Jump to content

2025 ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా

అక్షాంశ రేఖాంశాలు: 26°25′52″N 82°53′06″E / 26.431°N 82.885°E / 26.431; 82.885
వికీపీడియా నుండి
2025 మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్ ఉత్తరప్రదేశ్
Native name మహా కుంభమేళా
English nameMHA KUMBA MELA-2025
Date13 జనవరి – 26 ఫిబ్రవరి 2025 (2025-01-13 – 2025-02-26)
Duration45 రోజులు
Venueత్రివేణి సంగమం
Locationప్రయాగ్ రాజ్
Coordinates26°25′52″N 82°53′06″E / 26.431°N 82.885°E / 26.431; 82.885
Also known as(2025 माहाकुंभ मेला प्रयोगराज) మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్
Typeసామాజిక పద్ధతులు
Themeపండుగ కార్యక్రమాలు
Causeఆచారాలు (Rituals)
Patronsసన్యాసులు, బ్రహ్మచారులు, సాధువులు,సాధ్వి లు, భక్తులు, యాత్రికులు.
Organised byప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అథారిటీ
Websitehttps://locator.esri.in/
UNESCO ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్

భారతదేశంలోని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్, ప్రయాగ్ రాజ్ జిల్లాలో, గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద జరుగుతుంది. ఇది 144 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది.[1]ఈ సమ్మేళనం భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ప్రపంచంలోనే అతి పెద్ద కుంభమేళా కావడంతో దీనిని మహా కుంభమేళా అని నామకరణం చేశారు. ఈ కుంభమేళ 45 రోజుల పాటు సాగనుంది[2][3][4].

చరిత్ర

[మార్చు]

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు[5].ఇది ఆధునికతకు, స్వేచ్ఛతకు, భద్రతకు గొప్ప ఉదాహరణమని అన్నారు. గంగ, యమున, సరస్వతి నదుల కలసే త్రివేణి సంగమం అత్యంత పుణ్య ప్రదేశంగా గుర్తించబడింది. ఆత్మను శుద్ధ చేసి పాపాలను కడిగేస్తుందని భక్తుల నమ్మకం. అందుకే కుంభమేళా సమయంలో భక్తులు పెద్దసంఖ్యలో హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ‌ఈ మహా కుంభమేళాకు పూర్తి ఏర్పాటు చేసింది[6]. ఈ మహా కుంభమేళా మొత్తం 45‌ రోజుల పాటు త్రివేణి సంగమంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకొని సోమవారం రోజున తొలి పుణ్యస్నానాలతో ఈ మహా క్రతువుకు యోగి సర్కార్ శ్రీకారం చుట్టింది. దేశ విదేశాల నుంచి సుమారు 35 కోట్లు భక్తులు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. మహా కుంభమేళా ఏర్పాటును క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి యోగి, ఉన్నత అధికారులు పరిశీలించనున్నారు.

మహా కుంభమేళా కాలం

[మార్చు]

ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద జరుగుతున్న మహా కుంభమేళా 2025 పుష్య మాసం పౌర్ణమి తిథినాడు అనగా 2025 జనవరి 13న ప్రారంభించారు.2025 ఫిబ్రవరి 26 వరకు అనగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముగుస్తుంది. ఈ మహా కుంభమేళా 12 కుంభమేళా చక్రాల పూర్తిని సూచిస్తుంది.ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే సాధు సన్యాసుల సమ్మేళనం. సుమారు నాలుగు మిలియన్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. కుంభమేళా ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ మొదలగు నాలుగు ప్రదేశాలలో 12 ఏళ్ళకు ఒకసారి నిర్వహించే హిందూ ఆచార వ్యవహారాలను కార్యక్రమము.ఈ కుంభమేళా జరిగే స్థలాలను జ్యోతిష్యం ప్రకారం నిర్ణయంచబడుతుంది[7].

