Haasan మలయాళ Saji Surendran Guest appearance as himself [113]
2010 మన్మధన్ అంబు Raja Mannar తమిళ K. S. Ravikumar [114]
2013 విశ్వరూపం Wisam Ahmed Kashmiri తమిళ Kamal Haasan Bilingual film (ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలలో తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.) [115]
2013 Vishwaroop Wisam Ahmed Kashmiri హిందీ Kamal Haasan [116]
2015 ఉత్తమ విలన్ Manoranjan తమిళ రమేష్ అరవింద్ [117]
2015 పాపనాశం Suyambulingam తమిళ Jeethu Joseph [118]
2015 Thoongaa Vanam C. K. Diwakar తమిళ Rajesh Selva Bilingual film (ఏక కాలంలో తమిళ తెలుగు బాషలలో రూపొందించబడి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.) [119]
2015 చీకటి రాజ్యం C. K. Diwakar Telugu Rajesh Selva [120]
2016 Meen Kuzhambum Mann Paanaiyum Swami తమిళ Amudeshver Guest appearance [121]
2018 విశ్వరూపం II Wisam Ahmed Kashmiri తమిళం Kamal Haasan Bilingual film (ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీలలో తయారు చేసి 10 ఆగస్టు 2018 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడింది.)
2018 Vishwaroop II Wisam Ahmed Kashmiri హిందీ Kamal Haasan
2021 Indian 2 Senapathy, Chandrabose తమిళ S. Shankar Filming [122]
2021 విక్రమ్ తమిళం లోకేష్ కనగరాజ్ Filming [123]

నిర్మాత గా

[మార్చు]
  • పై చిత్రాలలో (ఎ) గా గుర్తుంచ బడినవాటికి కమల్ హాసన్ నిర్మాత.

రచయిత గా

[మార్చు]
  • 1999 - బీవీ నెం.1 (హిందీ) పాటలు
  • 1997 - విరాసత్ (హిందీ) పాటలు
  • అంతే కాకుండా పై చిత్రాలలో (బి) గా చూపించ బడినవి కమల్ హాసన్ చే రచించబడినవి.

దర్శకుడి గా

[మార్చు]
  • పైన (సి) గా రాసిన చిత్రాలు కమల్ హాసన్ చే దర్శకత్వం ఛేయబడినవి.
  • 2000 - హే రామ్
  • 2004 - విరుమాండి
  • 2013- విశ్వరూపం

ఇతర విభాగాల్లో

[మార్చు]

