బ్యాంక్ స్ట్రీట్ (హైదరాబాదు)
బ్యాంక్ స్ట్రీట్ | |
---|---|
సమీప ప్రాంతం | |
Coordinates: 17°23′09″N 78°28′46″E / 17.38584°N 78.479347°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 001 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | గోషామహల్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
బ్యాంక్ స్ట్రీట్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రధాన వాణిజ్య ప్రాంతం. ఈ వీధిలో భారతీయ స్టేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ మొదలైన బ్యాంకులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పార్కు ఉంది. బ్లడ్ బ్యాంక్‌కు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం అబిడ్స్, చాదర్‌ఘాట్‌ల మధ్యలో ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో ట్రూప్ బజార్ మార్కెట్, గాంధీ నగర్, వకీల్ వాడి, రాంకోటి, సుల్తాన్ బజార్, కోఠి మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఈ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్ దుకాణాలు (గుజరాతీ గల్లీ) ఎక్కువగా ఉన్నాయి. బొంబాయి హల్వా అని పిలువబడే ఒక ప్రసిద్ధ స్వీట్ల దుకాణం, గ్రాండ్ హోటల్ అనే ప్రసిద్ధ ఇరానీ కేఫ్,[2] ప్రభుత్వ ఈ.ఎన్.టి ఆసుపత్రి, నిజాం కాలం నుండి రుస్తుం ఫ్రామ్ అని పిలువబడే చాలా పురాతనమైన బార్, భారతదేశంలోని పురాతన అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలలో ఒకటైన జె & జె డెచాన్ ల్యాబ్స్, 101 ఏళ్ల నాటి ఆయుర్వేద తయారీ యూనిట్ కూడా ఇక్కడ ఉన్నాయి.
రవాణా
[మార్చు]ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రధాన బస్ హబ్‌ను ఉంది. నగరంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి నుండి రవాణా సౌకర్యం ఉంది.[3] సమీపంలోని నాంపల్లిలో ఎంఎంటిఎస్ రైలు స్టేషన్ ఉంది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడికి సమీపంలోనే ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- జగన్నాథ దేవాలయం
- సాయిబాబా దేవాలయం
- మస్జిద్ జోరావర్ ఖాన్
- మస్జిద్ ఇంతేజామ్ జంగ్
విద్యాసంస్థలు
[మార్చు]- ప్రగతి మహావిద్యాలయం
- మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
- జి. పుల్లారెడ్డి జూనియర్ కళాశాల
- శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత & నృత్య కళాశాల
- బచ్‌పన్ ప్లే స్కూల్
- డైమండ్ జూబ్లీ హైస్కూల్
- రోసరీ కాన్వెంట్ హైస్కూల్
మూలాలు
[మార్చు]- ↑ "Bank Street, Sultan Bazar, Koti Locality". www.onefivenine.com. Archived from the original on 2021-01-30. Retrieved 2022-10-01.
- ↑ Bhavani, Divya Kala (2017-11-09). "Flavours of Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-28.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-09-24.