కుంభమేళా విశేషాలు

[మార్చు]

ఈ మహా కుంభమేళాను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, సురక్షితంగా డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. మహా కుంభమేళాలో ముఖ్యంగా ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ అధికారులు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే ప్రయాగ్ రాజ్ పరిసర ప్రాంతాలలో దాదాపు 3 లక్షల మొక్కలు నాటారు. కుంభమేళా పూర్తి అయిన తర్వాత కూడా ఆ మొక్కులను పరిరక్షిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాగ్ రాజ్ లో పర్యాటించి ₹= 5,5000 కోట్లు విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. త్రివేణి సంగమం వద్ద 35 శాశ్వత ఘాట్ లతో పాటు కొత్తగా 8‌ ఘాట్లును కూడా నిర్మిస్తున్నారు. ఈ మహా కుంభమేళాలో తొలి సారిగా భక్తుల కోసం తెలుగు, హిందీ, ఇంగ్లీషుభాషతో సహా దేశంలోని 11 భాషల్లో ఏఐ చాట్ బాట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మహా కుంభమేళాలో విశేషాలతో పాటు చరిత్ర, పూజలు, ప్రయాణం విడిది సౌకర్యాల వివరాలను ఉచితంగా తెలుసుకునేందుకు ఏఐ చాట్ బాట్ లను ఏర్పాటు చేశారు[8].

మహా కుంభమేళా అద్భుతాలు

[మార్చు]
  • ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమావేశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమావేశంగా ప్రసిద్ధిగాంచింది.ఇందులో 2925 లో 100 మిలియన్లకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న మహా కుంభమేళాలో గంగ, యమున, సరస్వతి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి మన దేశంతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో హాజరై గంగలో పుణ్యస్నానాలు ఆచరించి హిందూ మతము యొక్క గొప్పతనాన్ని చాటుతున్నారు.

  • చారిత్రక ప్రాధాన్యత

ఈ మహా కుంభమేళాలో యొక్క మూలాలు పురాతన హిందూ గ్రంధాల నుండి ‌వేల ఏళ్ల చరిత్ర కలిగినది. ఇది సముద్ర మంథన్ యొక్క పౌరాణిక కథలో లోతుగా పాతుకుపోయింది. ఇక్కడ అమరత్వం యొక్క అమృతం యొక్క చుక్కలు నాలుగు ప్రదేశాలు అనగా ప్రయాగ్ రాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో పడ్డాయి.

• పవిత్రమైన సంగమం త్రివేణి సంగమంలో చాలా పవిత్రమైనది. ఇది మూడు నదులు గంగ, యమున సరస్వతి నదుల కలయిక. పవిత్రమైన కాలంలో ఈ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తే అన్ని పాపాలు తొలగిపోయి మోక్షము లభిస్తుందని హిందూ భక్తులు నమ్మకము.

• జ్యోతిష్య సంబంధం ఈ మహా కుంభమేళా సమయం జ్యోతిష్య అమెరికాల ద్వారా నిర్ణయించబడుతుంది ‌. బృహస్పతి కుంభం లోని వెళ్ళినపుడు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు అప్పుడే ఈ అద్భుతమైన సంఘటనలు చోటు చేసుకుంటోంది. ఈ ఖగోళ శాస్త్రం ప్రకారం ఖగోళ కలయిక హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

• ఆధ్యాత్మిక వైవిధ్యం

ఈ మహా కుంభమేళాలో నాగ సాధువులు సన్యాసులు నుండి వైష్ణవులు, శైవుల వరకు ఆధ్యాత్మిక అభ్యాసాలు, శాఖల యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని ఒక‌ చోట చేర్చింది. ప్రతి సమూహం యొక్క శక్తివంతమైన ఆధ్యాత్మిక చిత్రణకు దోహదం చేస్తుంది.

• తాత్కాలిక మెగా సిటీ

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా తాత్కాలిక మెగా సిటీ గా మారుతోంది. లక్షల మంది సందర్శకులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు, ఈ వేదికలో పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతతో సహా విస్త్రుతమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాలు ఏర్పాటు కృషి చేస్తుంది.

