మాండూక్యోపనిషత్తు
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
మండూక మహర్షి ప్రోక్తమైనందున దీనిని మాండూక్యోపనిషత్తు అంటారు. ఇది అథర్వ వేదానికి చెందినది. ఆన్నిటికన్నా చిన్నదైన ఈ ఉపనిషత్తులో 12 మంత్రాలు మాత్రమే ఉన్నాయి. అయినా మొత్తం ఉపనిషత్తుల సారం ఇందులో నిక్షిప్తమై ఉంది. శంకరాచార్యుడు దీనికి విస్తృత భాష్యం రచించి, తన అద్వైత సిద్ధాంతానికి ఆధారంగా చేసుకున్నాడు. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "అయమాత్మా బ్రహ్మ" అనేది ఈ ఉపనిషత్తులోనే ఉంది.
శాంతి మంత్రం
[మార్చు]ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్ం సస్తనూభిః| వ్యశేమ దేవహితం యదాయుః |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవాః| స్వస్తి నః పూషా విశ్వావేదాః |
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమిః| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు||
- ఆర్థం
- ఈ శాంతి మంత్రం యొక్క భావము సమున్నతమైనది, ఇది భారత దేశము యొక్క సనాతన ధర్మం యొక్క అవున్నత్యాన్ని చాటి చెప్పుతుంది అంటే అతి శాయోక్తి కాదు. ఈ పద్యం యొక్క ఆర్థము,
- ఓ దేవతలారా! మా చెవులు ఎల్లవేళలా శుభమైన దానినే వినెదముగాక! మా నేత్రములు సర్వ కాల సర్వావస్థల యందు శుభప్రదమగు దానినే దర్శించెదము (చూచేదము) గాక ! మేము ఎల్లప్పుడూ మాకు ప్రసాదించిన ఆయుష్యు, దేహము, అవయవములతో మిమ్ములను సదా స్తుతించు చుందుము కనుక మాకు మంచి ఆయుష్యు, దేహ ధారుడ్యము, మంచి అవయవ సౌష్టవము శక్తి ని ప్రసాదించుము. ఆది కాలము నుంచి మహర్షులు, ఋషులచే స్తుతించబడిన ఇంద్రుడు మాకు శుభములు జేకూర్చుగాక ! సర్వజ్ఞుడు ప్రత్యక్ష దేవుడైన సూర్యుడు మాకు శుభమును కలుగ జేయుగాక ! ఆపదలనుండి మమ్ములను గరుత్మంతుడు రక్షించి మాకు శుభమును అనుగ్రహించుగాక ! బృహస్పతి మాకు ఆధ్యాత్మిక ఐశ్వర్యమును కల్పించి సదా మాకు శుభమును ప్రసాదించుగాక !
- ఆర్థం
ఓం శాంతిః శాంతిః శాంతిః
- ఆర్థం
- మాకు తాపత్రయముల నుండి విముక్తి, శాంతి కలుగు గాక. తాపత్రయములు అనగా "మూడు తాపములు" అని ఆర్థము. అవి ఆది దైవిక తాపము, ఆది బౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము. ఈ మూడు తపముల నుండి మాకు శాంతి కలుగు గాక అని మూడు శాంతి మాత్రముల ఆర్థము.
- ఆర్థం
పూర్తి మంత్రపాఠం
[మార్చు]- ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం
- భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ
- యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోoకార ఏవ ||1||
- అర్థం
- ఈ లోకం ఏవత్తూ ఓంకారమే. ఓంకార వివరణ గమనిద్దాం. గతించినవీ, ఉన్నవీ, రాబోయేవీ అన్నీ ఓంకారమే. మూడుకాలాలకూ అతీతమైనది ఏముందో అది కూడా ఓంకారమే.
- సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సో2యమాత్మా చతుష్పాత్ ||2||
- ఇవన్నీ భగవంతుడే. ఆ ఆత్మ కూడా భగవంతుడే. ఈ ఆత్మ నాలుగు పరిమాణాలు గలది.
