Jump to content

నింద

వికీపీడియా నుండి
నింద
దర్శకత్వంరాజేష్ జగన్నాథం
రచనరాజేష్ జగన్నాథం
నిర్మాతది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
రాజేష్ జగన్నాథం
తారాగణంవరుణ్ సందేశ్
అనీ
త‌నికెళ్ల‌భ‌ర‌ణి
మైమ్ మధు
ఛాయాగ్రహణంరమీజ్ నవీత్
కూర్పుఅనిల్ కుమార్
సంగీతంసంతు ఓంకార్
నిర్మాణ
సంస్థ
ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2024 జూన్ 21
దేశం భారతదేశం
భాషతెలుగు

నింద 2024లో తెలుగులో విడుదలైన మర్డర్ థ్రిల్లర్ సినిమా. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించాడు. వరుణ్ సందేశ్, అనీ, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, మైమ్ మధు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను మే 16న,[1] ట్రైలర్‌ను జూన్ 11న విడుదల చేయగా[2] సినిమాను జూన్ 21న విడుదల చేశారు.

కాండ్రకోట గ్రామంలో మంజు అనే అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ హత్య బాలరాజు (ఛత్రపతి శేఖర్‌) చేశాడని కోర్ట్‌లో రుజువు కావడంతో న్యాయమూర్తి సత్యానంద్‌ (తనికెళ్ల భరణి) ఉరిశిక్ష విధిస్తాడు. సత్యానంద్‌ (తనికెళ్ల భరణి) కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) జాతీయ మానవ హక్కుల సంస్థలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఈ హత్య బాలరాజు (ఛత్రపతి శేఖర్‌) చేయలేదని రిటైర్డ్ అయిన చివరిరోజుల్లో తన కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్)కు చెప్పి సత్యానంద్‌ మరణిస్తాడు. చనిపోయిన సత్యానంద్‌ కోసం అతని కొడుకు వివేక్‌ (వరుణ్‌ సందేశ్‌) ఏం చేశాడు? వివేక్ ఈ కేసుని ఎలా ఛేదించాడు? హంతకుడు ఎవరనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ జగన్నాథం[6][7]
  • సంగీతం: సంతు ఓంకార్
  • సినిమాటోగ్రఫీ: రమీజ్ నవీత్
  • మాటలు: శిరీష మణికృష్ణ
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ
  • ఎడిటర్: అనిల్ కుమార్

మూలాలు

[మార్చు]
  1. TV9 Telugu (16 May 2024). "థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‏తో నింద టీజర్.. వరుణ్ సందేశ్ ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడే." Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NTV Telugu (11 June 2024). "'నింద' పడితే తుడిచేదెలా? ఆసక్తికరంగా వరుణ్ సందేశ్ సినిమా ట్రైలర్". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  3. "వరుణ్ సందేశ్ 'నింద' మూవీ రివ్యూ.. ఒక నిర్దోషిని ఎలా కాపాడారు?". 10TV Telugu. 21 June 2024. Archived from the original on 31 December 2024. Retrieved 31 December 2024.
  4. Eenadu (19 June 2024). "నటుడిగా కొత్త తలుపులు తెరుచుకున్నాయి". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  5. Chitrajyothy (10 May 2024). "వరుణ్ సందేశ్ 'నింద' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల". Archived from the original on 11 May 2024. Retrieved 11 May 2024.
  6. Eenadu (22 June 2024). "కథని నమ్మి చేసిన చిత్రం.. 'నింద'". Archived from the original on 22 June 2024. Retrieved 22 June 2024.
  7. Chitrajyothy (19 June 2024). "'నింద' చూశాక.. ప్రతి ఒక్కరూ అలా అనుకుంటారు." Archived from the original on 22 June 2024. Retrieved 22 June 20 24. {{cite news}}: Check date values in: |accessdate= (help)

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నింద&oldid=4381488" నుండి వెలికితీశారు