సప్తమాతృకలు
ప్రాచీన ఆలయాలను దర్శించినప్పుడు వరుసగా 7 గురు దేవతా మూర్తుల శిలా రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకే వేదికపై గానీ .. గోడపై శిలా చిత్రాలుగా గాని 7 గురు దేవతా మూర్తుల రూపాలు పద్మాసనంతో దర్శనమిస్తుంటాయి. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఈ అమ్మవార్లనే 'సప్త మాతృకలు' అంటారు.
సృష్టి చాలకుడు పరమాత్మ అయితే, అయన చాలన శక్తి ఆ పరమేశ్వరి . పురుష రూపంలో ఆమె బ్రహ్మ , విష్ణు , మహేశ్వర , ఇంద్రాది రూపాలను పొందితే, వారి శక్తి స్వరూపమైన దేవి సప్తమాతృకలుగా ఆవిర్భవించింది . నిజానికి సర్వదేవతలూ ఈ శక్తి స్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.శుంభునిశుంభాది అసురులను అమ్మవారు సంహరిస్తున్న సమయంలో, భయంకరమైన అసుర సేనల్ని నిర్మూలించడానికే బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్లుగా 'దేవీ మహాత్మ్యం' వర్ణించింది.
అంధకాసురుడి సంహారంలోనూ పరమశివుడికి 'సప్తమాతృకలు' సహకరించారని పురాణాలు చెబుతున్నాయి.
- బ్రాహ్మి
- ఇంద్రాణి
- కౌమారి
- వైష్ణవి
- వారాహి
- మాహేశ్వరి
- చాముండి
- బ్రహ్మాణి: ఈ మాతృమూతి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.
- ఐంద్రీ: ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.
- కౌమారి: కుమారస్వామి శక్తి. శక్తి (బల్లెం) హస్త. మయూర వాహనారూఢ.
- వైష్ణవి: విష్ణుశక్తి. శ్రిమాహావిష్ణువువలె గరుడవాహన్నని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.
- వారాహి: హరి అవరారమైన యజ్ఞవరహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.
- నారసిమ్హి: విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి. సింహముఖంతో, నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.
- మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.
బయటి లింకులు, మూలాలు
[మార్చు]- https://www.hithokthi.com/viewstotra.php?g_id=15&cat_id=22&story_id=13301
- https://telugupatham.blogspot.com/2020/11/blog-post_21.html
- https://www.ap7am.com/bhakti-article-4130