- సర్వం హ్యేతద్ బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ సో2యమాత్మా చతుష్పాత్ ||2||
- జాగరిత స్థానో బహిః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
- స్థూలభుగ్ వైశ్వానరః ప్రథమః పాదః ||3||
- అర్థం
- ఆత్మలో మొదటి పరిమాణం వైశ్వానరుడు అనబడుతున్నాడు. ఈ వైశ్వానరుడి చైతన్యం బాహ్యముఖంగా ఉంది. 7 అవయవాలు, 19 నోళ్ళుగల వైశ్వానరుడు జాగ్రదావస్థలో బాహ్యజగత్తును అనుభవిస్తాడు.
- స్వప్నః స్థానో2న్తః ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతి ముఖః
- ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః ||4||
- అర్థం
- ఆత్మయొక్క రెండవ పరిమాణం తైజసుడు అనబడుతున్నాడు. దీని చేతన అంతర్ముఖమైనది. 7 అవయవాలు, 19 నోళ్ళు గల తైజసుడు స్వప్నావస్థలో మానసిక లోకాన్ని అనుభవిస్తాడు.
- యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం
- పశ్యతి తత్ సుషుప్తమ్| సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన
- ఏవానందమయో హ్యానందభుక్ చేతోముఖః ప్రాజ్ఞస్తృతీయః పాదః ||5||
- అర్థం
- కోర్కెలు, కలలు ఏదీలేని గాఢనిద్రాస్థితి ఆత్మయొక్క మూడవ పరిమాణమవుతుంది. ఈ స్థితి అనుభవించేవాడు ప్రాజ్ఞుడు. ఈ స్థితిలో అనుభవాలు ఏవీ ఉండవు. గ్రహణశక్తి బహిర్గతమై ఒక రాశిగా ఉంటుంది. అందువలన ఇది జాగ్రత్, స్వప్న స్థితి చేతనలకు ద్వారంగా ఉంది. ఆనంద స్వరూపుడైన ప్రాజ్ఞుడు ఇక్కడ ఆనందాన్ని అనుభవిస్తాడు.
- ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో2న్తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ||6||
- అర్థం
- ఇతడే సర్వేశ్వరుడు. ఇతడే సర్వమూ తెలిసినవాడు. ఇతడే అన్ని ప్రాణుల లోపల కొలువై నడిపిస్తున్నాడు. సమస్తానికీ మూల కారణం ఇతడే. ప్రాణుల ఉత్పత్తికి, వినాశనానికీ కూడా ఇతడే
- ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో2న్తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ||6||
- నాన్తః ప్రజ్ఞమ్ న బహిః ప్రజ్ఞమ్ నోభయతః ప్రజ్ఞమ్ న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞమ్ నా ప్రజ్ఞమ్
- అదృష్టమ్ అవ్యవహార్యమ్ అగ్రాహ్యమ్ అలక్షణమ్ అచిన్త్యమ్ అవ్యపదేశ్యమ్
- ఏకాత్మప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యన్తే స ఆత్మా స విజ్ఞేయః ||7||
- 5
- అర్థం
- నాలుగవ పరిమాణం. అది అంతర్ముఖ స్థితి కాదు. బహిర్ముఖ స్థితి కాదు. రెండూ చేరిన స్థితి కాదు. అది చైతన్యం సమకూరిన స్థితి కాదు. అది కనిపించదు. చేతలులేని, గ్రహించశక్యం కాని, గుర్తులు లేని, ఊహాతీతమైన, వర్ణనాతీతమైన స్థితి అది. దాన్ని ఆత్మ చైతన్యంగా మాత్రమే తెలుసుకోగలం. అక్కడ ప్రాపంచిక చైతన్యం లేదు. అది ప్రశాంతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఇదే నాలుగవ పరిమాణం. ఇదే ఆత్మ. దీన్నే తెలుసుకోవాలి.
- 5
- సో2యమాత్మా2ధ్యక్షరమ్ ఓంకారో2ధిమాత్రం పాదా
- మాత్రా మాత్రాశ్చ పాదా అకార ఉకారో మకార ఇతి ||8||
- అర్థం
- ఈ ఆత్మను శబ్దపరంగా చెప్పాలంటే అదే ఓంకారం. అక్షరాలలో అ; ఉ; మ అనే మూడు అక్షరాలతో ఓం రూపొందింది.
