Jump to content

జాతకర్మ

వికీపీడియా నుండి

జాతకర్మ హిందూమతంలోని ప్రధాన సంస్కారాలలో ఒకటి. ఇది శిశువు పుట్టినపుడు జరిపే వేడుకను జరుపుకునే విధానం గురించి చెబుతుంది. [1] తల్లిదండ్రులు, శిశువు బంధువులు, సన్నిహితులూ జరుపుకునే వేడుక.

వ్యుత్పత్తి

[మార్చు]

జాతకర్మ అనేది జాత, కర్మ అనే మూలాలతో ఏర్పడిన మిశ్రమ సంస్కృత పదం. జాత అనే పదానికి "పుట్టిన, పుట్టింది, ఉద్భవించింది, ఏర్పడింది, కనిపించింది" అని అర్థం. [2] కర్మ అనే పదానికి అర్థం "చర్య, విధి, ఆచారం, సాధన" అని. [3] రెంటినీ కలిపిన జాతకర్మ అంటే "పుట్టినప్పుడు జరిపే ఆచారం" లేదా "జన్మ వేడుక" అని అర్థం. [4] [5]

వివరణ

[మార్చు]

జాతకర్మ అనేది హిందూ మత ప్రాచీన గ్రంథాలలో నవజాత శిశువుకు జరిపే మొదటి ఆచారం. శిశువు పుట్టుకతో పాటు, తండ్రికి బిడ్డతో ఉన్న బంధాన్ని ఈ వేడుకలో జరుపుకుంటారు. [6] జాతకర్మ ఆచారం సమయంలో తండ్రి, తేనె, నేతితో శిశువు పెదవులను తాకించి శిశువును ప్రేమగా స్వాగతిస్తాడు. కొన్నిసార్లు, వేద శ్లోకాలను పఠిస్తారు. స్తోత్రాల మొదటి భాగం గృహసూత్ర గ్రంథాలలో తల్లి కడుపులో శిశువు శరీరం రూపుదిద్దుకున్న తర్వాత ఏర్పడే శిశువు బుద్ధి వికాసాన్ని- మేధాజననం - వివరిస్తుంది. శ్లోకాల రెండవ భాగం శిశువు దీర్ఘాయువును కోరుకుంటుంది. [6]

మూలాలు

[మార్చు]
  1. Pandey (1992). Hindu samskaras: socio-religious study of the Hindu sacraments. Motilal Banarsidass. pp. 70–77. ISBN 978-81-208-0396-1.
  2. jAta, Monier Williams Sanskrit–English Dictionary, (2008 revision), Cologne Digital Sanskrit Lexicon, Germany
  3. karman, Monier Williams Sanskrit–English Dictionary, (2008 revision), Cologne Digital Sanskrit Lexicon, Germany
  4. jAtakarman, Monier Williams Sanskrit–English Dictionary, (2008 revision), Cologne Digital Sanskrit Lexicon, Germany
  5. jAtakarman Apte Sanskrit English Dictionary, University of Chicago
  6. 6.0 6.1 Kathy Jackson (2005), Rituals and Patterns in Children's Lives, University of Wisconsin Press, ISBN 978-0299208301, page 46
"https://te.wikipedia.org/w/index.php?title=జాతకర్మ&oldid=3691926" నుండి వెలికితీశారు