శరత్ సక్సేనా
శరత్ సక్సేనా | |
---|---|
జననం | సత్నా, మధ్య ప్రదేశ్ | 1950 ఆగస్టు 17
విద్యాసంస్థ | జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1972–present |
ఎత్తు | 1.77 మీ. (5 అ. 10 అం.) |
జీవిత భాగస్వామి | శోభ సక్సేనా |
శరత్ సక్సేనా ఒక ప్రముఖ భారతీయ నటుడు.[1] ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించాడు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కొన్ని ప్రతినాయక, సహాయ పాత్రల్లో నటించాడు. కొన్ని టి. వి కార్యక్రమాల్లో కూడా నటించాడు.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]శరత్ 1950, ఆగస్టు 17 న మధ్య ప్రదేశ్ లోని సత్నా లో జన్మించాడు. భోపాల్ లోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్, జబల్పూర్ లోని చర్చి బాయ్స్ సీనియర్ సెకండరీ హైస్కూల్లో చదువుకున్నాడు. జబల్పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత సినిమా రంగంలోకి ప్రవేశించాలనుకున్నాడు. అలా 1972 లో ముంబైకి వచ్చాడు. మొదట్లో చిన్న చిన్న వేషాలతో మొదలుపెట్టి ప్రతినాయక, సహాయ పాత్రల్లోకి అడుగు పెట్టాడు.[3]
ఈయన భార్య పేరు శోభ. వీరికి వీర, విశాల్ అనే ఇద్దరు పిల్లలు. వీరిద్దరూ కూడా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు శరత్ వెల్లడించాడు.
సినిమాలు
[మార్చు]- ముఠా మేస్త్రి
- ముగ్గురు మొనగాళ్లు (1994)
- బన్నీ
- సింహాద్రి (2003)
- ముంబాయి ఎక్స్ప్రెస్ (2005)
మూలాలు
[మార్చు]- ↑ నితీష, కశ్యప్. "I can't do anything other than acting: Sharat Saxena". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 21 September 2017.
- ↑ "Sharat Saxena to appear in 'Sajjan Re Phir Jhooth Mat Bolo'". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 21 September 2017.
- ↑ మిశ్రా, అభిమన్యు. "People think muscular men have no brains: Sharat Saxena". timesofindia.indiatimes.com. టైమ్స్ ఆఫ్ ఇండియా. Retrieved 21 September 2017.