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు వెబ్ సైట్ లో కమల్ హసన్ జీవిత చరిత్రజూన్ 16,2008న సేకరించబడినది.
  2. Varun (2023-11-07). "Kamal Haasan: A Cinematic Journey through Iconic Roles, Here are the Top 9 films of the Legend". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-07.
  3. సంపాదక, బృందం (2015). "Kamal Haasan and contraversy". The Hindu. Retrieved 14 June 2015.
  4. Saideepak (24 January 2017). "Deconstructing The Politics of Kamal Hassan". Swarajya. Retrieved 30 January 2017.
  5. "Sivaji Ganesan has a film appreciation society all to himself". Firstpost. Retrieved 1 February 2017.
  6. Guy, Randor. "Paatha Kaanikkai 1962". The Hindu. Archived from the original on 4 February 2017. Retrieved 3 February 2017.
  7. Vijayakumar, B. "Kannum Karalum 1962". The Hindu. Archived from the original on 4 February 2017. Retrieved 3 February 2017.
  8. Saraswathi, S. (7 November 2014). "Birthday Special: Kamal Haasan's 60 years of excellence". Rediff.com. Archived from the original on 5 February 2017. Retrieved 3 February 2017.
  9. "Kamal Haasan's first role as an adult was in Maanavan". The Times of India. Archived from the original on 5 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  10. Vijayakumar, B. (20 December 2015). "Velankanni Mathavu – 1977". The Hindu. Archived from the original on 1 February 2017. Retrieved 30 January 2017.
  11. 11.0 11.1 "Kamal Haasan: My best roles came from Balachandersaab". Rediff.com. 18 December 2014. Archived from the original on 1 February 2017. Retrieved 1 February 2017.
  12. 12.00 12.01 12.02 12.03 12.04 12.05 12.06 12.07 12.08 12.09 12.10 12.11 12.12 12.13 12.14 12.15 12.16 12.17 12.18 12.19 12.20 12.21 12.22 12.23 12.24 12.25 12.26 12.27 12.28 Rajadhyaksha & Willemen 1998, p. 117.
  13. Nagarajan, A. P. (1974). Gumasthavin Magal (motion picture). C. N. V. Movies. Archived from the original on 12 February 2017.
  14. Ramachandran 2012, p. 63.
  15. Narayan, Hari (29 December 2014). "His vision is an idealistic continuum..." The Hindu. Retrieved 31 January 2017.
  16. 16.0 16.1 16.2 Srivatsan (7 November 2016). "Happy Birthday Kamal Haasan: A lone wolf of Indian cinema who never compromised". India Today. Archived from the original on 31 January 2017. Retrieved 30 January 2017.
  17. Rajadhyaksha & Willemen 1998, p. 428.
  18. 18.0 18.1 Rajpal, Roktim (29 June 2015). "'Papanasam' to 'Ek Dujje Ke Liye': 10 memorable remakes featuring the indomitable Kamal Haasan". CNN-News18. Archived from the original on 5 February 2017. Retrieved 4 February 2017.
  19. Oru Oodhappu Kan Simittugiradhu (Motion picture). Kamal Haasan, Sujatha. Biscoot Tamil Movies HD. 23 June 2016. Archived from the original on 5 April 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  20. Unarchigal (Motion picture). Kamal Haasan, Srividya. Simply South. 13 January 2015. Archived from the original on 6 April 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  21. Kumaara Vijayam (Motion picture). Kamal Haasan, Jayachitra. PlayEven Tamil. 4 January 2016. Archived from the original on 5 April 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  22. "Ponni: 1976". The Hindu. Archived from the original on 5 February 2017. Retrieved 4 February 2017.
  23. 23.0 23.1 "Kamal Haasan@60: His 10 Best Films". NDTV. 7 November 2014. Archived from the original on 5 February 2017. Retrieved 3 February 2017.
  24. Uyarndhavargal (Motion picture). Kamal Haasan, Sujatha. Cinema Junstion. 21 August 2014. Archived from the original on 5 April 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  25. "Kamal Haasan sings in English". Rediff.com. Archived from the original on 3 March 2016. Retrieved 4 February 2017.
  26. Rajadhyaksha & Willemen 1998, p. 430.
  27. Ramachandran 2012, pp. 58–59.
  28. "Kamal Haasan with the woman he once wanted to marry!". The Telegraph. Archived from the original on 10 జనవరి 2016. Retrieved 22 సెప్టెంబరు 2019.
  29. Ramachandran 2012, p. 66.
  30. Ramachandran 2012, p. 69.
  31. Naam Pirandha Mann (Motion picture). Sivaji Ganesan, Kamal Haasan. Cinecurry Tamil. 22 July 2015. Archived from the original on 5 April 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  32. "The Best Films of Balu Mahendra". Rediff.com. 13 February 2014. Archived from the original on 5 February 2017. Retrieved 3 February 2017.
