Jump to content

జాజ్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 20°51′N 86°20′E / 20.85°N 86.33°E / 20.85; 86.33
వికీపీడియా నుండి
జాజ్‌పూర్
పట్టణం
జాజ్‌పూర్ లోని బిరాజా దేవాలయం
జాజ్‌పూర్ లోని బిరాజా దేవాలయం
జాజ్‌పూర్ is located in Odisha
జాజ్‌పూర్
జాజ్‌పూర్
ఒడిశా పటంలో పట్టణ స్థానం
Coordinates: 20°51′N 86°20′E / 20.85°N 86.33°E / 20.85; 86.33
దేశంభారతదేశం
రాష్ట్రంఒడిశా
జిల్లాజాజ్‌పూర్
Founded byజజాతి కేసరి
Elevation
8 మీ (26 అ.)
జనాభా
 (2011)[1]
 • Total37,458
 • జనసాంద్రత620/కి.మీ2 (1,600/చ. మై.)
భాషలు
 • అధికారికఒరియా
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationOD-04 &OD-34
Websitewww.jajpur.nic.in

జాజ్‌పూర్ ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఇది కేసరి రాజవంశం యొక్క రాజధానిగా ఉండేది. ఆ తరువాత దీని స్థానంలో కటక్, రాజధాని అయింది.[1][2] ఇది జాజ్‌పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పాణికోయిలిలో ఉంది. పట్టణ పరిపాలనను పురపాకల సంఘం నిర్వహిస్తుంది.

చరిత్ర

[మార్చు]

జాజ్‌పూర్, పురాతన బిరాజా ఆలయం ఉన్న ప్రదేశం, దీనిని మొదట బిరాజా అని పిలిచేవారు. పురాతన గ్రంథాలలో ఈ పట్టణానికి విరంజ, వరంజ-నగర, వరాహ-తీర్థ అనే పేర్లు ఉండేవి. [3] భౌమ-కార రాజులు తమ రాజధానిగా గుహదేవపతాక (లేదా గుహేశ్వరపతాక) ను స్థాపించారు. ఇదే ఇప్పటి జాజ్‌పూర్ సమీపంలోని గోహిరతికార్ (లేదా గోహిరతిక్ర) అని గుర్తించారు. [4] తరువాతి సోమవంశీ రాజులు తమ రాజధానిని యయాతినగర (నేటి బింక) నుండి గుహేశ్వరపతాకకు మార్చారు. పట్టణానికి అభినవ-యయాతినగర అని పేరు పెట్టారు. [3]

తరువాత, జాజ్పూర్ [5] పట్టణం యజనగర అని పిలువబడింది. ఒక సిద్ధాంతం ప్రకారం, ఈ పేరు "యయాతినగర" నుండి వచ్చింది. మరొక సిద్ధాంతం ఏమిటంటే, ఇది గంగా - గజపతి కాలంలో (11వ-16వ శతాబ్దం) ప్రాచుర్యం పొందిన యజ్ఞాల నుండి ఉద్భవించింది. [6] తబకత్ -ఇ-నసిరి, తారిఖ్-ఇ-ఫిరుజ్షాహి వంటి ముస్లిం చరిత్రలలో, ఈ పట్టణం పేరును "జజ్‌నగర్"గా పేర్కొన్నారు. తరువాత, " -నగర్ " ("పట్టణం") ప్రత్యయం స్థానంలో " -పూర్ " చేరి, పేరు "జాజ్‌పూర్"గా మారింది. [3]

భౌగోళికం, శీతోష్ణస్థితి

[మార్చు]
జాజ్‌పూర్[7]
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
41
 
29
15
 
 
26
 
32
19
 
 
28
 
35
23
 
 
49
 
37
25
 
 
131
 
38
26
 
 
243
 
35
26
 
 
341
 
32
26
 
 
401
 
32
25
 
 
270
 
32
25
 
 
196
 
32
23
 
 
37
 
31
19
 
 
39
 
29
15
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
శీతోష్ణస్థితి డేటా - Jajpur
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) 29.2
(84.6)
32.3
(90.1)
35.4
(95.7)
37.0
(98.6)
37.5
(99.5)
34.7
(94.5)
32.3
(90.1)
31.8
(89.2)
32.3
(90.1)
32.0
(89.6)
30.7
(87.3)
29.0
(84.2)
32.9
(91.1)
సగటు అల్ప °C (°F) 15.2
(59.4)
18.7
(65.7)
22.6
(72.7)
25.0
(77.0)
26.2
(79.2)
26.1
(79.0)
25.5
(77.9)
25.3
(77.5)
25.0
(77.0)
23.3
(73.9)
19.1
(66.4)
15.0
(59.0)
22.3
(72.1)
సగటు అవపాతం mm (inches) 41.3
(1.63)
26.0
(1.02)
27.8
(1.09)
48.5
(1.91)
130.6
(5.14)
243.4
(9.58)
340.6
(13.41)
401.1
(15.79)
269.5
(10.61)
195.8
(7.71)
37.2
(1.46)
38.5
(1.52)
1,800.3
(70.87)
Source: Jajpur Weather

జనాభా వివరాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జాజ్‌పూర్ పట్టణ జనాభా 37,458. అందులో 19,216 మంది పురుషులు, 18,242 మంది మహిళలు. 6 సంవత్సరాల లోపు పిల్లలు 3,823. జాజ్‌పూర్‌లో అక్షరాస్యుల సంఖ్య 29,975, ఇది జనాభాలో 80.0%, పురుషులలో అక్షరాస్యత 83.5% కాగా, స్త్రీలలో ఇది 76.4%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 89.1%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 92.9%, స్త్రీల అక్షరాస్యత రేటు 85.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 6,363 షెడ్యూల్డ్ తెగల జనాభా 565. 2011లో జాజ్‌పూర్‌లో 8198 గృహాలు ఉన్నాయి [1]

విద్య

[మార్చు]

పట్టణం లోని కళాశాలలు

[మార్చు]
  • NC అటానమస్ కాలేజ్, జాజ్‌పూర్ టౌన్
  • SG కళాశాల, కనికపడ, జాజ్‌పూర్
  • VN అటానమస్ కాలేజ్, జాజ్‌పూర్ రోడ్

దేవాలయాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Census of India: Jajpur". www.censusindia.gov.in. Retrieved 7 January 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Census2011Gov" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. Local Self-government in British Orissa, 1869-1935. Retrieved 21 June 2019.
  3. 3.0 3.1 3.2 Thomas E. Donaldson 2001, p. 51.
  4. Thomas E. Donaldson 2001, p. 6.
  5. Saran, Richard D.; Ziegler, Norman P. (2001), "THE TRANSLATIONS", The Mertiyo Rathors of Merto, Rajasthan, Select Translations Bearing on the History of a Rajput Family, 1462–1660, Volumes 1–2, University of Michigan Press, pp. 81–216, doi:10.3998/mpub.19305.15#metadata_info_tab_contents, ISBN 978-0-89148-085-3, retrieved 2021-05-06
  6. Kailash Chandra Dash 2010, p. 169.
  7. Chhotray, G. P.; Pal, B. B.; Khuntia, H. K.; Chowdhury, N. R.; Chakraborty, S.; Yamasaki, S.; Ramamurthy, T.; Takeda, Y.; Bhattacharya, S. K.; Nair, G. Balakrish (2002). "Incidence and Molecular Analysis of Vibrio cholerae Associated with Cholera Outbreak Subsequent to the Super Cyclone in Orissa, India". Epidemiology and Infection. 128 (2): 131–138. ISSN 0950-2688.