భద్రం
భద్రం | |
---|---|
జననం | భద్రం అక్టోబర్ 8 రాజమండ్రి , ఆంధ్రప్రదేశ్ , భారతదేశం |
వృత్తి | నటుడు, వైద్యుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2015 – ప్రస్తుతం |
బంధువులు | సోము వీర్రాజు |
భద్రం తెలుగు సినిమా హాస్య నటుడు, వైద్యుడు. ఆయన 2015లో విడుదలైన జ్యోతిలక్ష్మీ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టాడు.[1]
జననం, విద్యాభాస్యం
[మార్చు]భద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జన్మించాడు. ఆయన తండ్రి గిరి యుగంధర్ నాయుడు కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేశాడు. ఆయన బెంగుళూర్లో ఫిజియోథెరపీ కోర్స్ పూర్తి చేశాడు. అతను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు సోము వీర్రాజుకు అల్లుడు.
వృత్తి జీవితం
[మార్చు]భద్రం హైదరాబాద్‌లో ఎర్గొనోమిక్స్ (ఫిజియోథెరపిస్ట్) డాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తూ, దేశవ్యాప్తంగా ఎర్గానామిక్స్ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు.[2]
సినీ ప్రస్థానం
[మార్చు]భద్రం డాక్టర్‌గా పనిచేస్తూ సినిమాలపై ఇష్టంతో ‘లవ్ పెయిన్’ పేరుతో మొదట చిన్న వీడియో చేశాడు. ఆయన అనంతరం ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ తీసి అందులో నటించాడు. ఈ షార్ట్‌ఫిల్మ్‌ను చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఆయన దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మీ సినిమాలో అవకాశం ఇచ్చాడు.[3]
నటించిన సినిమాలు
[మార్చు]- జ్యోతిలక్ష్మీ (2014)
- ఊహలు గుస గుసలాడే (2014)
- రౌడీ ఫెలో (2014)
- చందమామ కథలు (2014)
- సూర్య వర్సెస్ సూర్య (2015)
- అరకు రోడ్ లో (2016)
- భలేభలే మగాడివోయ్
- గల్ఫ్ (2017)
- మహానుభావుడు (2017) - జిడ్డేశ్
- మిక్చర్ పొట్లం (2017)
- అమ్మాయిలంతే అదో టైపు (2017)
- జువ్వ (2018)
- ఇంటలిజెంట్ (2018)
- విజేత (2018)
- ఎందుకో ఏమో (2018)
- ఈ మాయ పేరేమిటో (2018)
- సుబ్రమణ్యపురం (2018)
- ఎన్.టి.ఆర్. కథానాయకుడు (2019)
- క్రేజీ క్రేజీ ఫీలింగ్ (2019)
- నేను నా నాగార్జున (2019)
- రాయలసీమ లవ్ స్టోరీ (2019)
- మిస్ మ్యాచ్ (2019)
- భాగ్యనగరవీధుల్లో గమ్మత్తు (2019)
- గువ్వ గోరింక (2020)
- శతమానంభవతి
- మిస్టర్
- ఒక్క అమ్మాయి తప్ప
- లోఫర్
- ఎక్కడికిపోతావు చిన్నవాడా
- ప్రేమమ్
- పండగచేస్కో
- డిక్టేటర్
- వైశాఖం
- గల్ఫ్
- రణరంగం (2019)
- రాజ్‌దూత్ (2019)
- చావు కబురు చల్లగా (2021)
- బట్టల రామస్వామి బయోపిక్కు (2021)
- షాదీ ముబారక్ (2021)
- బంగారు బుల్లోడు (2021)
- ముగ్గురు మొనగాళ్లు (2021)
- టక్ జగదీష్ (2021)
- అర్జున ఫల్గుణ (2021)
- సూపర్ మచ్చి (2022)
- వర్జిన్ స్టోరి (2022)
- 69 సంస్కార్ కాలనీ (2022)
- జిన్నా (2022)
- ఊర్వశివో రాక్షసివో (2022)
- రాజయోగం (2022)
- గ్రంధాలయం (2023)
- రంగమర్తాండ (2023)
- కళ్యాణమస్తు (2023)
- నాతో నేను (2023)
- శబరి (2023)
- మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (2023)
- ఉమాపతి (2023)
- బ్రీత్ (2023)
- సుందరం మాస్టర్ (2024)
- వి లవ్ బ్యాడ్ బాయ్స్ (2024)
- భీమా (2024)
- ఆ ఒక్కటీ అడక్కు (2024)
- నింద (2024)
వెబ్ సిరీస్
[మార్చు]- ఆహా నా పెళ్ళంట
- అతిధి (2023)
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (21 October 2017). "డాక్టర్ టు యాక్టర్". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
- ↑ Sakshi (18 July 2020). "డాక్టర్ అయ్యాకే యాక్టర్ అయ్యాడు 'భద్రమ్"". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.
- ↑ Sakshi (18 September 2014). "భద్రంకు పూరి జగన్నాథ్ ఆఫర్". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.