  33. https://scroll.in/reel/855475/iv-sasis-her-nights-was-a-bold-take-on-sex-work-that-was-unfairly-dismissed-as-porn
  34. Sakka Podu Podu Raja (Motion picture). Jaishankar, Jayachitra. Biscoot Tamil. 5 August 2014. Archived from the original on 22 February 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  35. "The saga returns". The Hindu. 17 February 2010. Retrieved 31 January 2017.
  36. Ramachandran 2012, p. 78.
  37. Ramachandran 2012, p. 79.
  38. 38.0 38.1 Ramachandran 2012, p. 83.
  39. Ramachandran 2012, p. 85.
  40. Balakrishnan, Ravi (17 November 2017). "A rose by any name". The Economic Times. Archived from the original on 31 January 2017. Retrieved 30 January 2017.
  41. 41.0 41.1 Ramachandran 2012, p. 90.
  42. 42.0 42.1 Ramachandran 2012, p. 91.
  43. Balachander, K. (1979). Nool Veli (motion picture) (in Tamil). Kalakendra Movies.{{cite AV media}}: CS1 maint: unrecognized language (link)
  44. 44.0 44.1 44.2 44.3 44.4 44.5 44.6 44.7 44.8 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; BirthdaySpecial అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  45. Durai (director) (1979). Pasi [Hunger] (motion picture) (in Tamil). Sunitha Cine Arts. Archived from the original on 6 April 2017.{{cite AV media}}: CS1 maint: unrecognized language (link)
  46. Balachander, K. (1979). Guppedu Manasu (motion picture) (in Telugu). Kalakendra Movies.{{cite AV media}}: CS1 maint: unrecognized language (link)
  47. Ramnath, Nandini (13 January 2013). "Unemployment exchange". Livemint. Archived from the original on 1 February 2017. Retrieved 31 January 2017.
  48. Maria, My Darling (Motion picture). Kamal Haasan, Sripriya. Cinecurry Tamil. 4 April 2015. Archived from the original on 6 April 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  49. Saranam Ayyappa (Motion picture). Sarath Babu, Jayabharathi. Cinecurry Tamil. 8 September 2016. Archived from the original on 6 April 2017. Retrieved 21 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  50. Ramachandran 2012, p. 106.
  51. 51.0 51.1 Devi Dundoo, Sangeetha (3 November 2015). "My focus is to give quality films at great speed". The Hindu. Archived from the original on 12 సెప్టెంబరు 2019. Retrieved 22 సెప్టెంబరు 2019.
  52. Vijayakar, Rajiv (10 June 2011). "Timeless Love". The Indian Express. Archived from the original on 1 February 2017. Retrieved 1 February 2017.
  53. 53.0 53.1 53.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; rebirth అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  54. "Kamal's most memorable romantic films". Sify. Archived from the original on 5 February 2017. Retrieved 3 February 2017.
  55. "MA Nishad stars with Anu Hasan in Vakku". The Times of India. 8 January 2016. Archived from the original on 5 February 2017. Retrieved 3 February 2017.
  56. "30th National Film Festival, 1983". Directorate of Film Festivals. p. 45. Archived from the original (PDF) on 3 అక్టోబరు 2015. Retrieved 22 సెప్టెంబరు 2019.
  57. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2023-01-30. Retrieved 2019-09-22.
  58. Maattuvin Chattangale (Motion picture). Jose Prakash, Manavalan Joseph. Malayalam Movie Club. 23 September 2015. Archived from the original on 5 April 2017. Retrieved 22 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  59. "Sanam Teri Kasam". Bollywood Hungama. Archived from the original on 6 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  60. 60.00 60.01 60.02 60.03 60.04 60.05 60.06 60.07 60.08 60.09 60.10 60.11 60.12 60.13 60.14 60.15 60.16 60.17 60.18 60.19 60.20 60.21 Rajadhyaksha & Willemen 1998, p. 118.
  61. "Yeh To Kamal Ho Gaya Cast & Crew". Bollywood Hungama. Retrieved 15 February 2018.
  62. "Rajinikanth and Kamal Haasan to Share Screen Space in Shankar's Next?". International Business Times. 18 April 2015. Archived from the original on 5 February 2017. Retrieved 4 February 2017.
  63. Rajadhyaksha & Willemen 1998, p. 462.
  64. "Kamal-Sridevi's 'Sadma' remake on the cards". The Times of India. Archived from the original on 5 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  65. "Bangalore is a happening place". Sify. Archived from the original on 5 February 2017. Retrieved 4 February 2017.
