త్రయోదశి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. అధి దేవత - మన్మధుడు.

త్రయోదశి వ్రతం

[మార్చు]
  • త్రయోదశి వ్రతం శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశి గాని; లేదా 24 శుక్ల పక్ష త్రయోదశులు గాని ఎన్నుకొని నియమబద్ధంగా త్రయోదశి వ్రతాచరణ చేయవచ్చును. ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం విధులు. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి.
  • శని త్రయోదశి అనగా శనివారం + త్రయోదశి కలిసిన రోజు. దీనిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు.

త్రయోదశీ నిర్ణయం

[మార్చు]

ధర్మ సింధు[1] ప్రకారం త్రయోదశికి శుక్ల పక్షంలో పూర్వదినాన్ని, కృష్ణ పక్షంలో పరదినాన్ని గ్రహించాలి.

పండుగలు

[మార్చు]
  1. చైత్ర శుద్ధ త్రయోదశి - కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూడు రోజుల వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం.
  2. ఆశ్వయుజ బహుళ త్రయోదశి - ధన త్రయోదశి
  3. ప్రదోషం.

మూలాలు

[మార్చు]
  1. త్రయోదశీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 60.
"https://te.wikipedia.org/w/index.php?title=త్రయోదశి&oldid=3892296" నుండి వెలికితీశారు