త్రిమతాలు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
హిందూమతంలో దక్షిణ భారతదేశంలో భగవంతుని గురించి మూడు ముఖ్యమైన సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. వాటిని త్రిమతాలు అంటారు. ఆయా మతాలను ప్రతిపాదించిన ఆచార్యులను త్రిమతాచార్యులు అంటారు.
పై పట్టికలో అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము అనే పదాలను సిద్ధాంతాలకూ; స్మార్తం, వైష్ణవం, మధ్వం అనే పదాలను ఆచారాలకూ ఎక్కువగా వాడుతారు.
మూడు సిద్ధాంతాలకు మౌలిక కారణాలు
[మార్చు]వేదముల ఉత్తరభాగము ఆధారముగా వెలువడినది ఉత్తరమీమాంసా దర్శనము. దీనినే వేదాంత దర్శనమనీ, బ్రహ్మసూత్రములనీ అంటారు. ఇది వేదముల చివరి భాగమైన ఉపనిషత్తులనుండి ఉద్భవించింది. ఈ దర్శనము జీవాత్మకు, పరమాత్మకు గల సంబంధమును ప్రతిపాదించును. వ్యాస మహర్షి రచించిన బ్రహ్మసూత్రములను వేర్వేరు భాష్యకారులు వ్యాఖ్యానించిన విధముపై వేర్వేరు శాఖాభేదములు ఏర్పడినవి. ఆ విధంగా అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము - అనే మూడు ప్రముఖమైన సిద్ధాంతములు ఏర్పడినవి. మూడు ఆరాధనా మార్గములకూ ప్రబలమైన సాహిత్యమూ, సంప్రదాయమూ ఉన్నాయి. వాటికి అంకితమైన భక్తజనం కూడా అశేషంగా ఉన్నారు.
ఇక్కడ గుర్తించవలసిన విషయమేమంటే మూడు సిద్ధాంతాలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, బ్రహ్మసూత్రాలనూ ప్రమాణంగా అంగీకరిస్తాయి. ముగ్గురు సిద్ధాంతకర్తలూ అసాధారణ పండితులు. తమ భాష్యాలతోనూ, వాదాలతోనూ సమకాలీన పండితులను మెప్పించి, ప్రతివాదులను ఓడించి తమ సిద్ధాంతములకు గుర్తింపు, మన్నన సాధించారు. వారికి రాజులనుంచి లభించిన ఆదరణ అంతంతమాత్రమే. కనుక ఈ మూడు సిద్ధాంతాల ప్రావిర్భావమూ హిందూమతంలో సత్యశోధనకూ, పాండిత్యానికీ ఉన్న గుర్తింపుగా అంగీకరించవలసి ఉంది. మూడు తత్వములకూ ఉన్నతమైన గురు పరంపర, సుసంపన్నమైన సాహితీసంప్రదాయము, దృఢమైన ఆచారములు ఉన్నాయి.
(ఇక్కడ ఒక్కొక్క సిద్దాంతము గురించి క్లుప్తముగా ఇవ్వబడింది. మరిన్ని వివరాలకు ఆయా ప్రత్యేక వ్యాసములు చూడవచ్చును)
ఇది ఆదిశంకరులుగా ప్రసిద్ధులైన శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన సిద్ధాంతము.మూడింటిలోను మొదటిది. హిందూమతముపై అత్యంత ప్రభావము కలిగిన ఆలోచనామార్గములలో ఇది ఒకటి.
బ్రహ్మమొకటే సత్యము. మిగిలినదంతా మిధ్య. జీవాత్మకు, పరమాత్మకు (బ్రహ్మమునకు) భేదము లేదు. అలాగే అందరి లోని ఆత్మ బ్రహ్మ మయమే. మాయవలన అజ్ఙానము, దానివలన భేదభావము కలుగుచున్నవి. త్రాడును చూచి పాము అనుకొన్నవానికి భయము కలుగును. అది తాడు అని తెలియగానే భయము తొలగిపోవును. అలాగే జ్ఞానము వల్ల మాయను అధిగమించి, మోక్షము పొందుట సాధ్యము.
ఇది రామానుజాచార్యులు ప్రతిపాదించిన మార్గము. నిత్యానపాయినియై, నారాయణునితో సదా కలసి ఉండే లక్ష్మీదేవికి వారిచ్చిన ప్రాధాన్యత వల్ల ఈ సిద్ధాంతమును శ్రీవైష్ణవమని అంటారు. నారాయణారాధనలో కులవివక్షతను పూర్తిగా త్రోసిపుచ్చిన మార్గమిది.
జీవుడు, ప్రకృతి, ఈశ్వరుడు - మూడూ సత్యములని విశిష్టాద్వైతము అంగీకరిస్తున్నది. 'చిత్' అనబడే జీవునితోను, 'అచిత్' అనబడే ప్రకృతితోను కూడియే ఈశ్వరుడుండును. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉండును. ఆజ్ఞానవశమున జీవుల సంసారబంధమున చిక్కుకొందురు. భగవదనుగ్రహమువలన, సద్గురుకృప వలన, భగవంతునకు శరణాగతులైనవారు అజ్ఞానమునుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందుదురు. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.
ఇది మధ్వాచార్యులు (ఆనందతీర్ధులు) ప్రతిపాదించిన తత్వము. మూడింటిలో చివరిది. పై రెండు సిద్ధాంతములనూ క్షుణ్ణముగా అధ్యయనం చేసిన తరువాత ప్రతిపాదింపబడింది.
జీవుడు, జగత్తు, దేవుడు - ఈ మూడూ వేరు వేరనీ, వాటి మధ్య భేదం ఎప్పుడూ ఉంటుందని ప్రతిపాదించింది. సకల కల్యాణ గుణ సచ్చిదానంద మూర్తియైన శ్రీమహావిష్ణువే సమస్తమునకు ఆధారము. వారివారి గుణకర్మలననుసరించి జీవులు తమోయోగ్యులు, నిత్య సంసారులు, ముక్తియోగ్యులు అను మూడు విధములు. దేవునకు, జీవునకు గల సంబంధము యజమానికి, దాసునకు మధ్య గల సంబంధము వంటిది.
వనరులు
[మార్చు]- హిందూ ధర్మ పరిచయము, స్తోత్ర మంజరి" - రచన: శిరోమణి సముద్రాల లక్ష్మణయ్య, విద్వాన్ ముదివర్తి కొండమాచార్యులు - తిరుమల తిరుపతి దేవస్థానములు వారి ప్రచురణ