  66. Benkiyalli Aralida Hoovu (Motion picture). Suhasini, Pavithra. Simply South. 6 February 2015. Archived from the original on 6 April 2017. Retrieved 22 February 2017.{{cite AV media}}: CS1 maint: others in cite AV media (notes) (link)
  67. https://www.rottentomatoes.com/m/thoongathe_thambi_thoongathe Archived 2019-04-30 at the Wayback Machine?
  68. "Unraveling the puzzle". The Hans India. 21 February 2016. Archived from the original on 5 February 2017. Retrieved 4 February 2017.
  69. Bhagat, Pranay. "Raj Tilak". Bollywood Hungama. Archived from the original on 6 February 2017. Retrieved 6 February 2017.
  70. Rajadhyaksha & Willemen 1998, p. 473.
  71. Mário Cabral e Sá (2006). Location Goa. Department of Information and Publicity, Government of Goa. p. 95.
  72. "Giraftaar". Bollywood Hungama. Archived from the original on 6 February 2017. Retrieved 6 February 2017.
  73. "Sequels a reliable recipe for hit films". The Times of India. Archived from the original on 5 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  74. Viswanathan, Vani (15 July 2016). "Review: Tamil Cinema's Women Scientists – Sassy, Nerdy, and Still Tamil". In Plainspeak. Archived from the original on 5 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  75. "34th National Film Festival – 1987". Directorate of Film Festivals. p. 122. Archived from the original (PDF) on 5 February 2017. Retrieved 5 February 2017.
  76. 76.0 76.1 76.2 76.3 76.4 76.5 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; fromSelvamToSuyambulingam అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  77. Rajadhyaksha & Willemen 1998, p. 481.
  78. Haasan, Kamal (20 October 2012). "'Of course Velu Nayakan doesn't dance'". The Hindu. Archived from the original on 12 జూన్ 2013. Retrieved 22 సెప్టెంబరు 2019.
  79. "35th National Film Festival, 1988". Directorate of Film Festivals. p. 122. Archived from the original (PDF) on 14 జూలై 2016. Retrieved 22 సెప్టెంబరు 2019.
  80. Prakash, Asha (26 November 2013). "Kamal Haasan to make a Malayalam film?". The Times of India. Archived from the original on 7 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  81. "Kamalhasans latest performance dwarfs his earlier hits". India Today. 31 May 1989. Archived from the original on 5 February 2017. Retrieved 3 February 2017.
  82. Srivatsan (23 January 2017). "Jallikattu row: These Tamil films reflected the current situation earlier". India Today. Archived from the original on 1 February 2017. Retrieved 31 January 2017.
  83. Saraswathi, S (22 May 2016). "Kamal Haasan and I were destined to do a film together". Rediff.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  84. Krissna, Suresh. "Indrudu Chandrudu (Telugu,1989)". Suresh Krissna. Archived from the original on 3 ఫిబ్రవరి 2017. Retrieved 3 February 2017.
  85. "Kamal Haasan's many talents". Rediff.com. Archived from the original on 3 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  86. Bhashyam, Srinivas (11 January 2016). "Michael Madana Kamarajan (Tamil)". Outlook. Archived from the original on 31 January 2017. Retrieved 31 January 2017.
  87. Pillai 2015, p. 242.
  88. Srivatsan (5 November 2016). "25 Years of Gunaa: Why Kamal Haasans classic didnt make the cut". India Today. Archived from the original on 31 January 2017. Retrieved 31 January 2017.
  89. "Remembering Aachi Manorama: A look at the best performances of the legend". India Today. Archived from the original on 5 February 2017. Retrieved 3 February 2017.
  90. "40th National Film Festival – 1993". Directorate of Film Festivals. p. 166. Archived from the original (PDF) on 2 జూన్ 2016. Retrieved 22 సెప్టెంబరు 2019.
  91. "41st National Film Festival – 1994". Directorate of Film Festivals. p. 184. Archived from the original (PDF) on 13 March 2016. Retrieved 5 February 2017.
  92. Rajadhyaksha & Willemen 1998, p. 520.
  93. "Going to school with kollywood". The Times of India. 5 September 2013. Archived from the original on 5 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  94. Rajadhyaksha & Willemen 1998, p. 521.
  95. Rajadhyaksha & Willemen 1998, p. 531.
  96. "Subha Sankalpam". Bollywood Hungama. Archived from the original on 3 February 2017. Retrieved 3 February 2017.
