Jump to content

శ్రుతి హాసన్

వికీపీడియా నుండి
శ్రుతి హాసన్
2020లో శృతి
జననం (1996-01-28) 1996 జనవరి 28 (వయసు 28)
ఇతర పేర్లుశ్రుతి రాజ్యలక్ష్మీ హాసన్, శ్రుతి హాసన్
వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2000 నుండి ఇప్పటివరకు

శ్రుతి హాసన్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన నటి, గాయని. ఈమె నటుడైన కమల్ హాసన్ కూతురు.

సినీ జీవితం

[మార్చు]

కెరియర్ తొలినాళ్ళు (2000, 2008-2011)

[మార్చు]

2000లో తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన "హే రాం" సినిమాలో బాల్యనటిగా నటించిన శ్రుతి హాసన్ ఆ తర్వాత సంగీతానికి సంబంధించిన విషయాలపై శ్రద్ధ చూపింది. 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన "లక్" సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన నటిగా తొలిసినిమా చేసింది. ఆ సినిమా ఘోరపరాజయాన్ని చవిచూసింది. శ్రుతికి కూడా తన నటనకు విమర్శకుల నుంచి ప్రతికూల స్పందన వచ్చింది. 2011లో కె. రాఘవేంద్రరావు కొడుకైన కె.ప్రకాష్ దర్శకత్వంలో సిద్దార్థ్ సరసన "అనగనగా ఓ ధీరుడు" సినిమాలో నటించింది. విమర్శకుల నుంచి తన నటనకు ప్రశంసలనందుకున్న శ్రుతికి మాత్రం ఈ సినిమా కమర్షియల్ గా పరాజయంగానే మిగిలింది కానీ ఆ సంవత్సరానికి తను ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును పొందింది.

అదే సంవత్సరంలో "దిల్ తో బచ్చాహై జీ" సినిమాలో అతిథి పాత్రలో నటించిని శ్రుతి ఆపై ఏ. ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సూర్య సరసన "7అం అరివు" సినిమాలో నటించింది. సెవెంత్ సెన్స్ పేరుతో తెలుగులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. శ్రుతికి కూడా తన నటనకు గుర్తింపు లభించడమే కాకుండా ఉత్తమ తమిళ నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. ఆ సంవత్సరంలో తన చివరి సినిమా సిద్ధార్థ్ సరసన ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది. చిరంజీవి నటించిన "ఇద్దరు మిత్రులు" సినిమాకి దగ్గరగా ఉండే ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత శ్రుతి ఒక నటిగా తెలుగులో మంచి గుర్తింపును సాధించింది.

గబ్బర్ సింగ్ తర్వాత శ్రుతి ప్రస్థానం (2012-ఇప్పటి వరకు)

[మార్చు]
2017లో శృతి

ధనుష్ సరసన 3 సినిమాలో నటించి విమర్శకులనుంచి ప్రశంసలనందుకున్న తర్వాత శ్రుతి హాసన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సరసన "గబ్బర్ సింగ్" సినిమాలో నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడమే కాక విమర్శకుల మరియూ ప్రేక్షకుల దృష్టిలో శ్రుతి హాసన్ స్థాయిని పెంచింది. తనని నటిగా తెలుగు సినిమాల్లో నిలబెట్టింది. అలాగే తెలుగులో రవితేజ సరసన "బలుపు", జూనియర్ ఎన్.టి.ఆర్. సరసన "రామయ్యా వస్తావయ్యా", హిందీలో ప్రభుదేవ దర్శకత్వంలో "రామయ్యా వస్తావయ్యా", "డీ-డే" సినిమాల్లోనటించింది. ప్రస్తుతం ఆమె 2020వ సంవత్సరంలో మరోసారి నటుడు రవితేజ తో క్రాక్ అనే సినిమాలో నటిస్తోంది.

వార్తలలో శ్రుతి హాసన్

[మార్చు]

2013 నవంబరు 20 న గుర్తు తెలియని దుండగుడు ఒకడు సినీనటి శ్రుతిహాసన్ ఇంట్లోకి చొరబడేందుకుయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో పరారయ్యాడు. ముంబై బాంద్రా ప్రాంతంలోని ఓ భవంతి ఆరో అంతస్తులో ఉన్న శ్రుతి ఇంటికి ఉదయం 9.30కు వచ్చిన దుండగుడు తొలుత కాలింగ్‌బెల్ మోగించాడు. శ్రుతి తలుపు తీసింది.‘నువ్వు నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు?’ అని దుండగుడు ఆమెను ప్రశ్నించాడు. దీనికి శ్రుతి ‘నువ్వెవరో నాకు తెలియదు’ అని బదులిచ్చింది. దీంతో ఆగంతకుడు ఆమె గొంతుపట్టుకుని లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. శ్రుతి వెంటనే అతన్ని వెనక్కి తోసి తలుపు మూసింది.తర్వాత అతడు పారిపోయాడు. దాడి చేసిన దుండగుడు శ్రుతి నటించిన ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఆమె వెంట పడుతున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.[1]

నటించిన చిత్రాలు

[మార్చు]

తెలుగు

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర విశేషాలు
2011 అనగనగా ఓ ధీరుడు ప్రియ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సౌత్ 2011 - ఉత్తమ నూతన పరిచయం (ఫీమేల్) - తెలుగు,
సినీ"మా" అవార్డ్ 2011 - ఉత్తమ నూతన పరిచయం
2011 ఓ మై ఫ్రెండ్ సిరి చందన
2012 గబ్బర్ సింగ్ భాగ్యలక్ష్మి దక్షిణ భారత అంతర్జాతీయ సినిమా అవార్డ్ (SIIMA) 2013 - ఉత్తమ నటి
2013 బలుపు శ్రుతి
2013 రామయ్యా వస్తావయ్యా అమ్ములు
2014 ఎవడు మంజు
2014 రేసుగుర్రం స్పందన
2014 ఆగడు ప్రత్యేక నృత్యం
2015 శ్రీమంతుడు చారుశీల
2020 క్రాక్ రవితేజ తో రెండవ చిత్రం
2023 వీర సింహా రెడ్డి సంధ్య తెలుగు
వాల్తేరు వీరయ్య శ్రీదేవి తెలుగు

తమిళం

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర విశేషాలు
2000 హే రాం శ్రుతి రాజేష్ పటేల్ అతిథి పాత్ర
2011 7ఆం అరివు శుభా శ్రీనివాసన్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సౌత్ 2011 - ఉత్తమ నూతన పరిచయం (ఫీమేల్) - తమిళం
2012 3 జనని
2014 పూజై చిత్రీకరణ జరుగుతున్నది

హిందీ

[మార్చు]
సంవత్సరం చిత్రం పాత్ర ఇతర విశేషాలు
2000 హే రాం శృతి రాజేష్ పటేల్ అతిథి పాత్ర
2010 లక్ అయేషా,
నటాషా
ద్విపాత్రాభినయం
2011 దిల్ తో బచ్చాహై జీ నిక్కీ అతిథి పాత్ర
2013 రామయ్యా వస్తావయ్యా సోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా హిందీ పునఃనిర్మాణం
2013 డీ-డే సురైయా

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-11-24. Retrieved 2013-11-22.

శ్రుతి హాసన్