ఛాందోగ్యోపనిషత్తు
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |
ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. ఉపనిషత్తులన్నిటిలోకి ప్రాచీనమైనదని కొందరి అభిపాయం. నాలుగు మహా వాక్యాలలో ఒకటైన "తత్వమసి" ఈ ఉపనిషత్తులోనిదే. ఎనిమిది అధ్యాయాలకు విస్తరించిన ఈ ఉపనిషత్తులో దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుఖని గురించి, వైచిత్రవీర్యుడైన ధృతరాష్ట్రుని గురించి ప్రస్తావించబడింది. ఇందు 8అధ్యాయములు ఉన్నాయి. మొదటి రెండవాధ్యాయములలోను సామమును గురుంచి చెప్పబడియున్నది. ఓంకారోత్పత్తిని గురుంచియు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రమ ధర్మముల గురుంచియు చెప్పబడియున్నది. యతి విధులనుగూర్చియు జెప్పబడియున్నది.మూడవ అధ్యాయముయందు అచ్యుతుడగు బ్రహ్మ మానవుని హృదయమందు నివసించునని చెప్పబడియున్నది. బ్రహ్మ సాక్షాత్కారమునకు జీవాత్మ పరమాత్మల ఐకత్యమునకు జ్ఞానమే కారణము అని చెప్పబడింది. నాల్గవ అధ్యాయమునందు ప్రాణవాయువు మొదలైన వాటి గురుంచియు ఆత్మబ్రహ్మను చేరు విధములగూర్చియు చెప్పబడియున్నది. ఈ ఉపనిషత్తునందే "బ్రహ్మ సత్యం జగన్మిధ్య" అని తొలుత ఘోషించడము జరిగింది. సత్తునుండి పంచ భూతములు జన్మించెనవి. జీవాత్మ ఈపంచ భూతములలో బ్రవేశించింది. ఆసత్తే సత్యమైనది. జీవాత్మ త్రివిధావస్థలలో నుండును, అనగ జాగ్రత్, స్వప్నా, సుషుప్తావస్థలలో నుండును.