వసంత కోకిల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వసంత కోకిల
దర్శకత్వంబాలు మహేంద్ర
రచనబాలు మహేంద్ర
నిర్మాతరాజ్ ఎన్. సిప్పీ
రోము ఎన్. సిప్పీ
తారాగణంకమల్ హాసన్
శ్రీదేవి
సిల్క్ స్మిత
ఛాయాగ్రహణంబాలు మహేంద్ర
కూర్పుడి. వాసు
సంగీతంఇళయరాజా
విడుదల తేదీ
14 అక్టోబర్ 1982
సినిమా నిడివి
141 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

వసంత కోకిల కమల్ హాసన్, శ్రీదేవి నాయికా నయకులుగా బాలు మహేంద్ర దర్శకత్వంలో 1982 లో విడుదలైన తెలుగు చిత్రము.[1] హిందీలో ఇది సద్మా గా 1983 జూలై 8 న విడుదలైనది. ఈ చిత్రంలో తమ నటనకు కమల్ హాసన్, శ్రీదేవి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

లక్ష్మి (శ్రీదేవి) ఆధునిక భావాలు కల యువతి. ఒకసారి కారు నడుపుతుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. కొద్దిరోజులకు తన గత జీవితాన్ని మరిచిపోయి ఆరేళ్ళ బాలిక వలె ప్రవర్తిస్తుంటుంది.ఆసుపత్రి నుండి పారిపోయి ఒక వ్యభిచార గృహానికి చేరుతుంది. అక్కడి నుండి ఆమెను సోము (కమల్ హాసన్) అనే ఒక ఒంటరి ఉపాధ్యాయుడు కాపాడి ఆశ్రయమిస్తాడు. ఆమె రాకతో అతని ఒంటరితనము దూరమౌతుంది. వారిద్దరూ కొద్దికాలంలోనే చాలా దగ్గరవుతారు. ఈ విషయాలన్నీ తెలియని రక్షకభటులు లక్ష్మి కోసం, ఆమెను కిడ్నాప్ చేసిన నేరగాళ్ళ కోసం వెతుకుతుంటారు. కొద్దికాలానికి లక్ష్మికి గతం గుర్తుకువచ్చి తన తల్లితండ్రుల వద్దికు వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో సోము పడే వేదన వర్ణణాతీతం. ఆమెకు తాము కలిసి గడిపిన రోజులను గుర్తు చేయాలని సోము చేసే ప్రయత్నాలన్నీ విఫలమౌతాయి.

తారాగణం

[మార్చు]



సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: బాలూ మహేంద్ర

సంగీతం : ఇళయరాజా, వేలూరి కృష్ణమూర్తి

గీత రచయిత: మైలవరపు గోపి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, రమోలా

పాటలు

[మార్చు]
  1. కథగా కల్పనగా కనిపించెను, రచన: మైలవరపు గోపి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  2. భోజరాజు కాలంలోన, రచన: గోపి , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రమోలా
  3. ఈ లోకం అతి పచ్చన, రచన: గోపి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. మనకోసం వేకువయ్యేను, రచన: గోపి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి బృందం
  5. ఊరించే వయసిది లాలించే , రచన: గోపి, గానం. ఎస్. జానకి

పురస్కారములు

[మార్చు]

(తమిళ మాతృక - మూండ్రాం పిఱై చిత్రానికి) పరిశీలన: కమల హాసన్ జాతీయ ఉత్తమ నటుడు

ఫిల్మ్ ఫేర్ పురస్కారము

[మార్చు]

వనరులు : వసంత కోకిల

మూలాలు

[మార్చు]

2. ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటి లంకెలు

[మార్చు]