అక్షాంశ రేఖాంశాలు: 19°55′56″N 73°31′51″E / 19.93222°N 73.53083°E / 19.93222; 73.53083

త్రయంబకేశ్వరాలయం (నాసిక్)

వికీపీడియా నుండి
(త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
త్రయంబకేశ్వరాలయం
త్రయంబకేశ్వరాలయం is located in Maharashtra
త్రయంబకేశ్వరాలయం
త్రయంబకేశ్వరాలయం
మహారాష్ట్ర రాష్ట్రంలొ ఉనికి
భౌగోళికాంశాలు :19°55′56″N 73°31′51″E / 19.93222°N 73.53083°E / 19.93222; 73.53083
పేరు
ఇతర పేర్లు:త్రయంబకేశ్వర్
ప్రధాన పేరు :త్రయంబకేశ్వర్ దేవాలయం
దేవనాగరి :त्र्यंबकेश्वर
సంస్కృతం:త్రయంబకేశ్వర
తమిళం:திரியம்பகேஸ்வரர் கோயில், நாசிக்
మరాఠీ:त्र्यंबकेश्वर
ప్రదేశం
దేశం: భారతదేశం
రాష్ట్రం:మహారాష్ట్ర
జిల్లా:నాసిక్
స్థానికం:త్రింబక్
ఆలయ వివరాలు
ముఖ్య_ఉత్సవాలు:మహాశివరాత్రి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :హేమద్పంతి
ఇతిహాసం
సృష్టికర్త:బాలాజీ బాజీరావు

త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ శివాలయం (श्री त्र्यंबकेश्वर ज्योतिर्लिंग मंदिर) త్రయంబక్ పట్టణంలోని[1] ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఇది నాసిక్ నుండి 24 నక్షిక్ రహదారిలో ఉంది. ఇది హిందూ దేవుడు శివునికి అంకితం చేసిన దేవాలయం. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద హిందూ వంశావళి నమోదు చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక్ సమీపంలో ఉంది. ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నవీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావుసాహెబ్ పార్నేర్కర్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్త కుంట (పవిత్రమైన చెరువు), భారతదేశం ద్వీపకల్పలో రెండవ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం. కుండ అంచున సర్దార్ ఫడ్నవీస్, అతని భార్య ప్రతిమను చూడవచ్చు. ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు.[1]

పురాణ ఇతిహాసం, చరిత్ర

[మార్చు]
త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.

ఆలయ విశేషాలు

[మార్చు]

పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు.

ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చతుర్స్రాకారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.

కుశావర్తనం, గోదావరి పుట్టుక

[మార్చు]

గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.

గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం.

రవాణా మార్గాలు

[మార్చు]

నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి. అలాగే రైల్వే స్టేషను నుండి దేవాలయం నలభై కిలోమీటర్లు. ఇక్కడి నుండి ప్రవేట్ వ్యాన్లు బస్సులు ఉంటాయి.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Shri Trimbakeshwar Devasthan Trust, Trimbakeshwar, Nashik". www.trimbakeshwartrust.com. Retrieved 2023-01-07.

నోట్సు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.