• సాంస్కృతిక మహోత్సవం

మతపరమైన ప్రాముఖ్యత , సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులు రంగు రంగుల ఊరేగింపులు, సాంప్రదాయ సంగీతము, నృత్యాలు, భక్తి భావం ప్రదర్శనలు, ఆధ్యాత్మిక ప్రసంగాలను ఇచట వీక్షించవచ్చు.ఇది సంపూర్ణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది అని చెప్పవచ్చును.

• పర్యావరణ అనుకూల కార్యక్రమాలు

ఈ మహా కుంభమేళాలో వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం ‌వంటి కార్యక్రమాలు ‌పర్యావరణం అనుకూల పద్దతులను స్వీకరించి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుంది.

• UNESCO గుర్తింపు ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ), సాంస్కృతిక సంస్థ యునెస్కో, United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) ఈ మహా కుంభమేళాలో యొనెస్కో మానవత్వ అసంపూర్ణ సాంకేతిక వారసత్వ ప్రతినిధి జాబితాలో లిఖించబడింది. ఈ గుర్తింపు దాని ప్రపంచ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది[9].

.• ఒక గ్లోబల్ ఆధ్యాత్మిక అయస్కాంతం

ఈ మహా కుంభమేళా హిందూ మత భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుండటమే కాకుండా వివిధ ధర్మాలు, వర్ణాలు, విశ్వాసాలు, నేపథ్యాల నుండి కోరుకునే వారికి కూడా ఆకర్షిస్తోంది.అంతర్జాతీయ పర్యాటకులు, ఆధ్యాత్మిక ఔత్సాహికులు ఈ పవిత్రమైన కార్యక్రమం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

పుణ్య స్నానాలు

[మార్చు]

ఈ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయడం అత్యంత పవిత్రమైనది భావిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో సాధువులు సన్యాసులు,మహంతులు, మొదలగు వారు పుణ్యస్నానాలు ఆచరిస్తారు.వారి పుణ్యస్నానాలు అనంతరం సామాన్య ప్రజలు, భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు. మన దేశం నుండియే కాకుండా విదేశాల నుంచి కూడా హిందూ వులు పుణ్యస్నానాలు ఆచరించడానికి ఈ మహా కుంభమేళాకు తరలి వస్తున్నారు. ఈ మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసే సమయంలో నీరు అమృతంలా మారుతాయిని భక్తులు విశ్వాసం. ఈ పుణ్యస్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి మోక్షము లభిస్తుందని హిందూవుల నమ్మకం.

ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో జనవరి 13న నుంచి ఫిబ్రవరి 26 వరకు మొత్తం 45 రోజుల పాటు జరిగే పుణ్యస్నానాల తేదీని ఖరారు చేసింది. మొదటి పుణ్యస్నానాలు జనవరి 13 న‌ పుష్య పూర్ణిమ రోజున జరిగింది.‌జనవరి 14 న మకర సంక్రాంతి పర్వదినాన సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు అని తెలిపింది. జనవరి 29 న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించి వచ్చని తెలిపింది. ఫిబ్రవరి 3 న వసంత పంచమి శుభ ఘడియలను పురస్కరించుకొని పుణ్యస్నానాలు చేయవచ్చు అని ప్రకటించింది. ‌ఫిబ్రవరి 12 న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు ఆచరించవచ్చు అని పేర్కొంటుంది. చివరిగా ఫిబ్రవరి 26 న మహా శివరాత్రి పండుగను పురస్కరించుకుని ఈ మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు చేయవచ్చు అని ప్రకటించింది.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న 2025 మహా కుంభమేళా కోసం భక్తులకు ‌మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం కోసం ₹= 70 బిలియన్లకు పైగా ఖర్చు చేస్తుంది. కుంభమేళా లో అనుకోకుండా జరిగే ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం అగ్నిమాపక వాహనాలను సమకుర్చింది. కుంభమేళాలో పరిశుభ్రత పరిరక్షించడానికి ఐదువందల గంగ ప్రహరీలను నియమించింది. కుంభమేళా చుట్టూ పరిసర ప్రాంతాలలో 83 ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం 1428.68 కోట్ల రూపాయలు ఖర్చుకు అంచనా వేసి పనులు చేపట్టడానికి సంకల్పించింది. భక్తులకు, సాధు సన్యాసులకు , విదేశీ యాత్రికులకు సహాయం చేయడానికి కృత్రిమ మేధస్సు సాధనాలు చాట్ బాట్ ఉపయోగించేందుకు సిద్ధం చేసింది. ఈ మహా కుంభమేళా కు యాప్ సహాయం చేస్తుంది. ఇందులో భక్తులు, పర్యాటకులు, యాత్రికుల కోసం ఘాట్స్, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాలను అనుసంధానం చేసింది. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం భారత రైల్వే శాఖ వారు ప్రత్యేకించి రైల్వేల కోచ్ ల సంఖ్యకు కూడా పెంచింది[10].

