పంచాగ్నులు
Jump to navigation
Jump to search
వివిధ కావ్యాలలోను, పురాణాలలోను చెప్పబడిన ఐదు అగ్నులు పంచాగ్నులు అనబడుతాయి. అగ్ని పురాణములో చెప్పబడిన అగ్నులు ఇవి
- బడబాగ్ని - ఇది సముద్రంలో ఉంటుంది. బడబాగ్నినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు.
- జఠరాగ్ని - ఇది జీవుల ఉదరంలో ఉండి ఆహారమును జీర్ణింపచేస్తుంది.
- కాష్టాగ్ని లేదా దావానలము - ఇది ఎండు కఱ్ఱల రాపిడి వలన పుట్టి హోమములు మొదలగువానియందు ఉపయుక్త మగుచున్నది.
- వజ్రాగ్ని - ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉంటుంది.
- సూర్యాగ్ని - ఇది ఆదిత్యునియందు ఉంటుంది.
ఇంకా కొన్ని సందర్భాలలో ప్రస్తావింపబడే అగ్నులు
- ఆత్మలో రగిలే జ్ఞానాగ్ని
- పాదాల్లో కాలాగ్ని
- కడుపులో క్షుధాగ్ని
- హృదయంలో శీతాగ్ని
- నేత్రాల్లో క్రోధాగ్ని
మూలాలు, వనరులు
[మార్చు]- అష్టాదశ పురాణములు - (18 పురాణముల సారాంశం) - రచన: బ్రహ్మశ్రీ వాడ్రేవు శేషగిరిరావు - ప్రచురణ, సోమనాథ్ పబ్లిషర్స్, రాజమండ్రి (2007)