Jump to content

వారసిగూడ

అక్షాంశ రేఖాంశాలు: 17°25′05″N 78°30′47″E / 17.418°N 78.513°E / 17.418; 78.513
వికీపీడియా నుండి
(వారాసిగూడ నుండి దారిమార్పు చెందింది)
వారసిగూడ
సమీపప్రాంతం
వారసిగూడ is located in Telangana
వారసిగూడ
వారసిగూడ
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
వారసిగూడ is located in India
వారసిగూడ
వారసిగూడ
వారసిగూడ (India)
Coordinates: 17°25′05″N 78°30′47″E / 17.418°N 78.513°E / 17.418; 78.513
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
వార్డువార్డు నెం. 11 సర్కిల్ నెం. 18
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 061
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంసికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

వారసిగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఇది సికింద్రాబాదు సమీపంలో ఉంది.[1] ఈ ప్రాంతానికి వారిస్ నవాబ్ పేరును పెట్టారు.

పద వివరణ

[మార్చు]

వారసిగూడ అనే పేరు వారిస్, గూడ అనే రెండు పదాల నుండి వచ్చింది. హైదరాబాద్ నిజాం నుండి బహుమతిగా ఈ భూమిని పొందిన వారిస్ ఖాన్ అనే వ్యక్తి ఆ భూమిని వేర్వేరు వ్యక్తులకు విక్రయించాడు. గూడ అంటే జనాభా ఉన్న ప్రాంతం అని అర్థం. ఈ ప్రాంతం చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిమితుల్లోకి వస్తుంది

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో ఎల్ఎన్ నగర్, పార్సిగుట్ట, అంబర్ నగర్, మహమూద్గుడ, బౌద్ధ నగర్, మాధురి నగర్, పార్సిగుట్ట, స్కందగిరి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

సంస్కృతి

[మార్చు]

ఇస్లామిక్ మత ప్రార్థనా స్థలాలు జామియా మసీదు అల్-కౌసర్, మసీదు ఇ ఫిర్దాస్, మసీదు ఇ సామి వో హుస్సేన్, మసీదు-ఇ-నూర్-ఇ-మొహమ్మదియా మొదలైన మసీదులు ఉన్నాయి.

హిందూ మత ప్రార్థనా స్థలాలు శ్రీ ఉమాచంద్రమౌలేశ్వరస్వామి దేవాలయం, సీతారామాంజనేయస్వామి దేవాలయం, షిరిడి సాయిబాబా దేవాలయం, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం[2] మొదలైన దేవాలయాలు ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]

ఇక్కడికి ఒక కిలోమీటరు దూరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉంది. కాకతీయ టెక్నో స్కూల్, జ్యోతి మోడల్ హైస్కూల్, సుమిత్రా హైస్కూల్, జవహర్ ఇంగ్లీష్ హైస్కూల్, బాలాజీ హైస్కూల్, జాన్సన్ గ్రామర్ స్కూల్, నేతాజీ పబ్లిక్ హైస్కూల్ మొదలైన పాఠశాలలు ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో వారసిగూడ మీదుగా 86 నెంబరు గల బస్సు సికింద్రాబాద్ నుండి కోఠి వరకు, 107జె నెంబరు గల బస్సు సికింద్రాబాద్ నుండి దిల్‍సుఖ్‍నగర్ వరకు నడుపబడుతున్నాయి.[3] ఇక్కడికి సమీపంలో ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Warasiguda Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  2. "Sri SubrahmanyaSwamy Devalayam". srisubrahmanyaswamydevalayamskandagiri.org. Retrieved 2021-01-31.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.
"https://te.wikipedia.org/w/index.php?title=వారసిగూడ&oldid=4149846" నుండి వెలికితీశారు