కుంభమేళాలో గూగుల్ గులాబీల వర్షం

[మార్చు]

2025 ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా త్రివేణి సంగమంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మహా కుంభమేళా సందర్భంగా ప్రత్యేక యానిమేషన్ ను ప్రదర్శిస్తుంది. ఇది యూజర్లును ఆకట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా మహోత్సవాన్ని ఘనంగా జరుపుతుంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేషన్స్ చేస్తుంది. తన సెర్చ్ ఇంజన్ ప్లాట్ ఫామ్ లో గులాబీ రేకులతో కూడిన వర్చువల్ యానిమేషన్ ను‌ జోడించి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గూగుల్ లో కుంభమేళా మహా కుంభమేళా అని సేర్చ్ చేయగానే గులాబీ వర్షం పడుతున్నట్లు కనిపించే ఈ యానిమేషన్ అందరినీ ఆకట్టుకుంది. ఈ ఇంటరాక్టివ్ ఫీచర్ మహా కుంభమేళా వైభవాన్ని కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. యానిమేషన్ నచ్చిన వారికి సెర్ చేసే అవకాశం కూడా కల్పించింది.

ఆరోగ్య సేవలు

[మార్చు]

ఈ మహా కుంభమేళాలో హాజరయ్యే భక్తుల కోసం వారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ఆరోగ్య సేవలను ప్రభుత్వం ప్రారంభించింది.భక్తులు, యాత్రికుల కోసం సమగ్ర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసింది.‌ఈ మహా కుంభమేళాలో మొత్తం 407 మంది వైద్య అధికారులు,700 మందికి పైగా పారామెడికల్ సిబ్బందిని నియమించింది. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లల కోసం ప్రత్యేక రక్షణతో 24 గంటల వైద్య సేవలు ఏర్పాటు చేసింది.అనారోగ్యానికి గురి అయ్యే భక్తులు కోసం 100 పడకల సామర్థ్యంతో తాత్కాలిక కేంద్ర ఆస్పత్రిని ఏర్పాటు చేసి సేవలందింస్తుంది.

పారిశుద్ధ్య చర్యలు

[మార్చు]

ప్రయాగాలో జరుగుతున్న మహా కుంభమేళాలో పారిశుద్ధ్యం నియంత్రణ కొసం ప్రభుత్వం అన్ని విధాలుగా పారిశుద్ధ్య కార్మికులను, తాత్కాలిక ఉద్యోగులను నియమించి ఎటు వంటి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటోంది.150,000 మరుగుదొడ్లులను ఏర్పాటు చేసి దాదాపు పది మరుగుదొడ్లుకు ఒక స్వీపర్, పది మంది స్వీపర్లకు ఒక సూపర్ వైజర్లను ఏర్పాటు చేసి పరిశుభ్రత పరిరక్షించడానికి కృషి చేస్తుంది. ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అథారిటీ ఆధ్వర్యంలో మరుగుదొడ్లు,ముత్రశాలలను పరీశిలిస్తుంది.‌ త్రివేణి సంగమం ఘాట్లు, ఫుట్ పాత్లు, రోడ్డు పైన బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన, మూత్రవిసర్జన , చేత్తా చేదారం మొదలగు ప్రదేశాలను శుభ్రం చేయడానికి ఒక కాంపాక్ట్ మాన్రువల్ స్లీపింగ్ మోసిన్ కూడా మోహరించారు. మొదలగు అన్ని విధాల ఏర్పాటును క్షేత్రస్థాయిలో పరీశిలించడానికి పారిశుద్ధ్య స్థాయిని ట్రాక్ చేయడానికి క్యూఆర్ కోడ్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించింది[11].