  97. 97.0 97.1 97.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Southscope అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  98. "Chachi 420". Planet Bollywood. Archived from the original on 6 February 2017. Retrieved 6 February 2017.
  99. Narayan, Anantha (1 February 2013). "Kamal Haasan an atheist? His works suggest otherwise". Firstpost. Retrieved 31 January 2017.
  100. Reddy, T. Krithika (25 February 2000). "Film Review: Hey! Ram". The Hindu. Archived from the original on 4 April 2017. Retrieved 31 January 2017.
  101. Rangarajan, Malathi (3 November 2000). "Film Review: Thenali". The Hindu. Archived from the original on 1 February 2017. Retrieved 31 January 2017.
  102. Rangarajan, Malathi (18 January 2002). "Pammal K. Sambandham". The Hindu. Archived from the original on 6 February 2017. Retrieved 6 February 2017.
  103. "Pancha-thanthiram". The Hindu. 5 July 2002. Archived from the original on 26 February 2008. Retrieved 31 January 2017.
  104. Rangarajan, Malathi (17 January 2003). "Anbe Sivam". The Hindu. Archived from the original on 26 February 2008. Retrieved 31 January 2017.
  105. "NALA DAMAYANTI (2003)". British Film Institute. Archived from the original on 23 February 2018. Retrieved 23 February 2018.
  106. "Virumaandi". The Hindu. 23 January 2004. Archived from the original on 5 October 2009. Retrieved 31 January 2017.
  107. "Vasoolraja MBBS". Sify. 12 August 2004. Archived from the original on 31 జనవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  108. "Rama Shama Bhama". Sify. 11 December 2005. Archived from the original on 1 February 2017. Retrieved 31 January 2017.
  109. Rangan, Baradwaj (27 August 2006). "Review: Vettaiyaadu Vilaiyaadu". Baradwaj Rangan. Archived from the original on 10 October 2016. Retrieved 31 January 2017.
  110. "Unnaipol Oruvan". Sify. 18 September 2009. Archived from the original on 1 ఫిబ్రవరి 2017. Retrieved 31 January 2017.
  111. Srivatsan (7 November 2017). "Happy Birthday Kamal Haasan: Nayagan to Neta, a look at Haasan's Dasavatharam". India Today (in ఇంగ్లీష్). Retrieved 11 April 2018.
  112. "Eenadu Movie Review". The Times of India. Archived from the original on 1 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  113. "Four Friends review: A bad copy of a good film". Sify. 29 October 2010. Archived from the original on 31 జనవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  114. Srinivasan, Pavithra (23 December 2010). "Kamal Haasan delivers with Manmadhan Ambu". Rediff.com. Archived from the original on 23 డిసెంబరు 2014. Retrieved 22 సెప్టెంబరు 2019.
  115. Rangan, Baradwaj (8 February 2013). "Vishwaroopam: Terror messages". The Hindu. Archived from the original on 31 January 2017. Retrieved 31 January 2017.
  116. "Movie review: Vishwaroop". India Today. Archived from the original on 26 March 2015. Retrieved 31 January 2017.
  117. Rangan, Baradwaj (2 May 2015). "Uttama Villain: A superb core let down by lacklustre filmmaking". The Hindu. Retrieved 31 January 2017.
  118. "Papanasam movie review: Where 'actor' Kamal Haasan supersedes the 'superstar'". The Indian Express. Indo-Asian News Service. 5 July 2015. Archived from the original on 1 February 2017. Retrieved 31 January 2017.
  119. Suganth, M. "Thoongaavanam Movie Review". The Times of India. Archived from the original on 5 ఫిబ్రవరి 2017. Retrieved 22 సెప్టెంబరు 2019.
  120. "'I couldn't do a mythological film till date'- Kamal Hassan". iQlik. 4 November 2015. Archived from the original on 1 February 2017. Retrieved 31 January 2017.
  121. Upadhyaya, Prakash (12 November 2016). "Meen Kuzhambum Mann Paanaiyum movie review: What critics say about the Prabhu, Kalidas Jayaram-starrer". International Business Times. Archived from the original on 9 January 2017. Retrieved 31 January 2017.
  122. Shankar Shanmughum [@shankarshanmugh] (14 January 2019). "#indian2 Hi everyone! " Happy Pongal" t.co/rgiuCBBtLq" (Tweet) – via Twitter. Invalid |number= parameter (help)
  123. "Kamal Hassan Vikram First Glimpse: Birthday gift for fans". Moviezupp. 7 November 2021. Archived from the original on 2023-01-10. Retrieved 7 November 2021.

వెలుపలి లింకులు

[మార్చు]

కమల్ హసన్ & అభిమానుల అధికారిక వెబ్సైట్

ఇతర మూలాలు

[మార్చు]