భారతదేశం తాలూకాలు
భారతదేశం పాలనా వ్వవస్థ పరంగా కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక పరిపాలనా డివిజన్‌గా పరిగణిస్తారు. ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప జిల్లాలు (రెవెన్యూ డివిజన్లు) గా చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం తిరిగి రెవెన్యూ డివిజన్లు పరిధిని, రెవెన్యూ గ్రామాల జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికగా కొన్ని రెవెన్యూ గ్రామాలతో తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలిచే ఉప విభాగాలుగా ఏర్పడ్డాయి.[1] వాటిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", పేర్లు వాడుకలో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో అంతకుముందు ఉన్న తాలుకాలను రద్దు చేసి 1985లో తెలుగు దేశం ప్రభుత్వ పరిపాలనలో, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను 1985 మే 25న ప్రవేశపెట్టడం జరిగింది.[2] మండలాలు ఇవి బ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవిగా ఉండేటట్లు , కొన్ని గ్రామ పంచాయతీలు లేదా రెవెన్యూ గ్రామాలను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి. అలాగే జిల్లాని కూడా కొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.[3][3][4]
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/cd/Setup_of_India.png/742px-Setup_of_India.png)
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
- పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక) గా పరిగణింపబడుతుంది.
- ఒక మాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక) గా పరిగణింపబడుతుంది.
- పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
- తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
- కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది, పంచాయితీ కంటే పెద్దది) కొన్ని రాష్ట్రాలలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వాటి స్థానంలో మండల వ్యవస్థను తీసుకొచ్చారు.
వివిధ రాష్ట్రాలలో జిల్లాల వారీగా తాలూకాలు క్రింద ఇవ్వబడ్డాయి.
రాష్ట్రాలవారీ తాలూకాల జాబితాలు
[మార్చు]రాష్ట్రాలలో తాలూకాలు, మండలాలు, తహసీళ్ళు
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ తాలూకాలు
- అరుణాచల్ ప్రదేశ్ తాలూకాలు
- అస్సాం తాలూకాలు
- బీహార్ తాలూకాలు
- చత్తీస్‌గఢ్ తాలూకాలు
- గోవా తాలూకాలు
- గుజరాత్ తాలూకాలు
- హర్యానా తాలూకాలు
- హిమాచల్ ప్రదేశ్ తాలూకాలు
- జమ్మూ, కాశ్మీరు తాలూకాలు
- జార్ఖండ్ తాలూకాలు
- కర్ణాటక తాలూకాలు
- కేరళ తాలూకాలు
- మధ్య ప్రదేశ్ తాలూకాలు
- మహారాష్ట్ర తాలూకాలు
- మణిపూర్ తాలూకాలు
- మేఘాలయ తాలూకాలు
- మిజోరాం తాలూకాలు
- నాగాలాండ్ తాలూకాలు
- ఒడిషా తాలూకాలు
- పంజాబ్ తాలూకాలు
- రాజస్థాన్ తాలూకాలు
- సిక్కిం తాలూకాలు
- తమిళనాడు తాలూకాలు
- త్రిపుర తాలూకాలు
- ఉత్తరాంచల్ తాలూకాలు
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు
- పశ్చిమ బెంగాల్ తాలూకాలు
కేంద్రపాలిత ప్రాంతాల తాలూకాలు, మండలాళు, తహసీళ్ళు
[మార్చు]- జమ్మూ కాశ్మీరు తాలూకాలు
- అండమాన్ నికోబార్ దీవులు తాలూకాలు
- చండీగఢ్ తాలూకాలు
- దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ తాలూకాలు
- ఢిల్లీ తాలూకాలు
- లక్షద్వీప్ తాలూకాలు
- పుదుచ్చేరి తాలూకాలు
- లడఖ్ తాలూకాలు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Tehsils List". web.archive.org. 2023-09-10. Archived from the original on 2023-09-10. Retrieved 2023-09-10.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ https://www.gktoday.in/question/in-which-year-mandal-system-introduced-in-andhra-p
- ↑ 3.0 3.1 https://books.google.co.in/books?id=Chvak7Vu9xYC&pg=PA65&redir_esc=y#v=onepage&q&f=false
- ↑ by (2017-12-19). "Panchayati raj of Andhra Pradesh". Andhra Pradesh PCS Exam Notes. Retrieved 2020-11-01.