ముంబై ఎక్స్‌ప్రెస్ (సినిమా)
స్వరూపం
ముంబై ఎక్స్‌ప్రెస్ | |
---|---|
![]() సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
రచన | కమల్ హాసన్ |
స్క్రీన్ ప్లే | కమల్ హాసన్ |
నిర్మాత | చెరుకూరి హరీష్, హరి గోపాలకృష్ణమూర్తి |
తారాగణం | కమల్ హాసన్ మనీషా కొయిరాలా |
ఛాయాగ్రహణం | సిద్ధార్థ్ |
కూర్పు | ఆస్మిత్ కుందర్ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | రాజరాజేశ్వరి కంబైన్స్ |
విడుదల తేదీ | 14 ఏప్రిల్ 2005 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
ముంబై ఎక్స్‌ప్రెస్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] ఈ సినిమాను తమిళం, హిందీ భాషలలో ఏకకాలంలో నిర్మించారు. తమిళంలో పశుపతి, వయ్యపురి, నాజర్, సంతాన భారతి, కోవై సరళ నటించిన పాత్రలను హిందీలో వరుసగా విజయ్‌రాజ్, దినేష్ లంబా, ఓంపురి, సౌరభ శుక్లా, ప్రతిమా కళ్మి నటించారు. ప్రధాన జంటతో పాటు తక్కిన పాత్రలను రెండు భాషలలో ఒకరే నటించారు. తమిళ వర్షన్‌ను తెలుగులోనికి డబ్ చేశారు.
నటీనటులు
[మార్చు]- కమల్ హాసన్
- మనీషా కొయిరాలా
- రమేష్ అరవింద్
- వయ్యాపురి
- సంతాన భారతి
- పశుపతి
- నాజర్
- కోవై సరళ
- రజా మురాద్
- శరత్ సక్సేనా
- అనితా వాహి
- మాస్టర్ హార్దిక్ టక్కర్
- మున్మున్ దత్తా
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే: కమల్ హాసన్
- దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
- సంగీతం: ఇళయరాజా
- పాటలు: వెన్నెలకంటి
- కళ: నితిన్ వబ్లి
- నృత్యాలు: శోభి పాల్ రాజ్
- ఛాయ: సిద్ధార్థ్
- కూర్పు: ఆస్మిత్ కుందర్
- నిర్మాతలు: చెరుకూరి హరీష్, హరి గోపాలకృష్ణమూర్తి
పాటలు
[మార్చు]క్రమసంఖ్య | పేరు | గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "లేరా అడ్డుతప్పుకో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ, ఎస్.పి.శైలజ | |
2. | "నా కనులలో ఎవ్వరో" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర | |
3. | "ఇదేమి వింత గోల" | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కమల్ హాసన్, పార్థసారథి | |
4. | "వందేమాతరం" | బృందం |
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Mumbai Xpress (Singeetham Srinivasa Rao) 2005". ఇండియన్ సినిమా. Retrieved 26 October 2022.