- జాగరితస్థానో వైశ్వానరో2కారః ప్రథమా మాత్రా ఆప్తేరాదిమత్వాద్ వా
- ఆప్నోతి హ వై సర్వాన్ కామానాదిశ్చ భవతి య ఏవం వేద ||9||
- అర్థం
- ఓంకార మంత్రం మొదటి భాగమైన అకారం జాగ్రదావస్థ పరిమాణమైన వైశ్వానరునితో పోల్చబడుతుంది. వ్యాపకత్వంచేత, ఆరంభత్వంవల్ల ఈ రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా ఉపాసన చేసినవారి అన్ని కోర్కెలు ఈడేరుతాయి. అట్టి ఉపాసకుడు ధన కనక వస్తు వాహనాదులతో అగ్రగణ్యుడౌతాడు.
- స్వప్నస్థానస్తైజస ఉకారో ద్వితీయా మాత్రా ఉత్కర్షాదుభయత్వాద్ వా ఉత్కర్షతి
- హ వై జ్ఞానసన్తతిం సమానశ్చ భవతి నాస్యాబ్రహ్మవిత్ కులేభవతి య ఏవం వేద ||10||
- అర్థం
- ఓంకార మంత్ర రెండవ భాగమైన ఉకారం స్వప్నావస్థను ఆధారంగా చేసుకున్న తైజసుడు. ఎందుకంటే శ్రేష్ఠత్వంచేత, రెండింటి సంబంధంచేత రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు నిశ్చయంగా జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. సుఖ-దుఃఖాలవంటి ద్వంద్వాలలో సమతుల్యంతో వ్యవహరిస్తాడు. జ్ఞానికానివారు ఎవరూ అతని వంశంలో జన్మించరు.
- సుషుప్తస్థానః ప్రాజ్ఞో మకారస్తృతీయా మాత్రా మితేరపీతేర్వా మినోతి
- హ వా ఇదం హ వాఇదం సర్వమపీతశ్చ భవతి య ఏవం వేద ||11||
- అర్థం
- ఓంకార మంత్రం మూడవ భాగమైన మకారం సుషుప్తిని ఆధారంగా చేసుకున్న ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలతవేసే స్వభావంచేతా, గ్రహించే స్వభావంచేతా రెండూ సమానంగా ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్నీ కొలతవేసేవాడుగా గ్రహించేవాడుగా అవుతాడు.
- అమాత్రశ్చతుర్థో2వ్యవహార్యః ప్రపంచోపశమః శివో2ద్వైత ఏవమోంకార ఆత్మైవ
- సంవిశత్యాత్మనా22త్మానం య ఏవం వేద య ఏవం వేద ||12||
- అర్థం
- ఓంకార మంత్రంలో నాలుగవ భాగం, భాగమని చెప్పలేనిది. నిర్వికారమైనది, ప్రాపంచిక చైతన్యానికి అతీతమైనది. మంగళకరమైనది. అద్వైతం. ఈ ఓంకారమే ఆత్మ. ఈ విధంగా తెలుసుకున్నవాడు ఆత్మను ఆత్మ చేత పొందుతాడు.
సారాంశం
[మార్చు]ఈ సమస్త జగత్తు ఓంకారమే. భూత భవిష్యద్వర్తమానాలు కూడా ఓంకారమే. ఈ త్రికాలాలకు అతీతమైనది ఏదైనా ఉంటే అది కూడా ఓంకారమే. ఈ జగత్తుకు, దానికి అతీతమైన పరమ సత్యానికి, అన్నిటికి ఓంకారం శబ్ద రూపమైన ప్రతీక. ఈ ఓంకారం దేనికైతే ప్రతీకగా ఉన్నదో అదే బ్రహ్మం. ప్రతీ జీవుడిలో ఉన్న ఆత్మయే బ్రహ్మం.