తొక్కిసలాట మరణాలు

[మార్చు]

2025 జనవరి 29న కుంభమేళా ఉత్సవసందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు[12] [13]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. telugu, NT News (2025-01-13). "Maha Kumbh | 144 సంవత్సరాల తర్వాత మహా కుంభమేళా..! ఈ ఆరు రోజులు మరీ స్పెషల్‌..!". www.ntnews.com. Retrieved 2025-01-20.
  2. Velugu, V6 (2025-01-19). "కుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక: మన్ కీ బాత్లో ప్రధాని మోదీ". V6 Velugu. Retrieved 2025-01-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Hays, Jeffrey. "KUMBH MELAS, THE LARGEST GATHERINGS ON EARTH | Facts and Details". factsanddetails-com.translate.goog (in ఇంగ్లీష్). Retrieved 2025-01-20.
  4. ABN (2025-01-13). "Kumbh Mela 2025: నేటి నుంచే మహా కుంభమేళా!". Andhrajyothy Telugu News. Retrieved 2025-01-20.
  5. ABN (2024-12-13). "PM Modi: Kumbha Mela: 'ఒకే భారతదేశం, సమున్నత భారతదేశం' స్ఫూర్తితో మహా కుంభమేళా". Andhrajyothy Telugu News. Retrieved 2025-01-20.
  6. RAMA (2024-12-20). "2025 భోగి నుంచి [[మహాశివరాత్రి]] వరకూ మహాకుంభమేళా - అదిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజస్నానం తేదీలివే". telugu.abplive.com. Retrieved 2025-01-20. {{cite web}}: URL–wikilink conflict (help)
  7. V, Sudarshan. "Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా జరిగే ముఖ్యమైన తేదీలివే; సాంస్కృతిక ప్రాముఖ్యత, ఇతర వివరాలు." Hindustantimes Telugu. Retrieved 2025-01-20.
  8. Sharma), దీపు శర్మ (Deepu (2025-01-20). "మహా కుంభమేళా సన్నాహాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు, [[రాష్ట్రపతి]], [[ఉపరాష్ట్రపతి]], [[ప్రధానమంత్రి]], హోంమంత్రి హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు | భారతదేశ వార్తలు". eerojunews.in. Retrieved 2025-01-20. {{cite web}}: URL–wikilink conflict (help)
  9. "UNESCO - Kumbh Mela". ich.unesco.org (in ఇంగ్లీష్). Retrieved 2025-01-20.
  10. ABN (2025-01-17). "Kumbh Mela 2025: కుంభమేళాలో ఈ భక్తులకు ఫ్రీ ఫుడ్, వసతి.. వివరాల కోసం కాల్ చేయండి." Andhrajyothy Telugu News. Retrieved 2025-01-20.
  11. "Kumbh Mela 2025: కుంభమేళాతో.. 12లక్షల మందికి తాత్కాలిక ఉపాధి". EENADU. Retrieved 2025-01-20.
  12. "Prayagraj: ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట.. 30 మంది మృతి: మహాకుంభ్‌ డీఐజీ". EENADU. Retrieved 2025-01-29.
  13. "Mahakumbh Mela: Thirty killed in crush at India's Kumbh Mela festival". www.bbc.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2025-01-29. Retrieved 2025-01-29.