నల్గొండ క్రాస్ రోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్గొండ క్రాస్ రోడ్
పరిసరప్రాంతం
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాద్ మహానగర పాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 036
Vehicle registrationటిఎస్-11
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమలక్‌పేట్ శాసనసభ నియోజకవర్గం
నగర ప్రణాళిక సంస్థహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

నల్గొండ క్రాస్ రోడ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రధాన జంక్షన్.[1] ఇది దిల్‍సుఖ్‍నగర్, సైదాబాద్ ప్రాంతాల మధ్య నిర్మించబడింది.

సమీప ప్రాంతాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో చాదర్ ఘాట్, అజంతా కాలనీ, పాల్టన్, తిర్మల ఆర్కేడ్, శ్రీ కృపా మార్కెట్, జమాల్ కాలనీ, మలక్‌పేట మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ప్రార్థనా స్థలాలు

[మార్చు]

ఇక్కడికి సమీపంలో సాయిబాబా దేవాలయం, రాఘవేంద్ర మఠం, శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ శ్యామ్ బాబా మందిరం, మసీదు-ఎ-అహ్మద్ అలీ ఖాన్, జామా మసీదు బసిటియా, మసీదు హదియా అమ్రీన్ మొదలైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయి.

విద్యాసంస్థలు

[మార్చు]

శ్రీ వాణి మహిళల జూనియర్ డిగ్రీ, పి.జి. కళాశాల, ఆర్.జి కేడియా కాలేజ్ ఆఫ్ కామర్స్, కళాంజలి కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్, ఆడమ్స్ హైస్కూల్, యూరోకిడ్స్, ద్వారకామయ్య హైస్కూల్, హబీబ్ ముస్తఫా ఎస్/ఓ ఫహీమ్ ఖురేషి, శాంతినికేతన్ కాన్సెప్ట్ స్కూల్ ఉన్నాయి.

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నల్గొండ క్రాస్ రోడ్ మీదుగా ఎల్.బి.నగర్, సికింద్రాబాద్, ఎన్జీవోస్ కాలనీ, మేడ్చల్, దిల్‍సుఖ్‍నగర్, న్యూ మారుతి నగర్ వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి.[2] ఇక్కడికి సమీపంలోని మలక్‌పేటలో ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Nalgonda Crossroads Flyover, Jamal Colony, Malakpet Locality". www.onefivenine.com. Retrieved 2021-01-31.
  2. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-31.