సొమ్మొకడిది సోకొకడిది
స్వరూపం
సొమ్మొకడిది సోకొకడిది (1979 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
నిర్మాణం | బి.రాధామనోహరి |
తారాగణం | కమల్ హాసన్ జయసుధ రోజారమణి |
సంగీతం | రాజన్ - నాగేంద్ర |
ఛాయాగ్రహణం | బాలు మహేంద్ర |
కూర్పు | డి.వాసు |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలసుబ్రహ్మణ్య ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 5 జనవరి 1979 |
భాష | తెలుగు |
సొమ్మొకడిది సోకొకడిది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బి.రాధామనోహరి నిర్మాతగా శ్రీబాలసుబ్రహ్మణ్య ఫిలింస్ బ్యానర్‌పై వెలువడిన తెలుగు సినిమా. ఈ సినిమాకు రాజన్ - నాగేంద్రలు సంగీతం సమకూర్చారు. ఈ సినిమా 1979, జనవరి 5వ తేదీన విడుదలయ్యింది. ఈ సినిమాలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా తమిళ భాషలో ఇరు నిలవుగళ్ అనే పేరుతో, మలయాళ భాషలో జీవిక్కాన్ పదిక్కనం అనే పేరుతో డబ్ చేయబడింది. హిందీలో హమ్ దోనో అనే పేరుతో, కన్నడలో గడిబిడి కృష్ణ పేరుతో పునర్మించబడింది.
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్
- జయసుధ
- రోజారమణి
- కాంతారావు
- ప్రభాకర్‌రెడ్డి
- రావి కొండలరావు
- సారథి
- ఆనంద్ మోహన్
- పండరీబాయి
- జయ
- అత్తిలి లక్ష్మి
- సుధ
- లక్ష్మీకాంతమ్మ
- రమాప్రభ
- రాధాకుమారి
- సి.ఎస్.రావు
- కె.రాధాస్వామి
- మోదుకూరి సత్యం
- చిడతల అప్పారావు
- కె.కె.శర్మ
- చలపతిరావు
- పొట్టి ప్రసాద్
సాంకేతికవర్గం
[మార్చు]- కథ: ఎస్.ఎల్.కల్యాణి
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
- మాటలు: జంధ్యాల
- ఛాయాగ్రహణం: బాలు మహేంద్ర
- సంగీతం: రాజన్-నాగేంద్ర
- నృత్యం: రఘు - గిరిజ, శివ సుబ్రహ్మణ్యం
పాటలు
[మార్చు]- అబ్బో నేరేడుపళ్ళు అబ్బాయి కళ్ళు అల్లో నేరేడు పళ్ళు - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఆ పొన్ననీడలో ఈ కన్నెవాడలోవున్నావేచివున్నా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల
- ఆకాశం నీ హద్దురా అవకాశం వదలద్దురా పరువాల - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఓ బాలరాజా ప్రేమే ఎరుగవా అందమైన ఆడపిల్ల చెంతచేరి - పి.సుశీల
- తొలివలపు తొందరలు ఉసిగొలిపే తెమ్మెరలు - ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం